Bigg Boss Telugu Season 8: ఫుడ్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ లో చాలా విశేషాలు జరిగాయి. ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమ స్ట్రాటజీని ఉపయోగిస్తూ గేమ్ ఆడుతున్నారు. రేషన్ ను గెలుచుకున్న సభ్యులు దానిని దాచుకుంటూనే, అవతలి వాళ్ళ ఫుడ్ ను దొంగతనం చేయడానికి ట్రై చేశారు. యశ్మీ, నబిల్, నైనిక వంటి వారు చాలా యాక్టివ్ గా ఫుడ్ గేమ్ ఆడుతున్నారు. కానీ సోనియా మాత్రం తాజాగా మళ్లీ విష్ణు ప్రియ విషయంలో నోరు జారింది. ఆల్రెడీ విష్ణుప్రియను నామినేషన్లలో అనకూడని మాటలు అని, అంతకంటే ముందే ఆడల్ట్రేడ్ కామెడీ అంటూ నెగెటివిటీని తెచ్చుకుంది సోనియా. అయితే ఆ తర్వాత హౌస్ లో జరిగిన కొన్ని పరిణామాలను చూసి ఒక్క మాటతో సీన్ రివర్స్ చేసింది అనుకునే లోపే మళ్ళీ పాత బాట పట్టింది.
విష్ణుప్రియ చీప్ గా రెచ్చగొడుతోంది
గేమ్ లో భాగంగా విష్ణు ప్రియ జ్యూస్ ను యశ్మీ టీం వాళ్లకు చూపిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అది చూసిన అభయ్ "జ్యూస్ కోసం గొడవ పడుతున్నారు. కచ్చితంగా విష్ణునే రెచ్చగొట్టి ఉంటుంది. ప్రేరణ మెచ్యూర్డ్ గా రెచ్చగొడుతుంది" అని తన అభిప్రాయాన్ని చెప్తుంటే, అంతలోనే సోనియా అందుకుని "విష్ణు చీప్ గా రెచ్చగొడుతుంది" అని కామెంట్ చేసింది. ఇంతకుముందే నామినేషన్లలో విష్ణు ప్రియ బట్టలు మార్చుకోవడం గురించి మాట్లాడి ఆల్రెడీ కొంతమంది ఆగ్రహానికి కారణమైంది సోనియా. ఇప్పుడు మరోసారి చీప్ గా రెచ్చగొడుతుంది అనేసి కామెంట్స్ చేసి విష్ణు ప్రియ ఫ్యాన్స్ కు టార్గెట్ అవుతోంది.
Read Also: అమ్మో బేబక్క వాచ్ ధర అన్నీ కోట్లా!? ఏ ప్లానెట్ నుంచి తెచ్చిన మెటలో తెలిస్తే ఫ్యూజులు ఔట్
సోనియా గేమ్ స్ట్రాటజీ రివీల్
బిగ్ బాస్ హౌస్ లో తనను తానే ఆడపులిగా ప్రకటించుకున్న సోనియా తాజాగా తన గేమ్ స్ట్రాటజీ గురించి నోరు జారింది. హౌస్ లో తాను స్ట్రాంగ్ గా ఉంటారు అనుకున్న వారితోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అనేసింది పృథ్వీ దగ్గర నిఖిల్ గురించి మాట్లాడుతూ. అంతేకాకుండా ఈ హౌస్ లో ఎవరినైనా చూసి నేర్చుకోవచ్చు అనేలా ఒక్కరైనా ఉన్నారా అంటూ పృథ్వీని ప్రశ్నించింది. అక్కడితో ఆగకుండా "నేను ఫాలో అవ్వాలంటే అందరిలో అట్లీస్ట్ 80% ఎక్కువగా ఎవరైతే ఉంటారో ఆ పర్సనాలిటీనే బిగ్ బాస్ విన్నర్, నాకు తెలిసి నేనే అనిపిస్తోంది" అని చెప్పేసింది. వెంటనే "పృథ్వీ నాకు కూడా నేనే అనిపిస్తుంది" అని చెప్పడంతో ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు. అయితే "కొంచెం విన్ అవ్వడానికి దగ్గరగా ఉన్నారు అన్న వాళ్లతోనే నేను ఫ్రెండ్స్ లా ఉన్నాను" అని చెప్పేసింది. దీంతో అసలు సోనియా అసలు గేమ్ ప్లాన్ ఏంటో బయటపడింది. హౌస్ లో సోనియా ఒక్క అమ్మాయితో కూడా ఎక్కువగా క్లోజ్ గా ఉండట్లేదు. అలాగే పృథ్వీ, నిఖిల్, అభయ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తోంది. పైగా ముందు స్ట్రాంగ్ అనుకున్నా నిఖిల్ ఇప్పుడు డల్ అవ్వడానికి ఆమె ఎంతో కొంత కారణమైంది. ఇలా స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్ ని వీక్ చేస్తూ తను టాప్ లో నిలవాలి అనుకుంటుంది. ఒకవేళ ఇది వర్కౌట్ కాకపోయినా అమ్మాయిలందరూ ఎలిమినేట్ అయ్యి, తను మాత్రమే హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మధ్య టాప్ లిస్ట్ లో ఒక అమ్మాయిగా మిగిలిపోతే, అక్కడిదాకా వెళ్లిన ఒకే ఒక్క అమ్మాయి కాబట్టి ప్రేక్షకుల ఓట్లతో ఎలాగైనా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ గా నిలవాలని కలలు కంటునట్టుగా కనిపిస్తోంది. మరి ఆమె స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వెయిట్ అండ్ సీ.
Read Also: నా లవ్ బ్రేకప్ కు కారణం ఆవిడే... బిగ్ బాస్ యాష్మీ గౌడ షాకింగ్ కామెంట్స్