నీ కళల ప్రపంచంలో నువ్వు ఉండకుండా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని కావ్యని చూసి జాలి పడతాడు. అంతలోనే మళ్ళీ స్వప్నని వెతకడానికి వచ్చి వీళ్ళ మీద జాలి చూపించడం ఏంటని దుప్పటి విసిరేసి గది నుంచి మెల్లగా బయటకి వస్తాడు. అప్పుడే స్వప్న కూడా మెల్లగా ఇంట్లోకి అడుగుపెడుతూ రాజ్ ని ఢీ కొడుతుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. నేను ఇక్కడే ఉంటే నువ్వు వస్తావని ఊహించాను అదే జరిగింది నేను ఇక్కడ ఉండటం మంచిదైందని రాజ్ అంటాడు. అప్పుడే కావ్యకి మెలుకువ వచ్చి బయటకి వచ్చి చూసేసరికి స్వప్నని చూసి షాక్ అవుతుంది. నువ్వు మళ్ళీ వచ్చావా ఎక్కడికి వెళ్లావ్ ఎవరితో వెళ్లావ్ మేమంతా ఏమై పోవాలని అనుకున్నావ్ మొత్తం కుటుంబాన్ని బజారున పడేసి మళ్ళీ ఏం మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావ్ అని నిలదీస్తుంది.
రాజ్: శభాష్ చాలా గొప్పగా నటిస్తున్నావ్. అసలు నీకు తెలియకుండానే వెళ్ళినట్టు నటిస్తున్నావ్ ఇంత మోసమా ఇన్ని అబద్ధాలా ఇన్ని నాటకాల నీ సంగతి తర్వాత చెప్తాను ముందు ఈ అతిలోక సుందరితో మాట్లాడాలి చెప్పు ఎందుకు చేశావ్ ఈ పని? నిన్ను నమ్మి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం తప్పా? ఏం తప్పు చేశానని నన్ను కాదని పెళ్లి నుంచి వెళ్లిపోయావ్? ఎవరు నిన్ను పంపించేశారు. నీ చెల్లెలిని పెళ్లి చేసుకునేలా ఎందుకు చేశావ్
స్వప్న: నాకేం తెలియదు నేను ఏ పాపం చేయలేదు. పెళ్లి నుంచి నేను వెళ్ళిపోవడం నిజం కానీ మీ పెళ్లి కావ్యతో జరిగింది అంటే అందుకు కారణం నా చెల్లి. అదే మిమ్మల్ని కోరి పెళ్లి చేసుకుంది
రాజ్: ఇదే సమాధానం నేను కోరుకుంది
కావ్య: ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు నేను ఈయన్ని నేను కోరి పెళ్లి చేసుకున్నాన? పెళ్లి మండపం నుంచి నువ్వు వెళ్ళిపోయి ఇలా నా మీద నిందలు వేస్తున్నావా తప్పనిసరి పరిస్థితుల్లో నేను తల వంచాను అమ్మానాన్న పరువు కోసం తాళి కట్టించాను
స్వప్న: నటించింది చాలు నీ మనసులో ఎప్పటి నుంచో డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలని కోరిక ఉంది పైకి మాత్రం డబ్బున్న వాళ్ళు అంటే ఇష్టం లేదని నటించావు అవకాశం దొరకగానే రాజ్ తో మూడు ముళ్ళు వేయించుకుని నన్ను రోడ్డు పాలు చేశావ్
రాజ్: నీ చెల్లి చేసిన మాయల గురించి మొత్తం చెప్పు
కావ్య: పళ్ళు రాలగొడతాను డబ్బున్న వాళ్ళం అని రాజ్ ఇంటి చుట్టూ నువ్వు తిరిగి నా మీదకు తోస్తావ్ ఏంటి. నిన్ను రోడ్డు పాలు చేసింది నేను కాదు నీ అత్యాశ
రాజ్: నువ్వు పెళ్లి నుంచి వెళ్లిపోయాను అని ఒప్పుకున్నావ్ మరి పెళ్ళికి ముందు రోజు కాల్ చేస్తే పెళ్లి నీకు ఇష్టమేనా అని అడిగితే ఎస్ అని ఎందుకు చెప్పావ్
స్వప్న: నేను రిసీవ్ చేయలేదు మీ కాల్ నేను లిఫ్ట్ చేయలేదు
రాజ్: మరి నువ్వు కాకపోతే ఎవరు చెప్పారు
కావ్య: నేను ఆ రోజు మా అక్క ఇంట్లో లేదు. మీరు కాల్ చేస్తే తాను లిఫ్ట్ చేయకపోతే ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని చెప్పలేకపోయాను అప్పుడు నేను దాని తరఫున నేను ఎస్ చెప్పాను
Also Read: మురారీకి నిజం చెప్పిన కృష్ణ - గౌతమ్ పెళ్లి నందినితో జరుగుతుందా?
స్వప్న: లేదు ఇది చెప్పేది అబద్దం ఇది కావాలని పెళ్లిని పీటల దాకా తెచ్చింది. నాకు తెలియకుండానే ఇష్టమని చెప్పింది. కావాలని ప్లాన్ చేసి ఇలా చేసింది అనుకున్నది సాధించిందని అనేసరికి కావ్య లాగిపెట్టి కొడుతుంది. నన్నే కొడతావా అని స్వప్న తిరిగి కొట్టబోతుంటే కావ్య చేయి పట్టుకుని ఆపుతుంది. వాళ్ళ మాటలు విని కనకం నిద్రలేచి బయటకి వస్తారు.
కావ్య: ఆరోజు నువ్వు అంత రాత్రి ఎక్కడికి వెళ్లావ్ నీ వెనుక ఎవరు ఉన్నారు నిన్ను ఎవరు ట్రాప్ చేశారు ఏం చెప్పి పెళ్లి మండపం నుంచి తీసుకుని వెళ్లారు
ఇప్పుడు రాహుల్ పేరు చెప్తే ఇద్దరం రోడ్డున పడతాం అప్పుడు ఇద్దరం అడుక్కుని తింటామని స్వప్న మనసులో అనుకుని మౌనంగా ఉంటుంది. నన్ను ఎవరు తీసుకుని వెళ్లలేదు నేనే వెళ్లిపోయాను
రాజ్: కొత్తగా నటించకు స్వప్న చెప్పేది నిజం తనకి తెలియకుండా నాటకం ఆడి నన్ను పెళ్లి చేసుకున్నావ్ ఆరోజు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటే పెళ్లి క్యాన్సిల్ చేసేదాన్ని. నువ్వు అసలు ఆడదానివేనా అందంగా ఉండగానే సరిపోదు ఆడదానిలా ఉండాలి. మొత్తం చేసింది నువ్వేనని తెలిసిపోయింది నిన్ను క్షమించను. ఇక దుగ్గిరాల ఇంటి నుంచి తరిమేసిన కోడలిగా బతుకుతావ్ శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోతావ్
కనకం గొడవ విని బయటకి వచ్చి చూసేసరికి స్వప్న ఎదురుగా ఉంటుంది. వెంటనే తనని కౌగలించుకుని క్షమించమని అడుగుతుంది. కనకం కోపంగా ఎవరు నువ్వు అని అరుస్తుంది. ఇంకోసారి అమ్మ అని పిలిస్తే ప్రాణం తీస్తానని అంటుంది.