Spy batch Remuneration: మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షోలో గ్రూప్ గేమ్స్ అనేవి చాలా కామన్. అసలు పరిచయం లేని వ్యక్తులు.. బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన తర్వాత గ్రూప్స్‌లాగా ఫార్మ్ అయ్యి.. కలిసి గేమ్స్ ఆడడం మొదలుపెడతారు. ఒక్కొక్కసారి కంటెస్టెంట్ వ్యక్తిగతంగా ఆడినప్పుడు ఫేమ్ దక్కకపోయినా.. గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి ఆడిన తర్వాత సపోర్ట్ లభిస్తుంది. అలా తాజాగా ముగిసిన బిగ్ బాస్ సీజన్ 7లో ప్రేక్షకుల్లో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకుంది ‘స్పై’ బ్యాచ్. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్.. ఈ బ్యాచ్‌లో మెంబర్స్. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిపోవడంతో వీరి రెమ్యునరేషన్ గురించి, పల్లవి ప్రశాంత్‌కు వచ్చిన ప్రైజ్ మనీ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... వివరాలు ఇలా ఉన్నాయి.


అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్..


బిగ్ బాస్ సీజన్ 7 వల్ల ‘స్పై’ బ్యాచ్ అంతా ఆర్థికంగా సెటిల్ అయ్యిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు.. సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి అందరికంటే శివాజీకే ఎక్కువ రెమ్యునరేషన్ అని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇక బిగ్ బాస్ చివరి వరకు ఉండి, టాప్ 3వ కంటెస్టెంట్‌గా నిలిచాడు కాబట్టి శివాజీకి మొత్తంగా రూ.68 లక్షలు రెమ్యునరేషన్ దక్కిందని సమాచారం. 15 వారాలు ఉన్నందుకు శివాజీకి ఆర్థికంగా మంచి లాభమే కలిగింది అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. తనకు మాత్రమే కాదు.. విన్నర్ అవ్వకపోయినా.. యావర్‌కు కూడా ఆర్థికంగా సాయం లభించింది. టాప్ 4వ స్థానం వచ్చినా పర్వాలేదు అనుకొని గోల్డెన్ సూట్‌కేస్‌తో బయటికి వచ్చేశాడు యావర్.


రూ.15 లక్షల సూట్‌కేస్‌తో..


టాప్ 6 కంటెస్టెంట్స్.. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు ముందుగా వారందరికీ సిల్వర్ సూట్‌కేస్ ఆఫర్ లభించింది. కానీ అప్పుడు కంటెస్టెంట్స్ ఎవరూ ఆ ఆఫర్‌ను తీసుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ అలాంటి ఆఫరే గోల్డెన్ సూట్‌కేస్ రూపంలో మరోసారి కంటెస్టెంట్స్‌కు వచ్చింది. అప్పటికీ హౌజ్‌లో టాప్ 4 కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఆ గోల్డెన్ సూట్‌కేసులో రూ.15 లక్షలు ఉన్నాయని, ఆ ఆఫర్ నచ్చి అది తీసుకోవడానికి యావర్ ముందుకొచ్చాడు. ఈ రూ.15 లక్షలతో పాటు బిగ్ బాస్‌లో ఉన్నంతవరకు తను రూ.23 లక్షలను రెమ్యునరేషన్‌గా అందుకున్నాడు. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 7 వల్ల రూ.38 లక్షలను సంపాదించుకున్నాడు యావర్. దీంతో తన ఆర్థిక సమస్యలు కొంతవరకు అయినా తీరుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


ప్రైజ్ మనీతో పాటు అవి కూడా..


ఇక ప్రేక్షకులు ముందు నుంచి అనుకున్నట్టుగానే ‘స్పై’ బ్యాచ్‌లో ఒకడైన పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయ్యాడు. మిగిలిన అందరు కంటెస్టెంట్స్ కంటే పల్లవి ప్రశాంతే తక్కువ రెమ్యునరేషన్‌తో హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. తన రెమ్యునరేషన్ వారానికి కేవలం రూ.1 లక్ష మాత్రమే. ఇక తను పూర్తిగా 15 వారాలు బిగ్ బాస్ హౌజ్‌లో ఉండడంతో రూ.15 లక్షలు రెమ్యునరేషన్‌గా లభించింది. విన్నర్‌కు రూ.50 లక్షలు ప్రైజ్ మనీ దక్కాల్సి ఉన్నా.. అందులో రూ.15 లక్షలను సూట్‌కేసులో పెట్టుకొని యావర్ తీసుకెళ్లిపోవడంతో రూ.35 లక్షలు ప్రశాంత్‌కు ప్రైజ్ మనీగా లభించాయి. అంతే కాకుండా ఒక కారు, రూ.15 లక్షలు విలువైన నగలు కొనగలిగే కూపన్ కూడా బహుమతులుగా అందుకున్నాడు పల్లవి ప్రశాంత్.


Also Read: అమర్, నేను అంత బెస్ట్ ఫ్రెండ్స్ ఏం కాదు - బయటపెట్టిన అర్జున్