మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'(God Father) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇటీవల సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు సినిమా నుంచి మరో పాట రిలీజ్ కానుంది.
ఈ సినిమా మలయాళ 'లూసిఫర్' సినిమాకి రీమేక్ అనే సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. ఇందులో భాగంగా లేటెస్ట్ గా ఒక ఐటెం సాంగ్ ను యాడ్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి స్పెషల్ సాంగ్ ను సల్మాన్ ఖాన్-చిరంజీవిలపై చిత్రీకరించారు కానీ అది కథలో సెట్ కాకపోవడంతో రోలింగ్ టైటిల్స్ మీదకు మార్చేశారు.
దీంతో సినిమాలో ఐటెం సాంగ్ ఉండాలని అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఓ పాటను చిత్రీకరించారు. ముందే ప్లాన్ చేసుకొని ఉంటే స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపేవారు. కానీ అంత సమయం లేదు. దీంతో 'బింబిసార' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించిన వరినా హుస్సేన్ మీద నిర్మాతల దృష్టి పడింది. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరిపి సాంగ్ ఓకే చేసుకున్నారు. ఈ ఒక్క పాట కోసమే కొట్టిన్నరకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అదే రేంజ్ లో సాంగ్ కూడా ఉంటుందని చెబుతున్నారు.
అనంతపురంలో ప్రీరిలీజ్ ఈవెంట్:
సాధారణంగా సినిమా ఫంక్షన్లు హైదరాబాద్‌లో జరుగుతాయి. కొన్ని సంవత్సరాల నుంచి విశాఖ, రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. ఈ మధ్య రాయలసీమ వెళ్లడం స్టార్ట్ చేశారు టాలీవుడ్ ప్రముఖులు. (Godfather Pre Release Event Venue Date Locked) 'గాడ్ ఫాదర్' యూనిట్ కూడా రాయలసీమ వెళ్ళడానికి రెడీ అవుతోంది. అనంతపురం జిల్లాలో 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌ను రెడీ చేస్తున్నారు. ఈ నెల 28న మెగా అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున ఈవెంట్ చేయనున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు.
ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు.
Also Read : కత్తి పట్టిన బాలకృష్ణ - విదేశాల్లో ఊచకోత
Also Read : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?