Bigg Boss 6 Telugu: బ్యాటరీ రీఛార్జ్ టాస్కునిచ్చిన బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు అదిరిపోయే సర్ప్రైజ్‌లు ఇచ్చాడు. నిన్నటి ఎపిసోడ్లో ఆదిరెడ్డి, సుదీప, శ్రీహాన్ వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నారు. కానీ పాపం శ్రీహాన్ అందరి గురించి ఆలోచించి 15 శాతం బ్యాటరీతో ఫుడ్ తెప్పించుకున్నాడు. అతనికి మళ్లీ బ్యాటరీ రీఛార్జ్ చేస్తారని తెలియలేదు. ఇప్పుడు ఆ విషయంలో పశ్చాత్తాపం పడుతూ కనిపించాడు. అందరూ వీడియోకాల్, ఆడియో కాల్ మాట్లాడుతూ ఉంటే ‘నాకెందుకు బిగ్ బాస్ చెప్పలేదు బ్యాటరీ రీఛార్జ్ ఉంటుందని’ అన్నాడు.
ఒక ప్రోమోలో ఏముందంటే...ఇంటి బ్యాటరీని రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని మళ్లీ ఇంటి సభ్యులకు ఇస్తున్నట్టు చెప్పాడు బిగ్‌బాస్. ఇందుకు ఫైమా బిగ్ బాస్ ఇచ్చిన కథను కేవలం ఇంగ్లిష్‌లోనే ఇంటి సభ్యులకు చెప్పాలని అన్నారు. ఫైమా తనకు వచ్చిన ఇంగ్లిష్ తో నెట్టుకొచ్చింది. ఆమె ఇంగ్లిష్ కు ఇంటి సభ్యులంతా పడి పడి నవ్వారు. తిరిగి బ్యాటరీ రీఛార్జ్ అయ్యింది. ఈసారి బాలాదిత్య, శ్రీ సత్య, ఇనయా అవకాశాన్ని అందుకున్నారు. శ్రీ సత్య వీడియోకాల్ కోరుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు టీవీ తెరపైకి వచ్చారు. తరువాత బాలాదిత్య తన కూతురితో ఆడియోకాల్ మాట్లాడాడు. ఇనయాకు తండ్రి ఫోటో బహుమతిగా వచ్చింది. ఈ మధ్యలో సూర్య ‘నన్ను పంపించేయండి, మా అమ్మ దగ్గరే ఉంటాను’ అంటూ ఏడ్చాడు. అతడిని ఓదార్చడమే పనిగా పెట్టుకుంది ఇనయా. నామినేషన్లో హీట్ అంతా ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ తో ఇంటి సభ్యులకు గుర్తు లేకుండా పోయింది.
కీర్తి, మెరీనా, రోహిత్, రాజశేఖర్, వాసంతిలకు ఇంకా అవకాశం రాలేదు. వస్తుందో రాదో కూడా తెలియదు. దీంతో వారు ఆందోళనగా కనిపించారు.
Also read: భార్యను, కూతురిని చూసి ఆదిరెడ్డి ఫుల్ రీఛార్జ్, సుదీపకు భర్త ఫోన్ కాల్, శ్రీహాన్‌కు మటన్ బిర్యానీ