Ambati Arjun: అమర్, నేను అంత బెస్ట్ ఫ్రెండ్స్ ఏం కాదు - బయటపెట్టిన అర్జున్

Bigg Boss 7 Telugu Ambati Arjun: బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన అర్జున్, అమర్‌లకు ముందు నుండే పరిచయం ఉందని, వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రేక్షకులు అనుకున్నారు. దానిపై అర్జున్ క్లారిటీ ఇచ్చాడు.

Continues below advertisement

Bigg Boss 7 Telugu Ambati Arjun: బిగ్ బాస్ సీజన్ 7లో ఏ సపోర్ట్ లేకుండా ఫినాలే అస్త్రా గెలుచుకున్నాడు అర్జున్ అంబాటి. తను హౌజ్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఎక్కువశాతం వ్యక్తిగతంగానే ఆడాడు. తన స్ట్రాటజీతో, బ్యాలెన్స్‌గా ఉంటూ.. కోపం వచ్చినా కంట్రోల్‌లో ఉంటూ ఆడియన్స్ దగ్గర మార్కులు కొట్టేశాడు. కానీ ఓట్ల విషయంలో మాత్రం వెనకబడిపోతున్నానని అర్జున్ ముందు నుండే తెలుసుకున్నాడు. అందుకే సందర్భంగా దొరికినప్పుడల్లా ప్రేక్షకులకు తన సపోర్ట్ చేయమని కోరాడు. అయినా కూడా ఫైనల్స్‌లో ముందుగా ఎలిమినేట్ అయ్యింది అర్జునే. ముందుగా ఎలిమినేట్ అవ్వడంపై బిగ్ బాస్ బజ్‌లో స్పందించాడు అర్జున్. దానికి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది.

Continues below advertisement

వెనుక మాట్లాడలేదా..?
‘‘మొదటి ఫైనలిస్ట్.. కానీ టాప్ 6వ కంటెస్టెంట్. విన్నర్ అవుతానని అనుకోలేదా?’’ అని మొదటి ప్రశ్న వేసింది గీతూ. ‘‘టాప్ 2, టాప్ 3 వరకు ఉంటాను అనుకున్నాను. కానీ అనుకున్నవన్నీ మన చేతిలో ఉండవు కదా’’ అని తన నిరాశను వ్యక్తం చేశాడు అర్జున్. ‘‘డబ్బులు తీసుకుందాం అనుకున్నారా?’’ అని అడగగా.. ‘‘తప్పకుండా. డబ్బులు ఎవరికి చేదు’’ అని సూటిగా చెప్పేశాడు. ‘‘శివాజీతో ఉండేటప్పుడు అమర్ గురించి, అమర్‌తో ఉండేటప్పుడు ప్రశాంత్ గురించి మాట్లాడలేదా?’’ అని ప్రశ్నించింది గీతూ. ‘‘అభిప్రాయాలు వేరు, మాట్లాడి వారి గేమ్‌ను చెడగొట్టి, ఇది చేయాలా, అది చేయాలా అనుకోవడం వేరు’’ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు అర్జున్.

అది సింపథీ కాదు..
‘‘నువ్వు ఎవరికి లాయల్‌గా ఉన్నావు స్పా బ్యాచా? స్పై బ్యాచా?’’ అని అడగగా.. తాను ఎవరికీ లాయల్ కాదని అడ్డంగా తలూపాడు అర్జున్. ‘‘శివాజీ మీద గౌతమ్ ఆరోపణలు చేస్తే.. మీరెందుకు ఆ పాయింట్ మీద నామినేట్ చేశారు?’’ అనే ప్రశ్నకు అర్జున్ ఆలోచనలో పడ్డాడు. ‘‘సింపథీ అనేది ప్రశాంత్ బలం’’ అనే స్టేట్‌మెంట్‌పై అర్జున్ స్పందించాడు. ‘‘వాడు నా అనుకున్నవాళ్లు నామినేషన్ వేసినా.. తీసుకోలేడు ఏడుస్తాడు. అది వాడి బలమే అనుకుంటున్నాను’’ అని సమాధానిమచ్చాడు. ‘‘ఫేక్ అని ఎప్పుడూ అనిపించలేదా?’’ అని అడిగింది గీతూ. ‘‘హౌజ్‌లో ఏదైనా గేమే కదా’’ అని నిజాయితీగా జవాబు చెప్పాడు.

శోభా సపోర్ట్ నచ్చలేదా..?
‘‘అమర్‌దీప్ కెప్టెన్సీ అప్పుడు శోభా సపోర్ట్ మీకు నచ్చలేదా’’ అని చివరి కెప్టెన్సీ సమయంలో జరిగిన రచ్చను గుర్తుచేసింది గీతూ. ‘‘నచ్చలేదు అని నేను అనలేదు. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది’’ అని సమాధానమిచ్చాడు అర్జున్. ‘‘బయట నుంచి చూసినప్పుడు ఇది వీరు కాదు. ఇది వీరి ఫేక్ పర్సనాలిటీ అని ఎవరి గురించైనా అనిపించిందా’’ అని అడిగింది. ‘‘నాకు బయట పర్సనల్‌గా ఎవరూ తెలియదు. అమర్, నేను అంత బెస్ట్ ఫ్రెండ్స్, జిగిరిలాగా ఏం కాదు’’ అని బయటపెట్టాడు. ‘‘నామినేషన్స్‌లో ముస్తఫా ముస్తఫా అని పాట పాడినప్పుడు ఆడియన్స్ అభిప్రాయం ఏంటో తెలుసా’’ అని అడుగుతూ ఒక మీమ్ చూపించింది. ఆ మీమ్‌లో ‘ఉన్న ఒక్క స్ట్రాంగ్ అపోనెంట్ కూడా వాళ్లతో కలిసిపోయాడు’ అంటూ అర్జున్, యావర్, ప్రశాంత్, శివాజీ ఫోటోలు ఉన్నాయి. అది చూసి అర్జున్ నవ్వుకున్నాడు.

Also Read: అమర్‌దీప్, గీతూ, అశ్వినీ కార్లు ధ్వంసం, ఆర్టీసీ బస్సుపైనా దాడి - ఆకతాయి ఫ్యాన్స్ అరాచకం

Continues below advertisement