UV Creations: యూవీ క్రియేషన్స్‌పై తమ ఫ్రస్ట్రేషన్‌ను ప్రభాస్ అభిమానులు ఏకంగా జాతీయ స్థాయిలో చూపించారు. #BoycottUVCreations హ్యాష్‌ట్యాగ్‌ను వీరు నేషనల్ లెవల్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఏకంగా లక్షకు పైగా ట్వీట్లు ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పడ్డాయి. రాధేశ్యామ్ రిలీజ్‌కు 20 రోజుల సమయం కూడా లేదు. ఇంకా నిర్మాతలు పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించకపోవడం ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది.
ఫిబ్రవరి 14వ తేదీన కూడా ఒక చిన్న 40 సెకన్ల గ్లింప్స్‌తో సరిపెట్టడం, ఇంతవరకు ఇంటర్వ్యూస్ ప్రారంభించకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి లోనవుతున్నారు. దీంతోపాటు అప్‌డేట్స్ కూడా సమయానికి రాకపోవడంతో యూవీ క్రియేషన్స్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో గుర్రుగా ఉన్నారు.
2013 ఫిబ్రవరి తర్వాత ఇప్పటివరకు గత తొమ్మిది సంవత్సరాల్లో ప్రభాస్‌వి కేవలం మూడు సినిమాలు మాత్రమే విడుదల అయ్యాయి. 2015లో బాహుబలి, 2017లో బాహుబలి 2, 2019లో సాహో విడుదల అయ్యాయి. సాహో వచ్చిన రెండున్నర సంవత్సరాల తర్వాత రాధేశ్యామ్ విడుదల కానుంది.
బాహుబలి 2 తర్వాత సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్ చెప్పినప్పటికీ... సాహో, రాధేశ్యామ్ సినిమాల స్కేల్ కారణంగా అది సాధ్యపడలేదు. ఈ రెండు సినిమాలకు నిర్మాతలు యూవీ క్రియేషన్సే కావడంతో ఫ్యాన్స్‌కు సహజంగానే యూవీ క్రియేషన్స్‌పై ఎప్పటి నుంచో కోపం ఉంది.
అయితే యూవీ క్రియేషన్స్ మాత్రం త్వరలోనే అప్‌డేట్స్ వస్తాయని చెబుతోంది. కానీ సినిమా రిలీజ్‌కు 20 రోజుల సమయం కూడా లేకపోవడం, ఇంతవరకు ప్రమోషన్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. అందుకే ఈ నెగిటివ్ ట్రెండ్ జరిగింది.