బిగ్ బాస్ వారం మొత్తం ఏం జరిగిందో చెప్తూ ఇంట్లో వాళ్ళ తాట తీసేందుకు రెడీ అయిపోయాడు నాగార్జున. వీకెండ్ మస్త్ ఎంజాయ్ మెంట్ ఇచ్చేందుకు కింగ్ రెడీ అయిపోయారు. అలాగే ఇంట్లో వాళ్ళ ప్రవర్తన మీద పెద్ద క్లాస్ తీసుకున్నాడు. ఈ వారం తమ ఫ్రెండ్షిప్ తో ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్న యావర్, టేస్టీ తేజ నాగార్జున మనసు కూడా గెలుచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు.


కింగ్ మనసు దోచుకున్న బడ్డీస్!


బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున టీవీ ద్వారా ఇంటి సభ్యులతో మాట్లాడారు. ముందుగా తేజ, యావర్ గురించి మాట్లాడుతూ మెచ్చుకున్నారు. తేజ ఎంటర్ టైన్ చేస్తానని మాట ఇచ్చినట్టే ఎంటర్ టైన్ చేశావని అనేసరికి తేజ సంతోషపడిపోతాడు. మీ ఇద్దరినీ చూస్తుంటే ముచ్చటేసిందని నాగార్జున వాళ్ళని అభినందించారు. ఆ మాటని తేజ యావర్ కి ఇంగ్లీష్ లోకి ట్రాన్సలేట్ చేసి చెప్పడం ఫన్నీగా అనిపించింది. ఇక తెలుగు టాస్క్ లో యావర్ చేసిన పని గురించి మాట్లాడుతూ టీచర్ కావాలా? అంటూ నాగార్జున సెటైర్ వేస్తూ నవ్వులు పూయించారు.


బొక్కలో జడ్జిమెంట్.. 


ఇక సందీప్, అమర్ చేసిన పనికి నాగార్జున సీరియస్ అయ్యారు. టాస్క్ పూర్తి కాకుండా బెల్ కొట్టడం కరెక్టేనా అని నిలదీశాడు. తను రన్ కి వెళ్తుంటే మాస్టర్ బెల్ కొట్టారని అమర్ చెప్పుకొచ్చాడు. మీ ఇద్దరికి మాత్రమే కాదు అందరికీ చూపిస్తాను. మీ తెలివి తేటలు పరాకాష్టలో ఉన్నాయని నాగార్జున సీరియస్ అయ్యాడు. పండ్ల రసం పిండే టాస్క్ లో అమర్, సందీప్ చేసిన తప్పుకి సంబంధించిన వీడియో చూపించడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. పండ్ల టాస్క్ కి సంచాలక్ ఎవరు అని హౌస్ మేట్స్ ని అడగ్గా ఎవరూ లేరని సమాధానం ఇచ్చారు. కానీ నాగార్జున మాత్రం నువ్వే సంచాలక్ గా కదా అన్నారు.


అమర్ కి కోపం వచ్చినప్పుడు ‘బొక్క’ అనే పదం ఉపయోగించడంపై నాగార్జున మండిపడ్డారు. మాటి మాటికీ వేరే వాళ్ళని బొక్కలో జడ్జిమెంట్ అంటున్నావ్ కదా అంటే అది ఏదో ఫ్రెండ్షిప్ లో సరదాగా అన్నానని అమర్ కవర్ చేసుకునేందుకు ట్రై చేశాడు. దానికి నాగార్జున కూడ ఇప్పుడు నేను కూడ ఫ్రెండ్షిప్ కొద్దీ అంటున్నా “తొక్కలో సంచాలక్ బొక్కలో జడ్జిమెంట్” అనడంతో అమర్ మొహం మాడిపోయింది. అమర్ వాడే పదాన్ని ఇంట్లో వాళ్ళు కూడా వ్యతిరేకించారు.


వైల్డ్ కార్డ్ ఎంట్రీస్


బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అని ముందుగానే చెప్పారు. 14 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైంది. ఇప్పటికి నలుగురు సభ్యులు ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు సీజన్ కి సంబంధించి మరొక హింట్ ఇచ్చారు నాగార్జున. దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఇటీవలే రిలీజ్ చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నలుగురు కంటెస్టెంట్లు ఇంట్లోకి వెళ్లనున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా సీరియల్ నటుడు అంబటి అర్జున్‌తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణీ కూతురు సుప్రిత కన్ఫర్మ్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి మొదటి కెప్టెన్ అయ్యాడు.


Also Read: సందీప్‌కు గౌతమ్ 'ధమ్కీ' - ప్రియాంక కన్‌ఫ్యూజన్, పాపం టేస్టీ తేజ!