BiggBoss 6 Telugu: అయిదు , పది కాదు... ఏకంగా నలభై లక్షల రూపాయలు. ఇంత ఆఫర్ చేస్తే టెంప్ట్ అవ్వకుండా ఎవరైనా ఉంటారా? అలాగే శ్రీహాన్ కూడా టెంప్ట్ అయ్యాడు. అతడి తండ్రి కూడా డబ్బులు తీసుకోమని సూచించడంతో డబ్బుల సూట్ కేసు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. దీంతో రేవంత్ విన్నర్ అయ్యాడు. కానీ కేవలం పదిలక్షలు మాత్రమే ఆయనకు దక్కింది. అలాగే ప్లాట్, కారు దక్కించుకున్నాడు. విజేత అయిన రేవంత్‌కు దక్కినదాంతో పోలిస్తే శ్రీహాన్‌కే ఎక్కువ దక్కినట్టు. మనీ పరంగా చూస్తే శ్రీహాన్ విజేత. కానీ ట్రోఫీ పరంగా చూస్తే రేవంత్ విన్నర్.
శ్రీహాన్ విన్నర్...
నలభై లక్షల రూపాయలు అనగానే శ్రీహాన్ తల్లిదండ్రులు, శ్రీహాన్ కూడా టెంప్ట్ అయ్యారు. నాగార్జున నలభై లక్షల ఆఫర్ ఇచ్చేసరికి శ్రీహాన్ తల్లిదండ్రులు, మాజీ కంటెస్టెంట్లు కూడా తీసుకోమని సలహా ఇచ్చారు. దీంతో శ్రీహాన్ ‘అమ్మానాన్న కోసం తీసుకుంటున్నా’ అని చెప్పి ఒప్పుకున్నారు. నాగార్జున వారిద్దరినీ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చారు. విన్నర్‌గా రేవంత్‌ను ప్రకటించారు. కానీ చివర్లో పెద్ద ట్విస్టు ఇచ్చారు నాగార్జున. దెబ్బకి రేవంత్ ముఖం మాడిపోయింది. ఓట్ల పరంగా ఎవరు విన్నరో కూడా చెప్పాల్సిన బాధ్యత తనకు ఉందని, అత్యధిక ఓట్లు పడింది శ్రీహాన్‌కేనని చెప్పారు. దీంతో రియల్ విజేత తనే అని తెలిసి చాలా ఆనందపడ్డాడు శ్రీహాన్. ఇది చాలు సార్ అంటూ ఉప్పొంగిపోయాడు.
ఎవరికి ఎంతిచ్చారు?
శ్రీహాన్ నలభై లక్షల రూపాయలు అందుకోవడంతో మిగతా పది లక్షల రూపాయల చెక్‌ను రేవంత్‌కు అందించారు నాగార్జున. అలాగే ఫ్లాట్, కారు తాళాలు అందించారు. శ్రీహాన్‌కు సువర్ణ భూమి ప్రాపర్టీలలో ప్లాట్ కొంటే యాభై శాతం తగ్గిస్తామని మాట ఇచ్చారు ఆ సంస్థ డైరెక్టర్. రేవంత్ కు 30 లక్షలు విలువ చేసే ప్లాట్, 12 లక్షల విలువ చేసే కారు, పది లక్షల రూపాయలు దక్కింది. అంటే మొత్తంగా 52 లక్షల దాకా వచ్చింది. ఈ సీజన్లో ఇద్దరూ విజేతలుగానే చెప్పుకోవాలి. ఇద్దరూ ఆర్ధికంగా లాభపడ్డారు. కానీ చివర్లో శ్రీహాన్‌కే అధికంగా ఓట్లు పడ్డాయని చెప్పడంతో రేవంత్ ఫేస్ డల్‌గా మారిపోయింది.
Also read: బిగ్‌బాస్ సీజన్ 6 విజేత రేవంత్ - అప్పుడు ఐడల్, ఇప్పుడు బిగ్‌బాస్