బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో వరుసగా అయిదు వారాల పాట అయిదుగురు లేడీ కంటెస్టెంట్సే ఎలిమినేట్ అయ్యారు. ఇక తాజాగా జరిగిన ఎలిమినేషన్‌లో శుభశ్రీ బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వెళ్లిపోయింది. మామలూగా ప్రతీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లిపోగానే హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి తమ తమ అభిప్రాయాలను బయటపెడతారు. అలాగే శుభశ్రీ కూడా తను అన్న అని పిలిచే పల్లవి ప్రశాంత్‌పై, శివాజీపై వ్యాఖ్యలు చేసింది. శివాజీ వల్ల తను ఇబ్బంది పడిన సందర్భం గురించి కూడా గుర్తుచేసుకుంది. పల్లవి ప్రశాంత్ గురించి చాలా గొప్పగా మాట్లాడింది.
పల్లవి ప్రశాంత్ గురించి..
పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న ప్రతీ ఒక్కరిని తన అక్క లేదా చెల్లి, అన్నా అని వరసలతోనే పిలుస్తాడు. అలాగే శుభశ్రీని కూడా తన చెల్లి అంటూ పిలవడం మొదలుపెట్టాడు. అయితే ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ గురించి మీ అభిప్రాయం ఏంటి, గేమ్ ఎలా ఆడుతున్నాడు అని శుభశ్రీకి ప్రశ్న ఎదురయ్యింది. ‘‘సూపర్ ఆడుతున్నాడు. నేను అన్నా అని పిలుస్తా. చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. చాలా పాజిటివ్ ఉన్నాడు. మంచి అబ్బాయి. రతిక పవర్ అస్త్రా టైమ్‌లో తిట్టింది కదా. చాలా బాధగా అనిపించింది నాకు కూడా. అమాయకుడు. గేమ్ మీదే మొత్తం ఆలోచన ఉంది. చాలా నేర్చుకోవాలని అనుకున్నా. అన్నయ్య నాకొక మంచి పాట నేర్పించు అనేదాన్ని. మేమిద్దరం కలిసి ఉండే సందర్భాలు చాలా క్యూట్ ఉంటాయి. ఎప్పుడూ కూర్చొని తనతో మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే అంత ఇష్టం నాకు తనంటే. నాకు అన్న లేడు లైఫ్‌లో అన్నాను. అయితే సరే జీవితాంతం నేను నీకు అన్నా, నువ్వు నాకు చెల్లి అన్నాడు. మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నువ్వు గెలవాలి. అప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను’’ అంటూ పల్లవి ప్రశాంత్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పింది శుభశ్రీ.
శివాజీ గురించి..
వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్ అయినందుకు తనకు చాలా బాధగా ఉందని, ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ బాయ్స్ హాస్టల్‌లాగా ఉందని కామెంట్స్ చేసింది శుభశ్రీ. ఒకప్పుడు శివాజీ వల్ల అసౌకర్యంగా ఫీల్ అయ్యానని చెప్పి ఇప్పుడు ఆయనే తన ఫేవరెట్ అని చెప్తున్న శుభశ్రీ మాటలను ప్రశ్నించగా.. ‘‘మీరు 5 నిమిషాలు చూశారు. అలా ఎలివేట్ అయ్యింది. శివాజీ గారు, నేను ముందు నుండి కనెక్ట్ అయ్యాము. 5 నిమిషాలు చూసి తప్పుగా అర్థం చేసుకున్నారు. తినేటప్పుడు ఏడ్చాను కానీ అక్కడ శోభా శెట్టి కూడా ఉంది. తను వస్తే బాగుండేది. అమ్మాయి, అమ్మాయిలాగా ఉండేది. కానీ శివాజీ గారి మీద నాకు చాలా గౌరవం ఉంది. 5 నిమిషాల తర్వాత కూడా మేము కనెక్ట్ అయిపోయాము. నేను వెళ్లే టైమ్‌లో కూడా నన్ను శుభమ్మ అని పిలుస్తారు. అదే గౌరవం ఉంటుంది ఇప్పటికీ. నన్ను బుజ్జమ్మ అంటారు. మా నాన్నమ్మ పేరు బుజ్జమ్మ. నువ్వు మా నాన్నమ్మలాగా ఉంటావు అంటారు. నాకు ఆయనంటే చాలా గౌరవం, ప్రేమ. ఇలాగే జీవితాంతం ఉంటుందని అనుకుంటున్నాను. చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుండి. సినిమాల గురించి, అనుభవాల గురించి, జీవితంలో ఏమేం చేశారు అని ఇలా చాలా మాట్లాడుకున్నాం. తప్పకుండా నా ఫేవరెట్ శివాజీ గారు’’ అంటూ శివాజీని ప్రశంసలతో ముంచేసింది శుభశ్రీ.
Also Read: బిగ్ బాస్‌లో ఆటగాళ్లు vs పోటుగాళ్లు - మొదటిరోజే ఏడుపు మొదలుపెట్టిన అశ్విని శ్రీ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial