‘బిగ్ బాస్’ హౌస్‌లోకి 14 మంది సభ్యులు వచ్చినప్పుడే చాలామందికి అనుమానం కలిగింది. మిగతా సభ్యులు ఎక్కడా అని. ఈ నేపథ్యంలో ‘బిగ్ బాస్’ ఊహించని ట్విస్ట్ ఇస్తున్నాడు. మరో ఇద్దరిని హౌస్‌లోకి పంపుతున్నాడు. వారు ఇప్పటికే ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం.


ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Season 7 Telugu) ఉన్న కంటెస్టెంట్స్ చాలామంది ప్రేక్షకులకు అంత సుపరిచితం కాదు. కేవలం కొందరు సీనియర్ యాక్టర్లు తప్పా మిగతావారంతా ప్రేక్షకులకు కూడా కొత్తగా పరిచయం అవుతున్నవారే. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వస్తున్న ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రం సోషల్ మీడియాను ఫాలో అవుతున్నవారికి కాస్త సుపరిచితులే అయ్యింటారు. ఆ కంటెస్టెంట్స్ ఎవరంటే.. అర్జున్ అంబటి, సుప్రిత. అర్జున్ అంబటి.. ఇప్పటికే పలు సీరియల్స్‌లో హీరోగా బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. సుప్రిత అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురు అని నెటిజన్లకు తెలుసు. ఈ ఇద్దరు త్వరలోనే బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


మల్టీ టాలెంటెడ్ నటుడు..
ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu Season 7)లో పలువురు సీరియల్ నటీనటులు ఉన్నారు. ఇప్పుడు అర్జున్ అంబటి కూడా వారిలో ఒకటి అవ్వబోతున్నాడు. స్టార్ మాలో సైతం పలు సీరియల్స్‌లో హీరోగా నటించి మెప్పించిన అర్జున్.. కేవలం యాక్టర్‌గా మాత్రమే కాకుండా డ్యాన్సర్‌గా, యాంకర్‌గా తనలోని మల్టీ టాలెంట్స్‌ను బయటపెట్టాడు. కానీ గతకాంతకాలం అర్జున్ అంత యాక్టివ్‌గా బుల్లితెరపై కనిపించడం లేదు. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మళ్లీ ఫార్మ్‌లోకి రావాలని అర్జున్ కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న అమర్‌దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్.. వీరంతా అర్జున్‌కు మంచి స్నేహితులు కావడంతో వీరి మధ్య బిగ్ బాస్ ఎలాంటి గొడవలు పెడతాడు, ప్రేక్షకులను ఎలా ఎంటర్‌టైన్ చేస్తాడో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.


సురేఖా వాణి కూతురిగా గుర్తింపు..
సుప్రిత విషయానికొస్తే.. సురేఖా వాణి కూతురులాగా కంటే ముందు తను ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నెటిజన్లకు పరిచయం అయ్యింది. డబ్‌స్మాష్, రీల్స్ చేస్తూ ఫేమస్ అయినవారిలో సుప్రిత కూడా ఒకరు. తను మాత్రమే కాకుండా తన తల్లి సురేఖా వాణితో కూడా వీడియోలు చేయిస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంది సుప్రిత. మామూలుగా ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో ఒక ఫేమస్ యూట్యూబర్‌ను లేదా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను కంటెస్టెంట్స్‌గా తీసుకొస్తారు బిగ్ బాస్. ఈసారి యూట్యూబ్ నుండి టేస్టీ తేజ వచ్చి ఆలోటు తీర్చాడు. ఇక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా సుప్రిత వచ్చి మరొక లోటు తీర్చనుంది. మరి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసే సుప్రిత.. బిగ్ బాస్ హౌజ్‌లో ఉంటూ బయట ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయగలదా అన్న విషయాన్ని చూడాలి.


Also Read: పెళ్లి గిళ్లీ వద్దంటోన్న 'కుమారి శ్రీమతి' నిత్యా మీనన్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial