Shobha Shetty New House Warming: బిగ్‌బాస్‌ తర్వాత సోషల్‌ మీడియాలో శోభా శెట్టి పేరు మారుమోగుతుంది. తరచూ సోషల్‌ మీడియాలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫోటోషూట్‌లు షేర్‌ చేస్తుంది. బిగ్‌బాస్‌ నుంచి బయటకు రాగానే ప్రియుడిని నిశ్చితార్థం చేసుకుని శుభవార్త చెప్పింది. తాజాగా ఈ కన్నడ భామ మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. శోభా శెట్టి తన సొంత ఇంటి కలను నిజం చేసుకుంది. కార్తిక దీపం సీరియల్‌తో తెలుగు ఆడియన్స్‌కి పరిచయమైంది శోభాశెట్టి. ఇందులో మోనితగా విలన్‌ పాత్రలో తనదైన మార్క్‌ క్రియేట్‌ చేసుకుంది.


కాబోయే భర్తతో గృహ ప్రవేశం


దీంతో మోనితగా పాపులరైన ఆమె బిగ్‌బాస్‌ 7 షోతో సొంత గుర్తింపు పొందింది. హౌజ్‌లో తనదైన ఆట తీరుతో మెప్పించింది. అలాగే మొండితనం, తనే గెలవాలన్న సెల్ఫిష్‌ బిహెవియర్‌తో ట్రోల్స్‌ కూడా ఎదుర్కొంది. మొత్తానికి బిగ్‌బాస్‌ షో తర్వాత అంతా మోనితని మర్చిపోయి.. శోభాశెట్టిని గుర్తు పెట్టుకుంటారంటూ హోస్ట్‌ నాగార్జునతో అన్న మాటను ఆమె నిలబెట్టుకుంది. అప్పటి నుంచి మోనితగా కంటే కూడా శోభాశెట్టిగా ఆడియన్స్‌లో గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే తాజాగా తన డ్రీమ్‌ హౌజ్‌లోకి కాబోయే భర్తతో కలిసి గృహ ప్రవేశం చేసింది శోభా. శోభా శెట్టి కొత్తింటి గృహ ప్రవేశం కార్యక్రమానికి సంబంధించిన వీడియో బిగ్‌బాస్‌ టెస్టీ తేజ తన యూట్యూబ్‌ చానల్లో షేర్‌ చేశాడు.


బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్స్‌ సందడి


ఈ కార్యక్రమానికి పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ కూడా హజరయ్యారు. టెస్టీ తేజ, ప్రయాంక జైన్‌, డ్యాన్స్‌ మాస్టర్‌ సందీప్‌, గౌతం కృష్ణ పలువురు హాజరై ఆమెను విష్‌ చేశారు. ఈ సందర్భంగా టెస్టీ తేజ శోభాకు స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. శోభా శెట్టి, ఆమె కాబోయే భర్త యశ్వంత్‌ల కలిసి ఉన్న ఫొటో పెయింటింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇది చూసి శోభా సర్‌ప్రైజ్‌ తేజకు స్పషల్‌ థ్యాంక్స్‌ చెప్పింది. అనంతరం టెస్టీ తేజ తనదైన కామెడీ పంచ్‌లతో అలరించాడు. అలా శోభాశెట్టి గృహ ప్రవేశం వేడుకులో ఈ బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్స్‌ కలిసి కాసేపు సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బిగ్‌బాస్‌తో వచ్చిన డబ్బులతోనే శోభా ఈ కొత్తింటిని కొనుగోలు చేసినట్టు ఇన్‌సైడ్‌ సర్కిల్లో గుసగుసల. కాగా శోభా శెట్టి బాయ్‌ఫ్రెండ్‌, ఫియాన్సీ మరెవరో కాదు కార్తీక దీపంలో డాక్టర్‌కు బాబుకు తమ్ముడి నటించిన ఆదిత్య(యశ్వంత్‌) అనే విషయం తెలిసిందే. ఈ సీరియల్‌ టైంలో వీరిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది.



దీంతో వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో చెప్పడంతో పెళ్లికి అంగీకారం వచ్చింది. ఇక లైఫ్‌లో సెటిల్‌ అయ్యాకే పెళ్లి చేసుకోవాలనుకున్న వీరు బిగ్‌బాస్‌ తర్వాత సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. కేవలం ఇరు కుటుంబాల సమక్షంలోనే వీరి నిశ్చితార్థం వేడుక జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరు కలిసి వ్లాగ్స్‌ చేస్తూ బుల్లితెర ఆడియన్స్‌ని అలరిస్తున్నారు. తాజాగా సొంతింటి కల నిజం చేసుకుని జంటగా గృహ ప్రవేశం చేసిన వీరికి ఇండస్ట్రీవర్గాల నుంచి శుభాంక్షలు వెల్లుత్తున్నాయి. ఇక డ్రీమ్‌ హౌజ్‌ అయిపోయింది.. మరి పెళ్లి కబురు ఎప్పుడంటూ వీరి ఫ్యాన్స్‌, సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. 



Also Read: రీరిలీజ్‌కు సిద్ధమైన రానా బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'లీడర్‌'? - ఆ రోజే థియేటర్లో సందడి!