Ambani School Event: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ముంబైలో ఓ విద్యాసంస్థను నిర్వహిస్తున్నారు. తన తండ్రి ధీరూభాయ్ అంబానీ పేరిటి ఈ స్కూల్ రన్ అవుతోంది. తాజాగా ఈ స్కూల్ యానివర్సరీ జరిగింది. ముఖేష్ అంబానీ స్కూల్ లో యానివర్సరీ అంటే మామూలుగా ఉంటుందా మరి? బాలీవుడ్ దిగ్గజ నటులతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. స్టార్ కిడ్స్ అబ్‌రామ్ ఖాన్, యష్ జోహార్, ఆరాధ్య బచ్చన్‌లతో సహా చాలా మంది పిల్లలు తమ స్కూల్ వార్షికోత్సవ వేడుకలో డ్యాన్సులు చేసి అలరించారు.


స్టెప్పులతో ఆకట్టుకున్న ఐశ్వర్య, అభిషేక్, షారుఖ్, కరణ్  


షారుఖ్ ఖాన్ హిట్ మూవీ ‘ఓం శాంతి ఓం’ నుంచి దీవాంగి దీవాంగీ అనే పాటకు బాలీవుడ్ ప్రముఖులు స్టెప్పులతో అదరగొట్టారు. పిల్లలు స్టేజి మీద డ్యాన్స్ చేస్తే, వారు కింద ఉండి డ్యాన్స్ చేశారు. షారూఖ్ ఖాన్, కరణ్ జోహార్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ తో పాటు పలువురు సెలబ్రిటీలు స్టెప్పులు వేశారు. కరణ్, షారుఖ్, ఐశ్వర్య ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుతూ కనిపించారు. అభిషేక్ బచ్చన్, అగస్త్య నందా గ్రూప్ డ్యాన్స్ కూడా వీడియోలో కనిపించింది.  


ఈ వేడుకలో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు తైమూర్ అలీ ఖాన్ వేదికపై డ్యాన్స్ వేస్తున్నప్పుడు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. అటు గౌరీ ఖాన్ కూడా పిల్లల ప్రదర్శన సమంలో ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కనిపించారు. వేదికపై అబ్రామ్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు సుహానా ఖాన్,  షారుఖ్ ఖాన్ తో కలిసి ఎంజాయ్ చేసింది. ధీరూభాయ్ అంబానీ స్కూల్‌లో తమ కుమార్తె చదువుతున్న నేపథ్యంలో క్రికెటర్ రోహిత్ శర్మతో పాటు ఆయన  భార్య రితికా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యింది. షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ పిల్లలు మిషా, జైన్ కపూర్‌ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.


















ఆ వార్తలు అవాస్తవాలేనా?


గత కొంతకాలంగా ఐశ్వర్య రాయ్, అభిషేక్‌ బచ్చన్‌ విడాకులు తీసుకోబోతున్నారనే ఊహాగానాలు వినిపించాయి. తాజాగా అమితాబ్ చేసిన ఓ ట్వీట్ కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే, ఈ వార్తలు అన్నీ అవాస్తవాలేనని ఈ స్కూల్ యానివర్సరీ వేదికగా వెల్లడి అయ్యింది. వచ్చేటప్పుడు వేర్వేరు కార్లలో వచ్చిన అభిషేక్, ఐశ్వర్య ఈవెంట్ అనంతరం వెళ్లే సమయంలో మాత్రం ఇద్దరు ఒకేకారులో కలిసి వెళ్లారు. దీంతో విడాకుల వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.    






Read Also: ఆ సీన్లు నచ్చలేదు - ‘యానిమల్’ మూవీపై బాబీడియోల్ అన్న సన్నీ డియోల్ షాకింగ్ కామెంట్స్