బిగ్ బాస్ సీజన్ 7 అనేది 14 మంది కంటెస్టెంట్స్‌తో మొదలయ్యింది. ఇప్పటికీ నాలుగు వార్తలు పూర్తయ్యాయి. నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అనూహ్యంగా ఆ నలుగురు లేడీ కంటెస్టెంట్సే అయ్యారు. ఇక బిగ్ బాస్ అయిదో వారంలో కూడా మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ముగ్గురు మాత్రమే లేడీ కంటెస్టెంట్స్ మిగిలారు. ఈ ముగ్గురులో నుండి ఒక లేడీ కంటెస్టెంట్.. ఈ ఆదివారం ఎలిమినేట్ కానుంది. అంటే ప్రియాంక, శోభా శెట్టి, శుభశ్రీలో ఒకరు ఈ వారం హౌజ్ వదిలి వెళ్లిపోయారు.


రెండు వారాలు సేఫ్ గేమ్..
లాయర్‌గా, మోడల్‌గా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన శుభశ్రీ.. బిగ్ బాస్‌లో మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక అయిదో వారంలో ఎలిమినేట్ అయిపోతున్నట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంటర్ అయిన బ్యూటీలలో ఫస్ట్ లుక్‌నే ఇంప్రెస్ చేసినవారిలో శుభశ్రీ ఒకరు. మొదటిరోజే తనను చూసి ఫిదా అయిన మేల్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. కానీ ప్రేక్షకులను మాత్రం ఫిదా చేయలేకపోయింది శుభ. మొదటి రెండు వారాల వరకు శుభశ్రీ ఎక్కువగా అందరితో మాట్లాడకుండా, కొంతమందితోనే ఉంటూ సేఫ్ గేమ్ ఆడింది. దీంతో రెండు వారాల వరకు తను అసలు నామినేషన్స్‌లోకి రాలేదు. దీంతో హ్యాపీగా హౌజ్‌లో తిరిగేసింది. మూడో వారంలో ఈ విషయాన్ని గమనించిన కొందరు కంటెస్టెంట్స్.. తనను నామినేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటినుండి శుభశ్రీ ఆట కొత్తగా మారింది.


ముందు గౌతమ్, ఆ తర్వాత యావర్..
అబ్బాయిల మీద ఆధారపడి ముందుకు వెళ్లే లేడీ కంటెస్టెంట్స్.. ప్రతీ సీజన్‌లో ఉంటారు. బిగ్ బాస్ సీజన్ 7లో అలాంటి కంటెస్టెంట్ శుభశ్రీనే అని ప్రేక్షకులు భావించారు. హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే గౌతమ్ కృష్ణ.. శుభశ్రీ చాలా అందంగా ఉంది అంటూ సంకెళ్లు వేశాడు. అప్పటినుండే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలవుతుంది అని ప్రేక్షకులు ఊహించారు. కానీ కొన్నిరోజులకే వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. అయినా కూడా గౌతమ్‌తో ఇష్టం లేనట్టుగా ప్రవర్తించలేదు శుభశ్రీ. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు రొమాంటిక్ ప్రోమోలుగా కూడా ఎన్నోసార్లు విడుదలయ్యాయి. ఆ తర్వాత ప్రిన్స్ యావర్‌తో క్లోజ్‌గా మూవ్ అవ్వడం మొదలుపెట్టింది శుభశ్రీ. యావర్ ఓడిపోయి ఆగ్రహం తెచ్చుకున్న ప్రతీసారి తనను కూల్ చేయడానికి శుభశ్రీ ముందుకు వచ్చింది. ఇప్పుడు యావర్ ఏం చెప్పినా శుభశ్రీ వినే పరిస్థితికి వచ్చేసింది. అది కరెక్ట్ అయినా కాకపోయినా..


టాస్కుల విషయంలో సున్నా..
టాస్కుల విషయంలో శుభశ్రీ తొందరగా వెనకడుగు వేసింది. ఇప్పటివరకు ఏ టాస్కులోనూ శుభశ్రీ గెలవలేదు. ఇటీవల జరిగిన పవర్ అస్త్రా టాస్క్‌లో శివాజీ తనవైపు పక్షపాతంగా ఆలోచించడం వల్లే శుభశ్రీకి పవర్ అస్త్రా కంటెండర్ అయ్యే అవకాశం వచ్చింది. అయినా కూడా ఆ టాస్క్‌లో సరిగా ఆడలేక తను పవర్ అస్త్రాను గెలుచుకోలేకపోయింది. ఆ ఒక్కసారి తప్పా ఇంకెప్పుడూ తనకు కనీసం కంటెండర్ అయ్యే అవకాశం కూడా దొరకలేదు. దానికి తన ఆటతీరే కారణమని ప్రేక్షకులు భావించారు. ఎంటర్‌టైన్మెంట్ విషయంలో మాత్రమే కాకుండా తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది కాబట్టి అయిదు వారాలో ఎలాగో ఒకలాగా హౌజ్‌లో గడిపేసిన శుభశ్రీ.. ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోక తప్పలేదు.


Also Read: ‘లియో’ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమేనా! - క్లారిటీ ఇచ్చిన నిర్మాత


Join Us on Telegram: https://t.me/abpdesamofficial