Telugu Bigg Boss 7: బిగ్ బాస్ రియాలిటీ షోలో మామూలుగా లగ్జరీ ఐటెమ్స్‌ను సొంతం చేసుకోవాలంటే కంటెస్టెంట్స్ అంతా లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఆడవలసి ఉంటుంది. కానీ సీజన్ 7లో లగ్జరీ బడ్జెట్ అంతా చాలా ఈజీగా కంటెస్టెంట్స్ చేతికి వచ్చింది. ఇక ఫినాలే వీక్ కావడంతో లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా హౌజ్‌లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్‌కు స్వీట్స్ వచ్చాయి. ఆ స్వీట్స్‌ను, లగ్జరీ బడ్జెట్‌ను అందరికీ సమానంగా పంచే బాధ్యతను ప్రియాంకకు ఇచ్చారు నాగార్జున. కానీ హౌజ్‌మేట్స్ మాత్రం అదంతా పట్టించుకోకుండా తనకు చెప్పకుండానే పూతరేకులను ఓపెన్ చేసి తిన్నారు. అర్జున్, అమర్‌దీప్, శివాజీ తిన్న తర్వాత మిగిలిన స్వీట్స్‌ను తీసుకెళ్లి దాచిపెట్టుకున్నాడు అమర్. అదే విషయాన్ని ప్రశాంత్‌తో చెప్తూ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అవ్వడం అనేది తనకు ముఖ్యమా కాదా అనే విషయాన్ని బయటపెట్టాడు శివాజీ.
హౌజ్‌లో ఫుడ్ దొంగతనం..
‘‘ఈ హౌజ్‌లో ఎంత ఫుడ్ దొంగతనం చేశారు వాళ్లు. నిన్న వచ్చిన దాంట్లో కూడా అది తీసుకొని లోపల పెట్టుకున్నాడు వాడు’’ అని అమర్‌దీప్ చేసిన పని గురించి పల్లవి ప్రశాంత్‌తో చెప్పుకొచ్చాడు శివాజీ. ‘‘అందరికీ ఇవ్వమని సార్ చెప్పాడు’’ అని ప్రశాంత్ గుర్తుచేశాడు. ‘‘అందరు తీసుకోండి అని చెప్తే.. పూతరేకులు అయిపోయాయి అని చెప్పాడు వాడు’’ అని అన్నాడు శివాజీ. ఇక హౌజ్‌మేట్స్ అందరి కోసం కాఫీ పౌడర్ పంపిస్తే.. శివాజీకి మాత్రమే సీక్రెట్‌గా తీసుకెళ్లి ఇచ్చాడు ప్రశాంత్. ఆ విషయంపై నాగార్జున చేత తిట్లు కూడా తిన్నాడు. అయితే తను రిక్వెస్ట్ చేయడం వల్లే కాఫీ పౌడర్ వచ్చింది అనుకున్నానని, అందుకే తీసుకొచ్చి తనకే ఇచ్చానని క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్. అలా కాసేపు బిగ్ బాస్ హౌజ్‌లోని ఫుడ్ గురించి మాట్లాడిన తర్వాత అసలు తను ఈ రియాలిటీ షోలోకి ఎందుకు వచ్చాడో బయటపెట్టాడు శివాజీ.
డబ్బు శాశ్వతం కాదు..
‘‘నేను కప్ కోసం రాలేదు. డబ్బుల కోసం రాలేదు. నేను జనం మనసులు గెలుచుకోవాలని వచ్చాను. అంతే. దానికోసం నాటకాలు ఆడలేను. డబ్బుల కోసం కూడా ఆడలేను. ఇంత డబ్బు వస్తుంది అంటే అది శాశ్వతంగా మన దగ్గర ఉండిపోదు. కోట్లు చూశాను నేను. పోయింది. మళ్లీ వచ్చింది. దాని అర్థమేంటి? డబ్బు మన దగ్గర శాశ్వతంగా ఉండదు. మన క్యారెక్టరే మనతో ఉంటుంది’’ అని పల్లవి ప్రశాంత్‌కు గీతోపదేశం చేశాడు శివాజీ. ప్రశాంత్‌తో మాత్రమే కాదు.. ఆడియన్స్‌తో కూడా గెలుపు గురించి తాను ఆలోచించడం లేదని, జనాల హృదయాలు గెలవడానికి వచ్చానని, అది తాను చేశానని నమ్ముతున్నానని అన్నాడు.
ప్రపంచంలోనే గొప్ప షో..
బిగ్ బాస్ హౌజ్‌లో తన జర్నీ వీడియో చూసుకొని ఎమోషనల్ అయ్యాడు. తన 22 ఏళ్ల సినీ కెరీర్ అంతా ఒక ఎత్తు అయితే.. ఈ బిగ్ బాస్‌లో తను గడిపిన జీవితం మరొక ఎత్తు అని అన్నాడు. అంతే కాకుండా ప్రపంచంలో ఎక్కడా ఇంత గొప్ప షో లేదని ప్రశంసించాడు. తన ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసేలా చేసినందకు బిగ్ బాస్‌కు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ప్రస్తుతం ఓటింగ్ విషయంలో కూడా శివాజీ.. టాప్ 2 స్థానంలో ఉన్నాడు. తన శిష్యుడైన పల్లవి ప్రశాంత్ మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్య ఓటింగ్ శాతంలో పెద్దగా తేడా లేదని తెలుస్తోంది. అందుకే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరు అవుతారా అని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయ్యింది.
Also Read: భోలేను అన్నయ్య అనేసిన అశ్విని - పాపం ఎంత ఫీల్ అయ్యాడో!