Bigg Boss Geetu Emotional: బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు ఎవరైనా బాధపడతారు, కొంతమంది ఏడుస్తారు. అది కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ విచిత్రంగా గీతూ రోజుల తరబడి అదే పనిచేస్తుంది. ఆమె బిగ్‌బాస్లోకి వస్తూనే తానే విన్నర్ అని మనసులో గట్టిగా ఫిక్సయిపోయింది, అంతే కాదు ఫ్యామిలీ వీక్ కోసం ముందుగానే అమ్మకు చీర కొని ఇచ్చింది... ఇవన్నీ చూస్తే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని అర్థమవుతోంది. ఆమె అతి చేష్టలే కొంపముంచాయి. విపరీతమై ట్రోలింగ్ బారిన పడింది. చివరికి బిగ్‌బాస్, నాగార్జున మాట కూడా ఆమె పెడచెవిన పెట్టేది. తానే బిగ్‌బాస్‌లా వ్యవహరించడం మొదలు పెట్టింది. ఇంకేముంది ఆమె ఆడుతున్నప్పటికీ, ఆమెపై వచ్చిన వ్యతిరేకత వల్ల బిగ్ బాస్ ఆట నుంచి ఎలిమినేట్ చేశాడు. ఎలిమినేట్ అయిన రోజు నర్మదా నది పారింది బిగ్‌బాస్‌లో. ‘నేను పోను బిగ్ బాస్’ అంటూ అక్కడే కూర్చుని ఏడ్వసాగింది. ఎంత పంపించినా బిగ్ బాస్ వేదికను విడిచి వెళ్లలేదు. దీంతో ఇద్దరు స్టార్ మా ఉద్యోగులు వచ్చి ఆమెను వేదికపై నుంచి తీసుకెళ్లారు. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయితే జీవితమే పోయినంత సీన్ చేసింది గీతూ. ఆ అతి ప్రవర్తన కారణంగానే ఆమెకు చెడ్డ పేరు వచ్చింది. ఆమె ఎలిమినేట్ అయిపోయి ఇప్పటికీ ఆరు వారాలు అవుతున్నా ఇంకా ఆమె ఏడుపు ఆగలేదు. 


జర్నీ చూసి...
బిగ్ బాస్ ఫినాలే సందర్భంగా హౌస్ జర్నీని వేశారు నాగార్జున. అది చూసి అందరూ ఎమోషన్ అయ్యారు.కొందరికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీరు చెంపల మీద నుంచి జారినా వారు కంట్రోల్ లో ఉన్నారు. కానీ గీతూ మాత్రం వెక్కి వెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది. ఆమెను ఫైమా ఓదార్చసాగింది. అంతేకాదు టాప్ 5 కంటెస్టెంట్లతో నాగార్జున మాట్లాడుతున్నంత సేపు ముఖం మాడ్చుకునే ఉంటుంది గీతూ. మిగతా అందరూ ఎలిమినేట్ వాళ్లే. కానీ వారు చాలా సాధారణంగా ప్రవర్తించారు. ఈమె మాత్రం తానే విన్నర్ అవ్వాల్సింది,మిస్ అయిపోయినట్టు తెగ ఫీలైపోతుంది. తన ప్రవర్తనలోనే లోపం ఉందని ఆమె ఇప్పటికీ తెలుసుకోలేకపోతుంది. 


శ్రీహాన్ - రేవంత్
హౌస్ జర్నీని చూసి వాసంతి చాలా ఎమోషనల్ అయింది. తనకు ఒక ఫ్యామిలీ దొరికిందని చాలా సంతోషంగా ఫీలయ్యింది. ఇక శ్రీహాన్ - రేవంత్ ఒకరిని పట్టుకుని కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నారు. మెరీనా ఎమోషనల్ గా ఫీలై, కన్నీళ్లు పెట్టుకుంది. 


ఇంట్లో టాప్ 5 కంటెస్టెంట్లు ఉన్నారు. వారిలో విజేత ఎవరో ఇంకాసేపట్లో తేలిపోనుంది. దాదాపు రేవంత్ విన్నర్ అయినట్టు పక్కా సమాచారం. ఇక రన్నరప్ శ్రీహాన్ నిలిచాడని, మూడో స్థానంలో ఆదిరెడ్డి, నాలుగో స్థానంలో కీర్తి, అయిదో స్థానంలో రోహిత్ ఉన్నట్టు తెలస్తోంది. బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ యాభై లక్షల రూపాయలు, ఒక కారు, స్థలం.  


Also read: ఫినాలేలో టాప్ 5 కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్లు - మరి కీర్తి కోసం ఎవరు వచ్చారు?