Bigg Boss Season 7 Latest Promo : బిగ్ బాస్ సీజన్ 7 అంటేనే ఉల్టా పుల్టా. కానీ సీజన్ ప్రారంభమై అయిదు వారాలు అవుతున్నా.. ఇంకా కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా షాక్ అయ్యే.. ఉల్టా పుల్టా ఫీల్ మాత్రం ఇంకా రాలేదు. అలాంటి ట్విస్ట్ ఇప్పుడు వచ్చేలానే ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలే బిగ్ బాస్ సీజన్ 7లో పెద్ద ట్విస్టు అనుకుంటున్న సమయంలో.. మరో తాజా అంశం తెరపైకి వచ్చింది. తాజాగా విడుదలయిన వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో 3లో హౌజ్‌లో ఉన్న 10 మంది కంటెస్టెంట్స్‌లో ఎవరు అనర్హులు అని నాగార్జున చెప్పమన్నారు. అందరూ వారి వారి అభిప్రాయాలు చెప్పగా.. నాగార్జున చివర్లో ఒక ట్విస్ట్ ఇచ్చారు.
ముందుగా ఈ ప్రోమోలో బిగ్ బాస్ సీజన్ 7లోకి 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారని.. అందులో నలుగురు కంటెస్టెంట్స్ ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా 10 మంది మిగిలారని నాగార్జున గుర్తుచేశారు. ఆ తర్వాత ఈ పదిమందిలో అనర్హులు ఎవరు అని కంటెస్టెంట్స్‌ను అడిగారు. ముందుగా శోభా శెట్టి.. తన అభిప్రాయాన్ని చెప్పడానికి ముందుకొచ్చింది. తన ఉద్దేశంలో తేజ, గౌతమ్, శివాజీ అనర్హులు అని చెప్పింది. శివాజీ ప్రతీ విషయానికి రూల్, రూల్ అంటుంటాడని, అందుకే తను అనర్హుడు అని శోభా తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఆ తర్వాత వచ్చిన తేజ.. తన అభిప్రాయంలో అమర్దీప్, శుభశ్రీ, గౌతమ్ అనర్హులు అని తేల్చాడు. కోపం కొంచెం తగ్గిస్తే సరిపోతుందని.. దాని వల్ల పక్కనవాళ్లు కొంచెం ఇబ్బంది పడుతున్నారని అని ఒక కంటెస్టెంట్‌ను ఉద్దేశించి చెప్పడం ఈ ప్రోమోలో చూపించారు.
అమర్దీప్.. యావర్, శుభశ్రీ, గౌతమ్‌లను అనర్హులు అనుకుంటున్నట్టుగా తేల్చాడు. ‘‘యావర్ దగ్గర ఏదైతే నచ్చలేదని చెప్పి చాలాసార్లు ఫైట్ చేశాడో.. అదే జోన్లోకి గౌతమ్ వెళ్లిపోయాడు’’ అంటూ గౌతమ్ అనర్హుడు అనుకోవడానికి కారణాన్ని చెప్పాడు. ఇక శివాజీ వచ్చి అమర్దీప్, ప్రియాంక, గౌతమ్‌లను అనర్హులు అన్నాడు. ‘‘అమర్ మంచివాడే కానీ ఆట విషయంలో మాత్రం చాలా తప్పు పద్ధతిలో ఆడుతున్నాడు. అది హౌజ్‌కు మంచిది కాదు’’ అని అమర్‌పై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. సందీప్ అయితే గౌతమ్, శివాజీ, యావర్ అనర్హులు అని తేల్చాడు. వారు ఎందుకు అనర్హులు అనే కారణాలు కూడా చెప్పాడు.
ఆ తర్వాత తన ఉద్దేశంలో అనర్హులు ఎవరో చెప్పడానికి వచ్చింది శుభశ్రీ. తేజ, ప్రియాంక, అమర్దీప్ అనర్హులు అంటూ వారి ఫోటోలను బోర్డ్ మీద పెట్టింది. పల్లవి ప్రశాంత్ అయితే యావర్‌ను, అమర్‌దీప్‌ను, టేస్టీ తేజను అనర్హులు అని అన్నాడు. టేస్టీ తేజ టాస్కులలో మరింత యాక్టివ్ ఉంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. ‘‘అన్ని ఉన్నవాళ్లను చూస్తున్నావు. ఏమీ లేనివాళ్లను దగ్గర తీసుకుంటున్నావు.’’ అని అమర్దీప్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటూ ప్రశాంత్.. తనను అనర్హుడిగా ప్రకటించాడు. ఇక అందరి అభిప్రాయాలను విన్న నాగార్జున.. ‘‘హౌజ్‌లో ఉన్న అందరి అభిప్రాయం ప్రకారం చివరిలో ఉన్న ముగ్గురు ఎవరో నేను మీకు రేపు చెప్తాను. మీరు ఎవరూ ఊహించని విషయం రేపు జరగనుంది. సిద్ధంగా ఉండండి’’ అంటూ హెచ్చరించాడు. ఒకవేళ ఈసారి బిగ్ బాస్‌లో ముగ్గురు కంటెస్టెంట్స్ ఒకేసారి ఎలిమినేట్ అయ్యే ట్విస్ట్ ఏమైనా ఉంటుందా అని ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు. ఈ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే.
Also Read: అమర్‌కు ఏం చెప్పినా వినడు, మొదటి నుంచి అంతే - నాగార్జున ముందే శివాజీ ఆరోపణలు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial