బిగ్ బాస్ రియాలిటీ షోలలో అప్పుడప్పుడు సెలబ్రిటీలు వచ్చి సందడి చేయడం సహజమే. తమ సినిమా ప్రమోషన్స్ కోసం ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు బిగ్ బాస్ స్టేజ్‌పై అడుగుపెట్టారు. మరికొందరు అయితే ఏకంగా బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిపోయి మరీ కంటెస్టెంట్స్‌తో ఆటలు కూడా ఆడించారు. ఇక తాజాగా తమ అప్‌కమింగ్ మూవీ ‘భగవంత్ కేసరి’ ప్రమోషన్స్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు హీరోయిన్ శ్రీలీల కూడా బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్‌పై అడుగుపెట్టారు. అంతే కాకుండా వారి సినిమా కబుర్లను నాగార్జునతో పంచుకున్నారు. అదే క్రమంలో ఈ మూవీలో తన క్యారెక్టర్ గురించి చెప్తూ శ్రీలీల ఎమోషనల్ కూడా అయ్యింది. దీంతో నాగ్ ఆమెను ఓదార్చి.. నవ్వించారు.
జైలు బ్యాక్‌గ్రౌండ్ కథ
అనిల్ రావిపూడి, శ్రీలీల బిగ్ బాస్ స్టేజ్‌పై ‘భగవంత్ కేసరి’ సినిమాలోని ఉయ్యాలో ఉయ్యాల పాటకు స్టెప్పులేశారు. ఆ తర్వాత నాగార్జున.. ‘‘ఈ అమ్మాయి తెలుగు సినిమాలోనే బిజీ యాక్టర్’’ అని శ్రీలీలను ఉద్దేశించి అన్నారు. ‘‘సినిమా అంతా జైలు బ్యాక్‌గ్రౌండ్ అంట కదా’’ అని అనిల్ రావిపూడిని అడిగారు. ‘‘మొదటి 15, 20 నిమిషాలు. అక్కడి నుండి కథ మొదలవుతుంది.’’ అని ‘భగవంత్ కేసరి’ కథ గురించి చిన్న హింట్ ఇచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘మీకు తెలుసు కదా మా బిగ్ బాస్ హౌజ్ కూడా జైలులాంటిదే’’ అని నాగ్ అనగా.. ‘‘అతిపెద్ద జైలు, కనీసం ఆ జైలులో అన్నీ అందుతాయి’’ అని అనిల్ సమాధానమిచ్చాడు. అనిల్ ఇచ్చిన సమాధానం విని అందరూ నవ్వుకున్నారు.
బాలయ్య కొత్తగా కనిపిస్తారు
ఆ తర్వాత ‘భగవంత్ కేసరి’ గురించి అడిగి తెలుసుకున్నారు నాగార్జున. ‘‘బాలకృష్ణ గారు ఈ సినిమాలో మనం ఇంతకు ముందు చూసిన ఆయనకంటే చాలా కొత్తగా కనిపిస్తారు. ఆయన మీద ఇంటెన్స్ డ్రామా చేసిన ప్రతీ సినిమా బాగా వర్కవుట్ అయ్యింది.’’ అని తన సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు అనిల్. ఆ తర్వాత శ్రీలీల.. ‘‘నేను నా ఏజ్‌కంటే ఒక చిన్న అమ్మాయి పాత్ర ప్లే చేశాను కాబట్టి చాలా కనెక్టెడ్ అనిపించింది’’ అని చెప్తూ ఎమోషనల్ అయిపోయింది. మొత్తానికి సండే ఫన్‌డే ఎపిసోడ్‌లో ‘భగవంత్ కేసరి’ టీమ్ సందడి చేయడం కంటెస్టెంట్స్‌లో ఉత్సాహాన్ని నింపింది.
‘భగవంత్ కేసరి’ విశేషాలు
2023 అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి’ విడుదలకు సిద్ధమయ్యింది. ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలకు తన కామెడీని యాడ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న అనిల్ రావిపూడి.. ఈసారి బాలయ్యలాంటి సీనియర్ హీరోతో చేతులు కలిపి యాక్షన్ జోనర్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. చాలాకాలం తర్వాత కాజల్ అగర్వాల్.. ఈ సినిమాతో తన తెలుగు ఫ్యాన్స్‌ను పలకరించనుంది. ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా కాజల్ నటిస్తుండగా.. శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో కనిపించనుంది. ఇక ఈ మూవీలో మరెన్నో సర్‌ప్రైజ్‌లు ఉంటాయని ప్రేక్షకుల్లో మరింత హైప్ పెంచేస్తోంది మూవీ టీమ్. ఇప్పటికే విడుదలయిన ‘భగవంత్ కేసరి’ టీజర్, ట్రైలర్ కూడా బాలయ్యను ఆకట్టుకునేలా ఉన్నాయి.
Also Read: బిగ్ బాస్ స్టేజ్‌పై శ్రీలీల సందడి- "మాస్" డైలాగ్‌తో అదరగొట్టిన యావర్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial