Solanki Diwakar: చాలా మంది యువతీ యువకులు సినిమాల్లోకి రావాలని భావిస్తారు. నటీనటులుగా మారేందుకు హైదరాబాద్, ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. సినిమా అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తినేందుకు తిండి, ఉండేందుకు ఇల్లు లేకపోయినా సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అవకాశాల కోసం తిరుగుతారు. కానీ, అందరికీ అవకాశాలు దక్కవు. కొంత మంది మాత్రమే నటులుగా రాణిస్తారు. వెండితెరపై తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తారు. అలాంటి వారిలో ఒకరు నటుడు సోలంకి దివాకర్.


జీవనోపాధి కోసం పండ్లు అమ్ముతున్నదివాకర్


బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, హీరోయిన్ ప్రియాంక చోప్రాతో పాటు పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించారు సోలంకి దివాకర్. చక్కటి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. వాటిలో చాలా సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి. నటుడిగా ఆయనకంటూ ఓ గుర్తింపు వచ్చింది. కానీ, ఇప్పుడు అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. బతుకుబండి లాగించేందుకు పండ్ల బండి నడుపుతున్నాడు. 


సినిమాల్లోకి రాకముందు పాపడ్ లు అమ్మిన దివాకర్


సినిమాల్లోకి రాకముందు సోలంకి దివాకర్, థియేటర్లలో విరామ సమయంలో పాపడ్ లు అమ్మేవాడు. అదే సమయంలో నటనపై మక్కువ పెంచుకున్నాడు. నెమ్మదిగా సినిమాల్లో ప్రయత్నించి అవకాశాలు దక్కించుకున్నారు. కానీ, ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో జీవనోపాధి కోసం పండ్లు అమ్ముతున్నట్లు చెప్పాడు సొలంకి. సినిమాల ద్వారా నా కుటుంబ పోషణకు సరిపడ డబ్బులు వచ్చినా, పండ్లు అమ్మేవాడిని కాదన్నారు. ఎన్నో సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్నా, అవకాశాలు ఇచ్చేవారు లేరని చెప్పారు. అందుకే, వేరే మార్గం లేక పండ్లు అమ్ముతున్నట్లు తెలిపారు. నిజానికి సోలంకి దివాకర్ కరోనా సమయంలోనూ పండ్లు అమ్మాడు. కోవిడ్ కారణంగా సినిమా పరిశ్రమ మూతబడటంతో జీవనోపాధి కోసం ఆయన పండ్లు అమ్మాడు. వచ్చిన డబ్బుతో కుటుంబ సభ్యులను పోషించాడు. సినిమాలల్లో నటిస్తూనే, అవకాశాలు రానప్పుడు పండ్ల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. 


‘తిత్లీ’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ


2014లో ‘తిత్లీ’ చిత్రంతో సోలంకి దివాకర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆయన వెడ్డింగ్ కార్డ్ కుర్రాడి పాత్రను పోషించాడు. ఆ తర్వాత ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘డ్రీమ్ గర్ల్’, ప్రియాంక చోప్రా ‘ది వైట్ టైగర్’తో పాటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ‘సోంచిరియా’ చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ నటించిన ‘బ్రీత్: ఇంటు ది షాడోస్’ వెబ్ సిరీస్‌ లో సెక్యూరిటీ గార్డుగా కనిపించాడు. ‘తాండవ్‌’ వెబ్ సిరీస్ తోనూ మంచి గుర్తింపు పొందారు. ఆయన చివరగా షాహిద్ కపూర్ హీరోగా నటించిన హిట్ మూవీ ‘బ్లడీ డాడీ’ కీలక పాత్ర పోషించాడు.  






Read Also: విషమంగా విజయ్‌ ఆంటోని హీరోయిన్‌ ఆరోగ్య పరిస్థితి - వెంటిలెటర్‌పై చికిత్స, డబ్బుల్లేక ఆర్థిక సాయం కోసం ప్రకటన