Bigg Boss 7 Grand Finale: బిగ్ బాస్ సీజన్ 7లోకి గోల్డెన్ సూట్‌కేస్ తీసుకొని హౌజ్‌లోకి వెళ్లారు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్. ముందుగా వారి సినిమా ‘నా సామిరంగ’ ప్రమోషన్ కోసం ఈ ఇద్దరు యంగ్ హీరోలను స్టేజ్‌పైకి పిలిచాడు. ఆ తర్వాత హీరోయిన్ అషికా, డైరెక్టర్ విజయ్‌ను కూడా పిలిచి.. మూవీ టీజర్‌ను విడుదల చేశాడు. విడుదలయిన తర్వాత హీరోయిన్, డైరెక్టర్‌ను బయటికి పంపించేసి.. గోల్డెన్ సూట్‌కేస్ ఇచ్చి నరేశ్, రాజ్ తరుణ్‌ను బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపారు నాగార్జున. వారు హౌజ్‌లోకి వెళ్లిన తర్వాత ఆ సూట్‌కేస్‌లో రూ.15 లక్షలు ఉన్నాయని, ఎవరైనా దానిని తీసుకొని వెళ్లిపోవచ్చని అన్నారు. దీంతో నరేశ్, రాజ్ తరుణ్ కలిసి ఆ సూట్‌కేస్ తీసుకోవడానికి కంటెస్టెంట్స్‌ను ఒప్పించడం మొదలుపెట్టారు.
ముందుగా పల్లవి ప్రశాంత్‌ను డబ్బులు తీసుకోమని అడిగారు. అందరికీ ఆదర్శంగా నిలవడానికి వచ్చానని, ప్రేక్షకులు బయటికి పంపిస్తే.. వెళతానని డబ్బులు మాత్రం వద్దని తేల్చి చెప్పాడు. తన తల్లిదండ్రులు కూడా అదే చెప్పారు. ఇక అమర్ కూడా తానే గెలుస్తానని నమ్మకంతో డబ్బులు వద్దన్నాడు. యావర్‌కు డబ్బులు అవసరమని, తనకు అప్పులు ఉన్నాయన్న విషయాన్ని నరేశ్, నాగార్జున గుర్తుచేశారు. యావర్ నిర్ణయించుకునే ముందు తన అన్న, తమ్ముడితో కూడా మాట్లాడించారు. వారు కూడా డబ్బులు తీసుకోవడమే కరెక్ట్ అని, విన్నర్ అనేవాడు ఒక్కడే ఉంటాడు కాబట్టి ఆ సూట్‌కేస్ తీసుకోవడం వల్ల లాభమే ఉంటుందని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో తను ఆడేది తన కుటుంబం కోసమే అని, అన్నయ్య తీసుకోమని చెప్తున్నాడు కాబట్టి తీసుకుంటునాని ఒప్పుకున్నాడు.
బిగ్ బాస్ హౌజ్ నుంచి స్టేజ్‌పైకి సూట్‌కేస్ తీసుకొని వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నావని యావర్‌ను అడిగారు నాగార్జున. అంటే బాలేదని, అదే విధంగా బాగుందని చెప్పాడు యావర్. ప్రతీ శనివారం తనను చూసే అవకాశం ఉండదు కాబట్టి ఫీల్ అవుతున్నానని వాపోయాడు. అంటే ఫీల్ అవ్వద్దని చెప్పి యావర్‌కు గుడ్‌బై చెప్పారు నాగార్జున. మొత్తంగా రూ.15 లక్షలు లాభంతో యావర్.. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చేశాడు. దానికి తన కుటుంబ సభ్యులు కూడా సంతోషిస్తున్నారు.
Also Read: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కథేంటి? బిగ్ బాస్ వరకు ఎలా వచ్చాడు?
వ్యక్తిగతంగా, ఎవరి మాట వినకుండా ఆడినప్పుడు యావర్‌కు ప్రేక్షకుల దగ్గర నుంచి పెద్దగా సపోర్ట్ దొరకలేదు. కానీ ప్రశాంత్, శివాజీలతో కలిసి ‘స్పై’ గ్రూప్‌లో చేరిన తర్వాత తన ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. కానీ గేమ్ మాత్రం తగ్గిపోయింది. ఒకప్పుడు టాస్క్ అనగానే ముందు, వెనుక ఆలోచించకుండా రంగంలోకి దూకే యావర్.. మెల్లగా ఆలోచించడం మొదలుపెట్టాడు. తనపై తాను నమ్మకం పోగొట్టుకొని వీక్ అయిపోయాడు. ఫ్యామిలీ వీక్ సమయంలో తన అన్న వచ్చి ధైర్యం చెప్పిన తర్వాత యావర్.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు అనిపించినా కూడా తన ఆటపై మాత్రం ఫోకస్ తగ్గిందని ప్రేక్షకులు భావించారు. అందుకే తనకు ఓట్లు తగ్గిపోయాయి. అందుకే రూ.15 లక్షలు తీసుకొని వెళ్లిపోవడం మంచి నిర్ణయమని తన ఫ్యాన్స్ సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.