BiggBoss 6 Telugu Finale: బిగ్ బాస్ ఫినాలే గ్రాండ్ గా జరుగుతోంది. మాజీ కంటెస్టెంట్లతో పాటూ టాప్ 5 కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్లు హాజరయ్యారు. వారందరితోనూ  నాగార్జున మాట్లాడారు. రేవంత్ కోసం అతని తల్లి సీతా సుబ్బలక్ష్మి వచ్చారు. ఇక రోహిత్ కోసం అతని తల్లిదండ్రులు, భార్య మెరీనా వచ్చారు. శ్రీహాన్ కోసం అతని తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చారు. ఆదిరెడ్డి కోసం అతని భార్య కవిత, తండ్రి వచ్చారు. మరి కీర్తి కోసం? ఇదే సందేహం చాలా మందికి వచ్చింది. ఫ్యామిలీయే లేని కీర్తి బిగ్ బాస్‌లో ఎక్కువ సార్లు బాధపడింది ఈ విషయం గురించే. ఫ్యామిలీ లేకుండా ఒంటరి అయిపోయానని తన కోసం ఎవరూ లేరని చాలా బాధపడింది.అయితే ఆమె కోసం బెంగళూరు నుంచి ఇద్దరు వచ్చారు. 


ఆ ఇద్దరు ఎవరంటే... ఒకబ్బాయి నరేష్. అతను బెంగళూరు నుంచి వచ్చారు. తనకు కీర్తికి ఎలాంటి బంధం లేదు. కానీ కీర్తి కోసం నాలాంటి ఆడియెన్స్ చాలా మంది ఉన్నారని, వారికి ప్రతినిధిగా వచ్చానని చెప్పారు. అలాగే కీర్తి తనకు ఫ్రెండ్ అని చెప్పారు. మరొక వ్యక్తి శంకర్. కీర్తి తన కెరియర్‌ను తన సంస్థ ద్వారానే మొదలుపెట్టింది. ఆమెకు టీమ్ లీడర్‌గా కూడా పనిచేశానని, అందుకే కీర్తికి మద్దతుగా తాను వచ్చానని చెప్పారు. గతంలో కీర్తి కోసం ఫ్యామిలీ మెంబర్ల స్థానంలో మానస్ ఒకసారి, మరోసారి మహేష్ మాట్లాడడం జరిగింది. ఈసారి కూడా వారిలో ఎవరో ఒకరు వస్తారని అనుకున్నారు. కానీ డిఫరెంట్ ఆడియెన్స్ నుంచి ఒకరిని తీసుకురావడం గొప్పగా అనిపిస్తుంది. 


కీర్తి భట్ ఫ్యామిలీ కారు యాక్సిడెంట్లో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈమె ఒక్కతే బతికింది. అది కూడా కొన్ని రోజుల పాటూ కోమాలో ఉండి బయటికి వచ్చింది. బంధువులు సరిగా చూడక ఇంట్లోంచి బయటికి వచ్చి, తినేందుకు ఫుడ్ కూడా లేక చాలా బాధలు పడింది. ఇప్పుడు స్వశక్తితో సీరియల్ హీరోయిన్ గా నిలబడింది. అయితే ఆమె బిగ్‌బాస్‌లో తన జీవితం గురించి అప్పుడప్పుడు పంచుకునేది. ఓసారి తను పెంచుకున్న పాప గురించి చెప్పి కన్నీరు పెట్టుకుంది. ఆ పాప చనిపోయిందని ఎంతో బాధపడింది. బిగ్‌బాస్‌కు రావడానికి ముందు ఆమె కొన్ని ఇంటర్య్వూలు ఇచ్చింది. వాటిలో తన పాప గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. 






Also read: నా ఫస్ట్ రెమ్యునరేషన్ చెక్ ఇచ్చింది నాగార్జునే - బిగ్‌బాస్ ఫినాలేలో రవితేజ