బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu 7)లో ముందు సీజన్స్‌లో లేని కొత్త కొత్త టాస్కులను కంటెస్టెంట్స్‌కు ఇస్తున్నారు బిగ్ బాస్. ముందుగా బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టినవారంతా అసలు హౌజ్‌మేట్స్ కాదని.. వారంతా కేవలం కంటెస్టెంట్స్ మాత్రమే అని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. హౌస్‌మేట్స్ అవ్వాలంటే పవర్ అస్త్రాను దక్కించుకోవాలని అన్నాడు. పవర్ అస్త్రా కోసం పోటీ ముగిసిన తర్వాత కెప్టెన్సీ టాస్కులు వచ్చాయి. ఇప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం కంటెస్టెంట్స్ మధ్య పోటీ మొదలయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో బిగ్ బాస్ హౌజ్‌లో 10 మంది హౌజ్‌మేట్స్ ఉన్నారు. వారందరూ ఇప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడనున్నారు.


హౌస్‌మేట్స్‌లో టాప్ 10 పోటీ..


బిగ్ బాస్ సీజన్ 7లో తాజాగా ఫ్యామిలీ వీక్ పూర్తయ్యింది. 11 మంది హౌస్‌మేట్స్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులు.. బిగ్ బాస్ హౌజ్‌లోకి మాత్రమే కాదు.. బిగ్ బాస్ స్టేజ్‌పైకి కూడా వచ్చి అలరించారు. అదే సమయంలో వారి మనసులో ఏ కంటెస్టెంట్స్‌ను టాప్ 5 అనుకుంటున్నారో బయటపెట్టారు. కుటుంబ సభ్యులు అలా టాప్ 5 స్థానాలు చెప్పడంతో హౌజ్‌లో ఉన్న అందరు హౌస్‌మేట్స్కు వారు టాప్ 5కు వెళ్తారా లేదా అన్న క్లారిటీ వచ్చింది. అయితే ప్రస్తుతం హౌస్‌మేట్స్లో ఎవరు టాప్ 1 నుండి టాప్ 10 స్థానాలకు అర్హులు అని వారినే డిసైడ్ చేసుకోమని బిగ్ బాస్ తెలిపారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఎవరు అర్హులు అనుకున్న స్థానాల కోసం వారు పోటీపడ్డారు.


టాప్ 10 ఎవరు..?


ఇంతకు ముందు జరిగిన బిగ్ బాస్ సీజన్స్‌లో కూడా ఎవరు టాప్ స్థానానికి అర్హులో వారే డిసైడ్ చేసుకోవాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. అయితే ఈ టాస్కులో మునుపటి సీజన్స్‌లో పోటీపడినట్టుగా కంటెస్టెంట్స్.. ఈసారి పోటీపడలేదు. వారికి ఏ స్థానం కరెక్ట్ అని వాదనలు వినిపించినా.. గట్టిగా అదే మాటపై నిలబడకుండా.. ఏదో ఒకటిలే అన్నట్టుగా చాలామంది వ్యవహరించారని తెలుస్తోంది. ఇక ఈ టాప్ స్థానాల టాస్కులో మొదటి స్థానంలో ఉన్నవారికి లేదా మొదటి మూడు స్థానాల దగ్గర నిలబడిన వారికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడే అవకాశం ఉంది. అయితే ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ లభించిన వారికి ఎన్ని వారాలపాటు నామినేషన్‌లో రాకుండా ఇమ్యూనిటీ లభిస్తుంది అనే విషయం తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు ఆగాల్సిందే. 


ప్రస్తుతం లైవ్ ప్రకారం.. టాప్-10 ప్లేసెస్‌లో ఉన్నది వీరే:


లైవ్ ప్రకారం హౌస్‌మేట్స్ అంతా టాప్-10 ప్లేసెస్ ఉన్న బోర్డుల వెనుక నిలబడ్డారు. వారు ఎందుకు ఎలా ఆ ప్లేస్‌లకు అర్హులనే విషయాన్ని మెజారిటీ హౌస్‌మేట్స్ నిర్ణయం ప్రకారం.. ఆర్డర్‌లో నిలుచున్నారు. ఎక్కువ మంది హౌస్‌మేట్స్.. శివాజీకి నెంబర్ 1 స్థానాన్ని ఇచ్చారు.


1. శివాజీ


2. యావర్


3. పల్లవి ప్రశాంత్


4. ప్రియాంక జైన్


5. శోభా శెట్టి


6. అమర్‌దీప్


7. గౌతమ్


8. అర్జున్


9. అశ్వినీ శ్రీ


10. రతిక రోజ్



Image Credit: Disney + Hotstar/Star Maa


ఎక్కువగా సపోర్ట్ లేని వారికి ప్లస్


ఇప్పటికే పవర్ అస్త్రా, కెప్టెన్సీల వల్ల కొందరు కంటెస్టెంట్స్ ఎక్కువగా నామినేషన్స్‌లోకి రాలేదు. ఇక సీజన్ ఫైనల్స్ దగ్గర పడుతున్న ఈ సమయంలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కించుకోవడం అంటే డైరెక్ట్‌గా ఫైనల్స్‌లోకి అడుగుపెట్టినట్టే అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఇంకొక నాలుగు వారాలు నామినేషన్స్ నుండి తప్పించుకుంటే.. ఫైనల్‌లో అడుగుపెట్టవచ్చు. ఇదే సమయంలో ప్రేక్షకుల్లో ఎక్కువగా సపోర్ట్ లేని కంటెస్టెంట్స్ ఎవరైనా.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ దొరికిందంటే వారు హ్యాపీగా ఫైనల్స్‌కు చేరుకుంటారు. దీంతో అసలు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి వస్తుందా అని ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఎక్కువయ్యింది.


Also Read: చిరంజీవితో సినిమా చేయను, ఆయన అడిగినా సరే - ‘పొలిమేర’ దర్శకుడి సంచలన వ్యాఖ్యలు