'బిగ్ బాస్' అగ్నిపరీక్ష మంటలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. 'బిగ్ బాస్ 9' తెలుగు ప్రారంభం కాక ముందే కాంట్రవర్సీలు తలెత్తుతున్నాయి. సామాన్య ప్రేక్షకుల నుంచి కొంత మందిని ఈ సారి బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. కామన్ మ్యాన్స్ అంటే బీబీ టీంకి అర్థం వేరేలా తెలిసి ఉంటుంది. ఇన్ స్టాలో ఇన్ ఫ్లూయెన్సర్లు, లక్షలకు లక్షల ఫాలోవర్లు ఉన్న వాళ్లంతా కూడా బీబీ టీంకి కామనర్స్ అని అర్థమై ఉంటుంది. వచ్చిన వేల, లక్షల అప్లికేషన్స్ నుంచి నలభై మందిని అగ్ని పరీక్ష కోసం తీసుకున్న సంగతి తెలిసిందే.
నవదీప్, అభిజిత్, బిందు మాధవి న్యాయ నిర్ణేతలుగా ఈ 40 మంది అగ్ని పరీక్షను ఎదుర్కొంటారు. ఇక ఈ క్రమంలో ట్రాన్స్ మహిళ అంకిత నాయుడు చివరి వరకు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చినట్టుగా తెలుస్తోంది. తన కమ్యూనిటీ వాళ్లే తనను మోసం చేసిన, తనను బ్యాడ్‌గా ప్రొజెక్ట్ చేశారని వాపోయింది. ఈ క్రమంలో ఆమెకు బాసటగా బిగ్ బాస్ ప్రియాంక సింగ్ నిలిచింది. అంకిత షేర్ చేసిన వీడియో కింద ప్రియాంక సింగ్ పెద్ద కామెంట్ చేసింది.
''హలో అంకిత... నాకు తెలుసు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో! నువ్వు ఏమీ బాధపడకు. ఇవన్నీ గుణ పాఠాలుగా తీసుకో... ఇంకా నేర్చుకో! ముందుకు వెళ్లు... ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడడు? అన్నీ తెలుసుకో. నువ్వు ఎంతో టాలెంటెడ్. నువ్వు నీ యూట్యూబ్, ఇన్ స్టా జర్నీని సొంతంగా స్టార్ట్ చేసి ఏ స్థాయికి వచ్చావో అందరికీ తెలుసు, అదే ఎందరికో స్పూర్తి. ట్రాన్స్ కమ్యూనిటీలో నువ్వే అందరికీ స్పూర్తి... నాతో సహా'' అని ప్రియాంక సింగ్ పేర్కొంది. 'జబర్దస్త్' షో ద్వారా పాపులారిటీ వచ్చిన తర్వాత ఆపరేషన్ ద్వారా జెండర్ చేంజ్ చేసుకుని, ప్రియాంక సింగ్ కింద పేరు మార్చుకుని కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: ట్రాన్స్ మహిళ అంకితకు కమ్యూనిటీ వెన్నుపోటు... బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి వెనక్కి!
అంకితా నాయుడు గురించి ప్రియాంక సింగ్ మాట్లాడుతూ... ''అందంగా ఉంటావ్... ఎంతో టాలెంట్ ఉంది. ఎంతో మంచిదానివి. నిన్ను ఇందులో ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. బాధపడకు నానా...! నువ్వు ఆల్రెడీ మా అందరి హృదయాల్ని గెలిచావ్. ఈ ఇండస్ట్రీలో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదుగుతావ్. నీకు సక్సెస్ వచ్చిన రోజున అదే మాట్లాడుతుంది. నీకు అన్నీ విజయాలే చేకూరాలని కోరుకుంటున్నాను'' అని కామెంట్ చేసింది.
Also Read: 'బిగ్ బాస్ 9' హౌస్‌కు డివోషనల్ టచ్... థీమ్, కాన్సెప్ట్ తెలుసా?