Shobha Shetty: కొందరు నటీనటులు వారు చేసే పాత్రలతోనే ఎక్కువ ఫేమస్ అయిపోతారు. వారి రియల్ పేరుకంటే రీల్ పేరునే ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. అందుకే ‘కార్తీక దీపం’లో విలన్‌గా నటించిన శోభా శెట్టిని ప్రేక్షకులు ఇప్పటికీ మోనితగానే గుర్తుపెట్టుకున్నారు. ఆ పాత్ర తనకు ఎంతగానో గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ సీరియల్ ఎంత బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యిందో.. అందులో తన పాత్ర కూడా అదే రేంజ్‌లో హిట్ అయ్యింది. నెగిటివ్ రోల్‌లో కనిపించే లేడీ విలన్స్‌కు ల్యాండ్‌మార్క్‌గా మారిపోయింది మోనిత పాత్ర. ఇప్పుడు ఆ పాత్రకే అవార్డును అందుకుంది శోభా శెట్టి. నెగటివ్ రోల్ కేటగిరీలో పురస్కారం పొందింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.


నెగిటివ్ కామెంట్సే ఎక్కువ..
‘‘కార్తీక దీపంలో మోనితా పాత్రకు బెస్ట్ నెగిటివ్ రోల్‌గా రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా అదృష్టంగా ఫీలవుతున్నాను. ఈ సక్సెస్‌ఫుల్ జర్నీలో సపోర్ట్ చేసినందుకు చాలా థాంక్యూ. అందరికీ లవ్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి’’ అంటూ తన అవార్డ్‌తో పాటు దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది శోభా శెట్టి. ఈ పోస్ట్‌కు పాజిటివ్‌కంటే నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా వచ్చాయి. ఆఫ్ స్క్రీన్ కూడా నువ్వు మోనితనే అని, నీది ఎప్పుడూ నెగిటివ్ క్యారెక్టరే అని కొందరు హేటర్స్.. తన పోస్ట్‌కు కామెంట్స్ పెట్టారు. మరికొందరు మాత్రం లేడీ టైగర్, ఫైర్ బ్రాండ్ అని, తనకు ఈ అవార్డ్ రావడం సంతోషం ఉందని కామెంట్స్ చేశారు.






బిగ్ బాస్ వల్లే నెగిటివిటీ..
‘కారీక దీపం’ మోనితగా తన పాత్ర అయిపోయిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా ఎంటర్ అయ్యింది శోభా శెట్టి. ఈ షో వల్ల తనకు ఫ్యాన్స్‌కంటే హేటర్సే ఎక్కువయ్యారు. అనవసరంగా అందరితో గొడవలు పెట్టుకోవడం, పెద్దగా అరవడం.. ఇదంతా శోభా విషయంలో ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే నాలుగోవారం నుండే తను ఎప్పుడు ఎలిమినేట్ అయిపోతుందని చాలామంది ఎదురుచూడడం మొదలుపెట్టారు. కానీ మంచిగా ఆడే కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అయిపోయినా.. శోభా మాత్రం దాదాపు ఫైనల్స్ వరకు చేరుకుంది. అలాగే తనకు ట్రోఫీ కూడా ఇచ్చేస్తారేమో అంటూ నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.


టాప్ 7వ కంటెస్టెంట్..
ఇక బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్‌కు ఒకవారం ముందే శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింది. అంటే ఆ సీజన్‌లో తను టాప్ 7వ కంటెస్టెంట్‌గా నిలిచింది. ఇక తను బయటికి వచ్చిన తర్వాత కూడా హేటర్స్ తనను వదలలేదు. తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. కానీ అవన్నీ శోభా పట్టించుకోలేదు. వారానికి రూ.2.5 లక్షలు ఒప్పందంతో బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయ్యిందట శోభా. తను మొత్తంగా 14 వారాలు హౌజ్‌లో ఉంది కాబట్టి రూ.35 లక్షల రెమ్యునరేషన్‌తో తను ఇంటికి వెళ్లింది. అయితే కనీసం 10 వారాలు ఉంటాననే అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత శోభా శెట్టి బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చిందని సమాచారం. అందుకే ఎంత నెగిటివిటీ వచ్చిన తనను బిగ్ బాస్ మేకర్స్ ఎలిమినేట్ చేయలేదు.


Also Read: హోస్ట్‌గా నాగార్జున ఫెయిల్, అదంతా స్క్రిప్టెడ్ - ‘బిగ్ బాస్’ మాజీ కంటెస్టెంట్ గీతూ షాకింగ్ కామెంట్స్