Bigg Boss 6 Telugu: ప్రస్తుతం ఇంట్లో కెప్టెన్సీ టాస్కు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచిన ఇనాయ, ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, శ్రీహాన్ పోటీ పడ్డారు. పెద్ద బాల్ ఎవరి పేరున్న స్టాండుల మధ్య నుంచి బయటికి వెళుతుందో వారు అవుట్. ఈ క్రమంలో మొదట రోహిత్ ఎలిమినేట్ అయిపోయాడు. తరువత బిగ్ బాస్ మిగతా పోటీదారులను ఏకాభిప్రాయంతో ఒకరిని పోటీ నుంచి తొలగించమని చెప్పారు. దానికి ఆదిరెడ్డి రేవంత్ పేరు చెప్పాడు. రేవంత్ ఆదిరెడ్డి పేరు చెప్పాడు. ఇక ఇనాయ,శ్రీహాన్ కూడా ఆదిరెడ్డి పేరే చెప్పినట్టు అర్థమవుతోంది. ఎందుకంటే ఆయనే గేమ్ లో కనిపించలేదు. 


ఇనాయ అవుట్...
ఎప్పట్నించో ఇంటి కెప్టెన్ అవుదామనుకుంటున్న ఇనాయకు మళ్లీ చేదు అనుభవమే ఎదురైంది. రేవంత్ ఆమెను టార్గెట్ చేసి పెద్ద బంతిని ఆమె రెండు స్టాండుల నుంచి బయటికి తోసేశాడు. అతడిని అడ్డుకోవడానికి ఇనాయ చాలా ప్రయత్నించింది. కానీ వీలవ్వలేదు. ఇదంతా జరుగుతున్నప్పుడు శ్రీహాన్ చూస్తూ కూర్చున్నాడు. ఇనాయ అవుట్ అవ్వడంతో ఆమె ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఆదిరెడ్డి మాత్రం నువ్వు అంత సేపు ఆపడమే గ్రేట్ అనుకోవాలి అని చెప్పాడు. 


ఫైమా - ఆదిరెడ్డి
ఈ మధ్యలో రేవంత్‌తో ఆదిరెడ్డి, ఫైమా గొడవ పడుతూనే ఉన్నారు. ఫైమా ‘ఎందుకంత ఎమోషన్ అయిపోతావ్, ముందు గేమ్ ఆడన్నా నువ్వు’ అంది. దానికి రేవంత్ ‘పక్క వాళ్లు సపోర్ట్ చేస్తే కానీ గేమ్ ఆడలేవు నువ్వు నాకు చెబుతావా’ అన్నాడు. దానికి ఆదిరెడ్డి ‘మాట్లాడేటప్పుడు బ్రెయిన్ దగ్గర పెట్టుకుని మాట్లాడబ్బా, నాతో కలిసి ఆడతా అన్నావ్ కదా, ఇప్పుడు శ్రీహాన్‌తో కలిసి ఆడుతున్నావ్’ అని కౌంటర్ ఇచ్చాడు. 






ఎన్ని గొడవలు అయినా చివరికి రేవంతే ఇంటి కెప్టెన్ అయినట్టు సమాచారం. ఈ సీజన్లో రెండో సారి ఇంటి కెప్టెన్ అయిన వ్యక్తి రేవంత్. టైటిల్ ఫేవరేట్‌గా కూడా ఆయనే ఉన్నారు. 



ఇక ఈ వారం నామినేషన్లలో ఉన్న సభ్యులు ఎవరంటే..
1. రోహిత్
2. ఇనాయ
3. శ్రీహాన్
4. ఆదిరెడ్డి
5. రాజ్
6. రేవంత్
7. మెరీనా
8. శ్రీసత్య
9. కీర్తి


గత ఆదివారం బిగ్ బాస్ గ్లామర్ క్వీన్ వాసంతి ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం ఎవరు అవుతారో అన్నదానిపై ఇంకా అంచనాలు వేయలేక పోతున్నాం. మెరీనా వెళ్లిపోయే ఛాన్సు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతవరకు మెరీనా ఆట కన్నా చక్కటి ప్రవర్తన, మాటతీరుతో వచ్చింది. ఇకపైనా బిగ్ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.



Also read: కీర్తి చెప్పిన సామెతలో తామే కుక్కలమని ఫీలైపోతున్నా శ్రీసత్య, శ్రీహాన్ - వీరికి సామెతలు కూడా అర్థం కావన్నమాట