Rathika Rose Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7లో మరోసారి నామినేషన్స్.. రెండోరోజు కూడా ప్రసారమవుతున్నాయి. ప్రతీసారిలాగానే ఈసారి కూడా నామినేషన్స్ వాడివేడిగా సాగాయి. ప్రతీ ఒక్కరి నామినేషన్స్ సమయంలో వాగ్వాదాలు జరిగాయి. ఇక అమర్‌దీప్ ( Amardeep ) నామినేషన్స్‌లో కూడా హీట్ పెరిగింది. ప్రిన్స్ యావర్ ( Prince Yawar ) వచ్చి అమర్‌దీప్‌ను నామినేట్ చేయగా.. మధ్యలో రతిక ( Rathika Rose ) జోక్యం చేసుకుంది. దీంతో గొడవ పెద్దగా మారింది. ముందుగా తన పాయింట్ ఏంటో చెప్పి అమర్‌ను నామినేట్ చేసిన యావర్.. తర్వాత పాత విషయాలను తవ్వడం మొదలుపెట్టాడు. దీంతో అమర్ సీరియస్ అయ్యాడు. శివాజీ వచ్చి ఆపేంత వరకు అమర్, యావర్ మధ్య గొడవ అలాగే కొనసాగింది.
ఫైట్ కావాలి కదా..
ముందుగా యావర్.. తన మొదటి నామినేషన్ శోభా శెట్టికి వేసిన తర్వాత రెండో నామినేషన్ అమర్‌దీప్‌కు వేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఇటీవల జరిగిన బొమ్మల టాస్కులో అమర్‌దీప్ ఆట నచ్చలేదని గుర్తుచేస్తూ తనను నామినేట్ చేశాడు. అంతే కాకుండా అమర్ ఫెయిర్‌గా ఆడలేదని ఆరోపించాడు. దానికి అమర్ ఒప్పుకోలేదు. మిగతా హౌజ్‌మేట్స్‌ను ‘‘నేను తప్పు గేమ్ ఆడానా’’ అని ప్రశ్నించాడు. అప్పటికే సహనం కోల్పోయిన యావర్.. ‘‘నింజా గేమ్‌లో ఏం జరిగింది’’ అంటూ పాత విషయాలను గుర్తుచేయడం మొదలుపెట్టాడు. ‘‘నీకు ఫైట్ కావాలి కదా’’ అని అమర్ కూడా యావర్‌తో గొడవకు సిద్ధపడ్డాడు.
పాయింట్ లేదు కాబట్టే గొడవ..
అప్పుడెప్పుడో జరిగిన విషయాలపై నామినేట్ చేస్తున్నావా అని అమర్ అడగ్గా.. బిగ్ బాస్ హౌజ్‌లో మొత్తం ఆటను చూస్తా, చూసే నామినేట్ చేస్తా అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు యావర్. ‘‘గతవారం నీకు అమర్ కావాలి, ఈవారం నీకు అమర్ కావాలి. నీకు పాయింట్ లేదు. ఎందుకు గొడవ’’ అని నామినేట్ చేసుకోమంటూ ముందుకు వచ్చాడు అమర్. అయినా యావర్ అలా నామినేట్ చేయడానికి ఒప్పుకోలేదు. యావర్ చెప్పిన కారణాన్ని సమర్థించుకోవడానికి మధ్యలో రతిక పేరును తీసుకొచ్చాడు. రెండో వారం అలా జరిగినప్పుడు మూడో వారం, నాలుగో వారం, అయిదవ వారం నామినేషన్ ఏమైంది? అంటూ ప్రశ్నించాడు అమర్. అయితే అసలు విషయం ఏంటో చెప్పమని, ఫ్రెండ్ కోసమే నామినేట్ చేశానని అనుకుంటున్నారని రతికను బలవంతపెట్టాడు యావర్. ఫ్రెండ్ కోసమే నామినేట్ చేశావు అంటూ అమర్ కౌంటర్ ఇచ్చాడు.
రతిక పెట్టిన చిచ్చు..
రతిక ఫ్రెండ్ అయినా కూడా తనతో జాగ్రత్తగా ఉండమని అమర్ చెప్పాడని యావర్ ఆరోపించాడు. ఆ విషయాన్ని అమర్ అంగీకరించలేదు. దీంతో ఫుటేజ్ కావాలి అంటూ బిగ్ బాస్‌ను అడిగాడు యావర్. ఆ తర్వాత అమర్‌దీప్‌ను నామినేట్ చేశాడు. యావర్‌ను ఏమీ అనకపోయినా కూడా రతికను మాత్రం పాత విషయాలతో నామినేట్ చేయవద్దని, నవ్వుతారని, బయటికి వెళ్లొచ్చినదానివి ఇలా చేయకూడదని సలహా ఇచ్చాడు అమర్. మొత్తంగా రతిక చెప్పిన ఒక్క మాట వల్ల యావర్ చేతిలో అమర్‌దీప్ నామినేట్ అయ్యాడు. ఇద్దరి మధ్య చిచ్చుకు కారణమయిన రతిక.. వీరి నామినేషన్స్ జరుగుతున్నంతసేపు ఎక్కువశాతం సైలెంట్‌గానే ఉంది. దీంతో మరోసారి ఇద్దరి కంటెస్టెంట్స్ మధ్య గొడవకు కారణమయినందుకు రతిక లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఆ తర్వాత అమర్ కూడా యావర్‌ను నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య కొడతావా కొట్టు.. అనేంత వరకు వాగ్వాదం సాగింది. అయితే, శివాజీ మధ్యలోకి రావడంతో ఇద్దరూ శాంతించారు.
Also Read: నీ బాడీలో అన్ని పార్ట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా, నా బాడీలో కరెక్ట్‌గా లేవా? అశ్వినిపై ప్రియాంక ఫైర్