Bigg Boss 9 Telugu: తెలుగు బిగ్‌బాస్‌ సీజన్ 9లో వైల్డ్ కార్డు ఎంట్రీతో ఆట ఆసక్తిగా మారింది. బిగ్‌బాస్‌ టీం అనుకున్నట్టుగానే కావాల్సినంత కాంట్రవర్సీ దొరుకుతోంది. సీజన్ ప్రారంభమై 38 రోజుల అయ్యింది. గత ఆదివారం వరకు రాని కిక్‌ ఇప్పుడు వస్తోంది. హౌస్‌మేట్స్‌ మధ్య సాగుతున్న డిస్కషన్స్‌, గొడవలు, బాండ్స్‌ ఇలా అన్నింటా కూడా ప్రేకక్షకులకు కావాల్సిన స్టఫ్‌ దొరుకుతోంది. కొన్ని రోజులుగా షోను చూసి వెళ్లిన వైల్డ్‌కార్డు గేమ్‌ను మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో గేమ్‌లో స్ట్రాంగ్‌, వీక్ అనే విషయంపై కాకుండా బయట ఓట్లు ఎలా పడుతున్నాయో అన్నట్టుగా స్ట్రాటజీలు వేస్తున్నారు. అందుకే ఓటింగ్‌ ఎక్కువ ఉన్న వారితో ఒకరు సున్నం పెట్టుకుంటే మరొకరు వారిని మచ్చిక చేసుకుంటున్నారు. 

Continues below advertisement

వైల్డ్‌ కార్డు ద్వారా హౌస్‌లోకి వచ్చిన వారి తీరును కూడా చాలా జాగ్రత్త గమనిస్తున్నారు పాత కంటెంస్టెంట్స్‌. అందుకే వాళ్లు కూడా తమ గేమ్‌ ప్లాన్ మార్చుకుంటున్నారు. అందులో ముఖ్యమైంది. మాధురి, తనూజ మధ్య జరుగుతున్న పరిణామాలు ఆసక్తిగా ఉన్నాయి. బాండింగ్‌లు ఏంటని స్టేజ్‌పై విమర్శలు చేయడమే కాకుండా భరణి, తనూజను టార్గెట్ చేసిన వైల్డ్‌కార్డు సభ్యులు ఇప్పుడు వాళ్లు కూడా అదే చేస్తున్నారు. అయితే అందరితో కాకుండా ఓటింగ్ పవర్ ఉన్న వారితో ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పుడు మాధురి చేస్తున్నది ఇదే. తనూజ, సంజనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. లోటుపాట్లు చర్చించుకుంటున్నారు. ఎవరి ఆలోచన ఏంటో తెలుసుకుంటున్నారు. తనూజ టాప్‌5లో ఉంటావని కూడా అంటున్నారు. తనను అమ్మ అని పిలవాలని కూడా సూచించారు. 

వచ్చిన మొదటి రోజే పవన్ కల్యాణ్‌తో జరిగిన వివాదంలో మాధురి బోరుమని ఏడ్చారు. తనకు శ్రీనివాస్ గుర్తుకు వస్తున్నారని, ఆయన్ని రాజా అని పిలిచానంటూ తనూజతో చెప్పుకొచ్చారు. దీంతో ఆమె ఆ పిలుపును లొంగుతారని గ్రహించారు తనూజ. అందుకే రాజా అంటూ సంబోధిస్తుండటంతో మాధురి కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు బాండింగ్స్‌పై ఘాటుగా స్పందించిన మాధురి తనను తల్లిలా భావించాలంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా బయట పరిస్థితి ఎలా ఉందో కూడా తనూజకు వివరించారు. టాప్‌5లో ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వీళ్ల బంధం ఎంత వరకు వెళ్లింది అంటే మాధురి గుండెలపై పడుకొని తనూజ ఆమెకు కబుర్లు చెబుతోంది. 

Continues below advertisement

అయితే దివ్యతో జరిగిన గొడవలో మాధురి చేసిన కామెంట్స్‌తో తనూజ రియలైజ్ అయ్యారు. ఇక్కడ అంతా బాండ్‌లతోనే కాలక్షేపం చేస్తున్నారని అంటూ నాన్నా నాన్నా అంటూ వెటకారంగా మాట్లాడారు. ఆ మాట దివ్యతోనే అన్నప్పటికీ అది మాత్రం తనూజను ట్రిగ్గర్ చేసింది. దీంతో మాధురి తనతో ఉంటున్నది కేవలం కంటెంట్, ఓట్ల కోసమేనని గ్రహించారు. ఒకానొక సందర్భంలో భరణితో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బాండ్స్ పెట్టుకుంటున్న తమనే ఎందుకు అంతా తప్పుపడుతున్నారని ప్రశ్నించారు. పవన్, రీతు ఇద్దరూ ఆ బాండ్ కారణంగానే గేమ్‌ను పక్షపాతంతో ఆడారని తాము ఎప్పుడూ అలా చేయలేదని అన్నారు. కానీ అంతా తమను టార్గెట్ చేయడం బాగాలేదని చెప్పుకొచ్చారు. వచ్చిన ఒకరోజుకే ఇక్కడ గొడవలకు బోరున ఏడ్చేసిన మాధురి, ఇంట్లో వాళ్లు గుర్తుకు వస్తున్నారని ఎలా చెప్పారని ఎద్దేవా చేశారు. తనను తల్లిలా భావించాలని తనకు సలహా ఇచ్చారని అన్నారు. అంతే కాకుండా దివ్యతో గొడవ జరుగుతున్నప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోవడం లేదని సంజనను ప్రశ్నించడాన్ని కూడా తనూజ గుర్తు చేశారు. 

ఇలా మాధురి గేమ్‌ను డీ కోడ్ చేసింది తనూజ. అందుకే భరణితో కాని ఎవరితోనైనా బాండ్స్ కేవలం డిస్కషన్ వరకే అని గేమ్‌లో అలాంటివి రాకుండా చూసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే భరణిని కూడా సిద్ధం చేస్తున్నారు.