Bigg Boss Telugu Season 7: బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu Season 7) రెండవ వారం పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే హౌస్ నుంచి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. ఇక రెండవ వారం కూడా పూర్తి కావడంతో ఈ వారంలో 9 మంది నామినేషన్స్ లో ఉండగా నామినేషన్స్ నుంచి ఒకరు ఈరోజు ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. అయితే ఇందులో పవర్ అస్త్ర సహాయంతో శివాజీ సేఫ్ అయ్యారు.


ఇలా తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ లో ఉండగా శివాజీ సేఫ్ అయ్యారు. మిగిలిన 8 మందిలో ఓట్ల పరంగా చూసుకుంటే ఆఖరి స్థానంలో షకీలా ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఈమె బిగ్ బాస్ హౌస్ నుంచి ఈరోజు బయటకు వెళ్లనున్నట్లు సమాచారం. బిగ్ బాస్ హౌస్ లో షకీలా వివాదాలకు దూరంగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. బహుశా  అదే ఆమెకు ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది. హౌస్‌లో ఎవరైనా గొడవపడినా.. పెద్దదాని లాగా వ్యవహరిస్తూ ఆ గొడవను సర్దుమనిగేలాగా చేస్తున్నారు. ఈ విధంగా బిగ్ బాస్ షోలో షకీలా మంచిగా వ్యవహరిస్తున్నారని హోస్ట్ నాగార్జున కూడా కితాబ్ ఇచ్చారు.


Also Read: Bigg Boss Telugu Season 7: గౌతమ్‌ చొక్కా విప్పించిన నాగార్జున - మనుషులతో ఆడొద్దంటూ రతికాకు వార్నింగ్


అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో ఇలా ఉంటే సరిపోదు ప్రేక్షకులకు తగ్గట్టు ఎంటర్టైన్మెంట్ అందించాలి టాస్కుల విషయంలో గట్టి పోటీ ఇవ్వాలి. కానీ అవి షకీలా నుంచి రాకపోవడంతో ప్రేక్షకులు మద్దతు ఈమెకు తెలుపలేదని తెలుస్తుంది తద్వారా ఓటింగ్ విషయంలో చివరి స్థానంలో ఉన్నటువంటి షకీలా నేడు బిగ్ బాస్ నుంచి బయటకు రాబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ వారం రెండు ఎలిమినేషన్లు ఉంటాయి అంటూ కూడా వార్తలు వస్తున్నాయి షకీలాతో పాటు శోభాశెట్టి కూడా బయటకు రాబోతున్నారని వార్తలు వచ్చినప్పటికీ.. షకీలా మాత్రమే బయటకు వస్తుందని, శోభా శెట్టిని సీక్రెట్ రూమ్ లో ఉంచేలాగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. వాస్తవానికి ప్రిన్స్ వారియర్ బయటకు వెళ్తాడని అంతా భావించారు. కానీ, షకీలా బయటకు వెళ్తోంది. టాస్క్‌లో ప్రిన్స్ కష్టపడటం, తనకు అన్యాయం జరిగిందంటూ చేసిన రచ్చ.. ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.


ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమం నుంచి నేడు షకీలా ఎలిమినేట్ కాగా.. పల్లవి ప్రశాంత్ అత్యధిక ఓట్లు దక్కించుకొని మొదటి స్థానంలో ఉండడం విశేషం. ఇక ఈ వారం పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ మధ్య ఎలాంటి గొడవ జరిగిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈసారి పల్లవి ప్రశాంత్ ఎలిమినేట్ అవుతారని కూడా వార్తలు వచ్చాయి కానీ ఎంతో మంది రైతుబిడ్డకు సపోర్ట్ గా నిలిచి ఓటింగ్ విషయంలో ఆయనకు ఫస్ట్ పొజిషన్ ఇవ్వడం విశేషం. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి షకీలా ఎలిమినేట్ కాగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరికొంతమంది కంటెస్టెంట్లు కూడా హౌస్ లోకి రాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ కంటెస్టెంట్లు ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది.


Also Read: Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ 7లోకి కొత్త ముఖాలు - వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సిద్ధమైపోతున్న ఆ ఇద్దరు ఎవరో తెలుసా?


Join Us On Telegram: https://t.me/abpdesamofficial