Bigg Boss VS Divvela Madhuri Promo : బిగ్​బాస్ సీజన్ 9 తెలుగు 38వ రోజుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇంట్లోకి వెళ్లినప్పటి నుంచి గొడవలు నెక్స్ట్ లెవెల్స్​లో జరుగుతున్నాయి. ముఖ్యంగా దివ్వెల మాధురి (Divvela Madhuri) కంటెంట్ ఇవ్వాలన్నా ఉద్దేశంతో అందరిపై తెగ విరుచుకుపడిపోతుంది. తాజాగా సంజన, దివ్య నిఖితపై నోరు పారేసుకుంది. ఇంతకీ ఏమి జరిగింది.. ప్రోమోలో ఏమి ఉందో ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో ఎలా సాగిందంటే.. 

బాత్రూం దగ్గర కలర్ కలర్ స్టిక్కర్స్ పెట్టాను కనిపించట్లేదు అంటూ మాధురి అడుగుతుంది. నిన్న మా మమ్మీ అడిగినట్టుంది ఎవరివి అని వాష్​రూమ్​లో అని ఇమ్మూ చెప్తాడు. అయితే ఇచ్చేయమని చెప్పరా అంటుంది మాధురి. ఇమ్మూ సంజన దగ్గరకు వెళ్లి.. నిన్న స్టిక్కర్స్ చూపించావు కదా.. మాధురిగారివి అంటా అని ఇమ్మూ చెప్పగా.. డిస్​ప్లేన్ కోసం పడేశాను అంటుంది సంజన. దాంతో మాధురి ఏంటి కామెడీనా అని అడుగుతుంది. లేదా గుడ్డు దొంగతనం చేసినట్టే.. స్టిక్కర్స్ కూడా దొంగతనం చేశారా అంటూ అడుగుతుంది. 

Continues below advertisement

సంజన బదులు ఇస్తూ లేదు నాకు నా స్టిక్కర్స్ ఉన్నాయి.. కావాలంటే నేను నావి ఇస్తాను అని చెప్తుంది. నాకు మీవి ఎందుకు నా స్టిక్కర్స్ నాకు కావాలి అంటుంది మాధురి. మీకు ఆల్రేడి బోర్డ్ వేశారుగా దొంగ అని.. మీకు అలవాటేమో అంటుంది. అందరూ మెంటల్​గాళ్లని హోజ్​లోకి పంపారేమో అనుకుంటూ దివ్య, కళ్యాణ్​తో అంటుంది. ఏదో కనిపించేయాలి.. కంటెంట్ ఇచ్చేయాలి అన్నట్లు ఉంది ఇది అంటుంది. మీకు దొంగతనం అలవాటు అని ఎద్దులా స్టిక్కర్స్​ కూడా దొంగతనం చేస్తారా? 

దివ్య vs దివ్వెల మాధురి

ఇప్పుడు మాధురిగారు దోశలతో పాటు కర్రీ వేసుకున్నారా? అని తనూజని అడుగుతుంది. అవును అని చెప్పగా.. మరి నన్ను అడగాల్సిన పనిలేదా అంటుంది. మాధురిగారు కర్రీ పోర్షన్ వేసుకున్నారు నన్ను అడగాలిగా అంటే.. నేను వేసుకుంది ఇంతనే.. దానికి కూడా అడగాలా అంటూ అరవగా.. ఒక్క సెకన్ అరవకండి అంటూ దివ్య చెప్తుంది. ఏయ్ ఏంటి వచ్చినప్పటి నుంచి గొడవపడాలి అనుకుంటున్నావా అని అడుగుతుంది. నా పర్మిషన్ లేకుండా కామన్ ఫుడ్ తీసుకునే రైట్ ఈ ఇంట్లో ఎవరికీ లేదంటూ దివ్య చెప్తుంది. అసలు నాకు ఈ ఫుడ్ మానిటర్ నచ్చలేదు మార్చేయండి అంటోంది మాధురి. 

ఓవర్​ యాక్షన్​తో చంపేస్తోందిగా..

తప్పు చేసినా చేయకపోయినా ఓ రూల్ ఉంది అంటూ కళ్యాణ్ చెప్తాడు. దానికి ఇప్పుడు ఆ అమ్మాయి నాతో మాట్లాడటం ఇష్టంలేదని చెప్పింది.. ఎలా అడగాలి అంటూ కళ్యాణ్​ని అడిగితే... పర్సనల్​గా మీకు నాకు ఎలాంటి బాండింగ్ లేదు.. కానీ ఈ విషయం అడగాలిగా అంటూ దివ్య అడుగుతుంది. మీ బాండింగ్ నాకు అవసరం లేదు. నేను మీకోసం వచ్చానా? గేమ్ కోసం వచ్చానా అంటూ ఓవర్ చేస్తుంది మాధురి. దీంతో ప్రోమో ముగిసింది.