Telugu Bigg Boss 7: ఓటు అప్పీల్ కోసం జరుగుతున్న ఫన్నీ టాస్కుల మధ్య కంటెస్టెంట్స్‌కు మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అదే ‘వండర్ ఉమెన్’. ఈ టాస్కు కోసం కంటెస్టెంట్స్ అంతా రెండు టీమ్స్‌గా విడిపోయారు. శివాజీ, ప్రశాంత్, ప్రియాంక ఒక టీమ్ అవ్వగా.. యావర్, అర్జున్, శోభా మరొక టీమ్‌గా ఉన్నారు. సంచాలకుడిగా అమర్‌దీప్ వ్యవహరించాడు. ఈ టాస్కులో టీమ్‌మేట్స్ కలిసి.. తమ టీమ్‌లో ఉన్న అమ్మాయిలను వండర్ ఉమెన్‌గా రెడీ చేయాలి. ఎవరైతే బాగా రెడీ చేస్తారో వారే ఈ టాస్కులో విన్నర్. అయితే ఈ టాస్క్ వల్ల, శోభా వల్ల తనకు 7 వండర్స్ కనిపించాయని అమర్ అన్నాడు. అలా అనడం వెనుక పెద్ద కథే ఉంది..


పిచ్చి అనొద్దు..
శోభా, ప్రియాంక.. ఇద్దరూ వండర్ ఉమెన్‌గా రెడీ అయ్యారు. ఇక వీరిద్దరిలో ఎవరు విన్నర్ అని అమర్‌దీప్ ప్రకటించే సమయం వచ్చేసింది. అయితే ఇద్దరూ బాగానే ఉన్నారని చెప్పిన అమర్.. శోభా ఒక వండర్ ఉమెన్‌లాగా ఉందని, ప్రియాంక ఒక కామిక్ హీరోయిన్‌లాగా ఉందని అన్నాడు. ప్రియాంక అండ్ టీమ్.. ఎక్కువ ప్రాపర్టీలను ఉపయోగించారు కాబట్టి వాళ్లే విన్నర్స్ అని ప్రకటించాడు. అమర్ అలా ప్రకటించిన వెంటనే ‘‘ఈ విషయం తనకు ముందే తెలుసు’’ అని అర్జున్ దగ్గరకు వెళ్లి స్టేట్‌మెంట్ ఇచ్చింది శోభా. ‘‘అదేంటి అలా అంటావు’’ అని అమర్ అడిగాడు. తెలుసు కాబట్టే తెలుసు అన్నానని శోభా మళ్లీ అదే సమాధానమిచ్చింది. ‘‘ఫన్ టాస్క్‌ను ఫన్ టాస్కులాగా తీసుకోవచ్చు కదా పిచ్చిదానిలాగా మాట్లాడతావు’’ అని అమర్ సరదాగా అన్నాడు. ఆ మాట నచ్చని శోభా.. ‘‘పిచ్చి అనొద్దు’’ అంటూ సీరియస్ అయ్యింది. దీంతో అమర్‌కు కూడా కోపం వచ్చింది.


పక్కనోళ్లని చూసి నేర్చుకోవాలి..
అమర్ మాటలు వినకుండా శోభా కోపంగా వెళ్లిపోతుంటే.. మనం అంతా ఒకటే అని తనకు గుర్తుచేశాడు అమర్. తన మాటలు వినకుండా.. వదిలేసేయ్ అని శోభా అరుస్తూనే ఉంది. అయినా అమర్ నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. మన మధ్య మనకే యూనిటీ లేకపోతే ఎలా అని వాపోయాడు. పక్కనోళ్లని చూసి నేర్చుకోవాలి అని సలహా ఇచ్చాడు. ఇది చాలా చిన్న విషయమని, అదొక ఫన్ టాస్క్ అని మరోసారి గుర్తుచేశాడు. అయితే ప్రియాంక హ్యాంపర్ గెలుచుకుంది కాబట్టే శోభా ఇలా చేస్తుందని.. ఆ హ్యాంపర్ తెచ్చి దాని మొహాన పడేయండి పూసుకుంటుంది అని కోపంగా అన్నాడు అమర్. దానికి శోభాకు మరింత కోపం వచ్చింది. దీంతో అసలు తనను సంచాలకుడిగా ఎందుకు ఉండమన్నారని బిగ్ బాస్‌తో చెప్తూ బాధపడ్డాడు అమర్. అసలు ఈ వండర్ ఉమెన్ టాస్క్ ఏంటో కానీ.. దీని వల్ల తనకు 7 వండర్స్ కనిపిస్తున్నాయని అన్నాడు.


ఓటు అప్పీల్ పోయిందని బాధ..
శోభాతో జరుగుతున్న గొడవ గురించి ప్రియాంకతో చెప్తూ ఫీల్ అయ్యాడు అమర్. ‘‘నువ్వు ప్రాపర్టీలు ఎక్కువ ఉపయోగించావని బాగుందని అన్నాను. ఇంత చిన్న విషయానికి అంత గొడవ అవసరమా’’ అని వాపోయాడు. దానికి ప్రియాంక కూడా ఏమీ మాట్లాడలేక ఈ విషయాన్ని వదిలేసేయమని చెప్పింది. ఈ గొడవ వల్ల అందరూ తనను చూసి నవ్వుతున్నారని అర్జున్‌తో చెప్పుకున్నాడు అమర్. తనకు కొంచెం నోటిదూల ఎక్కువే అని ఒప్పుకున్నాడు. కానీ ప్రతీసారి తనదే తప్పంటే ఎలా అని ధీనంగా అడిగాడు. ఓటు అప్పీల్ పోయి తాను బాధపడుతుంటే అది పట్టించుకోకుండా ఈ చిన్న ఫన్ టాస్క్ కోసం శోభా తనతో గొడవపడుతుంది అని అమర్ తెగ ఫీల్ అయిపోయాడు. ప్రియాంక, అమర్.. తన ఫ్రెండ్స్ అయినా కూడా వారు ఎప్పుడు గెలిచినా శోభా అసలు సంతోషంగా ఉండదని, తన మనసులో చాలా కుట్ర ఉందని ఇది చూసిన ప్రేక్షకులు అనుకుంటున్నారు.


Also Read: అంకుల్ మీకు ఇంత వయసొచ్చింది, ఇదేనా మీ అనుభవం - సీనియర్ జర్నలిస్టుపై రేణు దేశాయ్ ఆగ్రహం