బిగ్ బాస్ సీజన్ 7 ( Bigg Boss Telugu 7 )లో ఫీమేల్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ అనేవి గత కొన్ని వారాలుగా రసవత్తరంగా సాగుతున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌజ్‌లో అడుగుపెట్టినప్పుడు మొదటి నామినేషన్స్‌కే కన్నీళ్లు పెట్టుకుంది అశ్విని. ఆ తర్వాత నామినేషన్స్ అన్నింటిలో కన్ఫ్యూజన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. కానీ తాజాగా జరిగిన నామినేషన్స్‌లో మాత్రం ప్రియాంక( Priyanka Jain )ను నామినేట్ చేస్తూ వాగ్వాదానికి దిగింది అశ్విని (Aswini Shree ). అంతే కాకుండా బిగ్ బాస్‌లాంటి రియాలిటీ షోలో కొన్ని పదాలను ఉపయోగించడం కరెక్ట్ కాదు అంటూనే కొన్ని పదాలను ఉపయోగించారు ప్రియాంక, అశ్విని. వాష్ రూమ్‌కు ఎంతసేపు వెళ్తారు అనే విషయాన్ని కూడా చర్చలోకి తీసుకొచ్చారు.
భోలే ( Bhole Shavali) ఎలిమినేషన్ వల్ల అశ్విని నామినేషన్
ముందుగా ప్రియాంక.. భోలే షావలి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోతున్నప్పుడు అశ్విని ఏడ్చిందని, అంతే కాకుండా నేను కూడా నీతో వచ్చేస్తా అని స్టేట్‌మెంట్ ఇచ్చిందనే కారణంపై అశ్వినిని నామినేట్ చేసింది. అదే విషయంపై ప్రియాంకను అశ్విని నామినేట్ చేసింది. ‘‘అలా చెప్పడంలో నీకేం ప్రాబ్లమ్’’ అని ప్రియాంకను ప్రశ్నించింది అశ్విని. ఒకరు వెళ్లిపోతున్నప్పుడు అలా అనడం కరెక్ట్ కాదని, ఇక్కడ ఉండడానికి వచ్చినప్పుడు అలా అనకూడదు కదా అనేది తన పాయింట్ అని ప్రియాంక సమాధానమిచ్చింది. దానికి సమాధానంగా భోలే.. తన ఫ్రెండ్ అని, అందరికంటే ఎక్కువగా ఫ్యామిలీ విషయాలను, పర్సనల్ విషయాలను భోలేతోనే ఎక్కువగా షేర్ చేసుకుందని అశ్విని చెప్పుకొచ్చింది. అలాంటి ఫ్రెండ్ అయినందుకు భోలే వెళ్లిపోతున్నప్పుడు తనకు బాధగా అనిపించి.. అలా అన్నానని క్లారిటీ ఇచ్చింది.
కప్ కొట్టడానికి రాలేదు
‘‘నువ్వు లేని టాపిక్‌లో మధ్యలో ఎందుకు దూరుతున్నావు’’ అంటూ ప్రియాంకపై అరవడం మొదలుపెట్టింది అశ్విని. ‘‘నేను వెళ్లిపోతాను అనే టాపిక్‌ను మళ్లీ మళ్లీ చెప్పడం నాకు నచ్చలేదు. నా ఆడియన్స్‌కు థ్యాంక్స్ నన్ను ఎలిమినేట్ చేయకుండా ఉండనిచ్చినందుకు. ఎలిమినేట్ అయినా కూడా నేను చాలా హ్యాపీ’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడడం మొదలుపెట్టింది. కప్ కొట్టడానికి రాలేదు కాబట్టి అలాగే ఉంటుందని ప్రియాంక కౌంటర్ ఇచ్చింది. అయితే బిగ్ బాస్‌లోకి రావడమే తనకు సంతోషంగా ఉందని, కప్ వస్తే మరింత సంతోషమని, కానీ కప్ కోసమే వచ్చాననే మాటలు తను చెప్పనని స్పష్టంగా బయటపెట్టింది అశ్విని.
పిచ్చి మాటలు మాట్లాడలేను
‘‘నేను నీలాగా మాట్లాడలేను. నువ్వు నాలాగా మాట్లాడలేవు అని అన్నాను కదా. దానికి నువ్వు నాకు చాలా వస్తున్నాయి నేను చెప్పలేకపోతున్నాను అన్నావు. అది నేను కాదు.’’ అని ప్రియాంక చెప్పింది. ‘‘ఇది చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్ కదా. పిచ్చి మాటలు మాట్లాడలేము కదా. నాకు ఆ బీపీలో అలా వచ్చేసింది. కానీ తర్వాత సైలెంట్ అయిపోయాను’’ అని ప్రియాంక అన్న మాటలకు సమాధానమిచ్చింది అశ్విని. ‘‘నేను పిచ్చి మాటలు మాట్లాడలేను. నీలాగా అలా ఆలోచన కూడా రావట్లేదు నాకు’’ అని ప్రియాంక చెప్పింది. అయితే తాను మనిషిని అని, తన బాడీలో పార్ట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయని, అందుకే ఏ ఎమోషన్ వస్తే ఆ ఎమోషన్‌ను చూపిస్తానని సమాధానమిచ్చింది అశ్విని. ‘‘నీ బాడీలో అన్ని పార్ట్స్ కరెక్ట్‌గా ఉన్నాయంటే నా బాడీలో కరెక్ట్‌గా లేవని అర్థమా?’’ అని ప్రియాంక ప్రశ్నించగా.. అలా కాదని అశ్విని సమాధానమిచ్చింది. కానీ ‘‘నువ్వు అలాగే మాట్లాడుతున్నావు. నువ్వు మనిషి అయితే నేను ఏలియన్నా?’’ అని అడిగింది ప్రియాంక.
వాష్‌రూమ్ కంట్రోల్ చేసుకున్నాను
‘‘ప్రతి మాటకు ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నావు. నేను కిచెన్‌లో చేస్తున్నాను అని చెప్పుకుంటున్నావు. ఈరోజు కిచెన్‌లో ఒంటిచేతితో నేను చేస్తాను అని శపథం చేస్తున్నాను. కటింగ్‌లో నాకు సాయం చేయండి. ఒంటిచేతితో నేను వంట చేయకపోతే నా పేరు మార్చుకుంటాను. నేను చేస్తున్నాను అని ఓవర్‌గా చేస్తున్నావు’’ అని అశ్విని ఛాలెంజ్ చేసింది. ‘‘ఈరోజు కూరగాయలు కట్ చేసిన తర్వాత నేను చేస్తాను అంటే వద్దు అన్నావు’’ అని అశ్విని గుర్తుచేసింది. దానికి సమాధానంగా ‘‘నాకు 15, 20 నిమిషాలు వాష్‌రూమ్‌కు పడుతుంది అని నువ్వు అన్నావు’’ అని ప్రియాంక గుర్తుచేసింది. కోప్పడతావు అనే భయంతో వాష్‌రూమ్‌ను కంట్రోల్ చేసుకొని కూరగాయలు కట్ చేశాను అని బయటపెట్టింది అశ్విని. నేనేం కంట్రోల్ చేసుకోమని చెప్పలేదని కౌంటర్ ఇచ్చింది ప్రియాంక. అలా ప్రియాంక, అశ్విని మధ్య నామినేషన్స్ చాలా వాడివేడిగా సాగాయి.
Also Read: బిగ్ బాస్ మరో ఫిటింగ్, టాప్-10 స్థానాల్లో నిలుచోవాలంటూ టాస్క్ - ఎవరెవరికి ఏయే స్థానాలంటే?