బిగ్ బాస్ సీజన్ 7లో ముందుగా కంటెస్టెంట్స్ అంతా పవర్ అస్త్రాలను సాధించుకోవడం కోసం పోటీపడ్డారు. అలా నలుగురు పవర్ అస్త్రాలను సాధించిన తర్వాత దానికి సంబంధించిన టాస్కులకు ఎండ్ కార్డ్ పడింది. అది అయిపోగానే వెంటనే కెప్టెన్సీ టాస్కులు మొదలయ్యాయి. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి కెప్టెన్‌గా పల్లవి ప్రశాంత్ గెలిచాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌కు రెండో కెప్టెన్ ఎవరో తెలుసుకునే టైమ్ వచ్చేసింది. రెండో కెప్టెన్ ఎవరు అనే విషయాన్ని కంటెస్టెంట్సే తేల్చుకోవాలి అని బిగ్ బాస్ ఆదేశించారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


ఎనిమిది మంది కెప్టెన్సీ కంటెండర్లు..
ఈసారి కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ హౌజ్‌లోకి కొత్తగా ఎంటర్ అయిన అయిదుగురు కంటెస్టెంట్స్ కూడా పోటీపడ్డారు. పాత కంటెస్టెంట్స్ అంతా ఒక టీమ్, కొత్త కంటెస్టెంట్స్ అంతా ఒక టీమ్‌గా విడిపోయి మరీ కెప్టెన్సీ కోసం టాస్కుల్లో పోటాపోటీగా ఆడారు. అయితే ఈ రెండు టీమ్స్ మధ్య ఏడు టాస్కులు జరగగా.. అందులో ఎక్కువ టాస్కులు ఆటగాళ్లే గెలిచారు. దీంతో ఆటగాళ్లు టీమ్‌లో అమర్‌దీప్, శోభా శెట్టి, తేజ, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, సందీప్, ప్రిన్స్ యావర్, శివాజీ.. కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. ఆ తర్వాత వీరిలో కెప్టెన్ ఎవరు అవ్వాలి అనే నిర్ణయాన్ని వారికే వదిలేశారు.


అవకాశం కోల్పోయిన ప్రియాంక..
కెప్టెన్సీ కంటెండర్లు అయిన ఎనిమిది మంది బెలూన్లు కట్టుకొని నిలబడాలి. తాము ఎవరైతే కెప్టెన్ అవ్వకూడదని అనుకుంటున్నారో వారి బెలూన్‌ను పగలగొట్టాలి. ఈ టాస్క్‌లో కెప్టెన్ ఎవరు అవ్వాలని అనుకుంటున్నారో నిర్ణయించుకునే అవకాశం పోటుగాళ్లకు కూడా లభిస్తున్నట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రోమోలో ముందుగా సందీప్.. శివాజీ బెలూన్‌ను పగలగొట్టాడు. ఆట తక్కువ అనిపించింది అని చెప్తూ ప్రియాంకను కెప్టెన్సీ రేసు నుండి తప్పించాడు పల్లవి ప్రశాంత్. ఆట అంటే గేమ్స్ ఆడడం మాత్రమే కాదు అని ప్రియాంక వాదించినా లాభం లేకుండా పోయింది. ఆ తర్వాత మళ్లీ సందీప్‌కే కెప్టెన్సీ రేసు నుండి ఒక కంటెస్టెంట్‌ను తప్పించే అవకాశం వచ్చింది.


6 వారాలుగా ఇమ్యూనిటీ..
రెండోసారి అవకాశం వచ్చినప్పుడు సందీప్.. పల్లవి ప్రశాంత్ బెలూన్‌ను పగలగొట్టాడు. దానికి తన కారణాన్ని చెప్పడానికి ట్రై చేశాడు కానీ ప్రశాంత్ మాత్రం వినిపించుకోకుండా తన బెలూన్‌ను పక్కన పడేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత శోభా శెట్టి వచ్చి సందీప్ బెలూన్‌ను పగలగొట్టింది. ‘‘6 వారాల నుండి మీకు ఇమ్యూనిటీ అనేది బాగానే కలిసొస్తుంది. ఇది మాత్రమే నా కారణం. అంతకు మించి ఏమీ లేదు’’ అని కారణం చెప్పింది శోభా. శోభా తర్వాత వచ్చిన ప్రిన్స్ యావర్.. శోభా బెలూన్‌నే పగలగొట్టాడు. తను వీక్ అంటూ యావర్ చెప్పిన కారణానికి శోభా.. వ్యంగ్యంగా చప్పట్లు కొట్టుకుంటూ వెళ్లి పక్కన కూర్చుంది.


అది నీ సేఫ్ గేమ్..
అలా ఆటగాళ్లు టీమ్ నుండి ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోయిన తర్వాత కెప్టెన్సీ పోటీదారులుగా టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్ మిగిలారు. ఆ తర్వాత బెలూన్ పగలగొట్టే అవకాశాన్ని తేజకు ఇచ్చాడు అర్జున్ అంబటి. ‘‘ఇప్పటివరకు జరిగినవన్నీ దృష్టిలో పెట్టుకొని, నువ్వు కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటావో లేక జనాల దృష్టిలో హీరో అవ్వడానికి నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం’’ అని పిన్‌ను తేజకు అందించాడు అర్జున్. తేజ ఆ పిన్‌ను తీసుకొని అమర్‌దీప్ బెలూన్ పగలగొట్టి తనను కెప్టెన్సీ రేసు నుండి బయటికి పంపించేశాడు. తేజ తీసుకున్న నిర్ణయానికి ‘‘అది నీ సేఫ్ గేమ్’’ అంటూ అరిచింది శోభా. ఆపై కన్నీళ్లు పెట్టుకుంది. ఫైనల్‌గా తేజ, యావర్ కెప్టెన్సీ రేసులో చివరి వరకు మిగిలారు. ఇందులో యావర్ కెప్టెన్ అయినట్టు సమాచారం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


Also Read: నేను నమ్మిందే తీస్తా, దానికి ఎవరి పర్మిషన్ అవరసం లేదు - ‘ప్యాకేజి’ డైరెక్టర్ బిరుదుపై వర్మ రియాక్షన్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial