Telugu Bigg Boss 7: బిగ్ బాస్ రియాలిటీ షోలో జరిగే గొడవలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా ఫ్రెండ్స్ మధ్య జరిగే గొడవలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా అలాంటి గొడవే ఒకటి ‘స్పా’ బ్యాచ్‌లో జరిగింది. సరదాగా మొదలయిన ఈ గొడవ.. సీరియస్ మలుపు తీసుకుంది. ఈ గొడవలో ప్రియాంక, శోభా ఒకవైపు.. అమర్‌దీప్ ఒకవైపు ఉన్నారు. అప్పటివరకు సరదాగా మాట్లాడుకున్న ముగ్గురు.. ఒక్కసారిగా అరుచుకున్నట్టుగా ప్రోమోలో చూపించారు. అక్కడే ఉన్న అర్జున్ మాత్రం ఈ ముగ్గురు ఇదంతా టైమ్‌పాస్ కోసం చేస్తున్నారని అనుకున్నాడు.


అమర్‌దీప్ వర్సెస్ ప్రియాంక, శోభా..
ముందుగా అమర్‌దీప్, ప్రియాంక, అర్జున్ మాట్లాడుతుండగా.. తన టెడ్డీని తీసుకొని అక్కడికి వచ్చింది శోభా. అమర్ అంకుల్ అంటూ ఆటపట్టించడం మొదలుపెట్టింది. మూడ్ బాలేని అమర్.. శోభాను అవతలికి పో అంటూ కాలితో తన్నాడు. వాస్తవానికి అమర్.. శోభా చేతిలో ఉన్న బొమ్మను తన్నాలనుకున్నాడు. కానీ, శోభాకు అది నచ్చలేదు. ‘‘ఓవరాక్షన్ ఎక్కువ చేస్తున్నావు. కాలితో తన్నావనుకో..’’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. శోభా ఇలా చెప్తుండగానే.. అమర్‌ను దిండుతో కొట్టడం మొదలుపెట్టింది ప్రియాంక. ముక్కు మీద కొట్టు అంటూ సలహాలు ఇచ్చింది. దానికి అమర్‌కు కోపం వచ్చి టెడ్డీని తీసుకొని దూరంగా విసిరేశాడు. ‘‘ముక్కు మీద కొడతారు ఏంటి పిచ్చా ఏమైనా’’ అని సీరియస్‌గా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. ఈ ప్రవర్తన ప్రియాంక, శోభాలకు నచ్చలేదు. ‘‘వాళ్లు చేస్తే ఓకే.. మనం చేస్తే ఓకే కాదు..’’ అంటూ ప్రియాంక కూడా సీరియస్ అయ్యింది. ఆ తర్వాత అమర్ తిరిగొచ్చినా.. ప్రియాంక, శోభాలకు నచ్చక అక్కడ నుంచి లేచి వెళ్లిపోయారు.


బొమ్మలకు ఉన్న విలువ మనుషులకు లేదు..
ప్రియాంక, శోభా లేచి వెళ్లిపోవడం చూసిన అమర్.. ‘‘వాళ్లకు అంత ఉన్నప్పుడు మనం ఏం చేయలేములే’’ అని అర్జున్‌తో అన్నాడు. ఆ మాట ప్రియాంక విని.. ‘‘నీకు అంత ఉన్నప్పుడు’’ అని ఏదో చెప్పబోయి సైలెంట్ అయిపోయింది. దానికి అమర్ సీరియస్ అయ్యి ‘‘నిన్ను ఏమన్నాను ఇప్పుడు’’ అని అరిచాడు. ‘‘ఏం చేసి వెళ్లావు నువ్వు?’’ అని కోపంగా అడిగింది ప్రియాంక. ‘‘విసిరింది బొమ్మనే.. మిమ్మల్ని కాదు’’ అని కౌంటర్ ఇచ్చాడు అమర్. ‘‘నువ్వు వెళ్లిపోతే ఓకే.. మేము వెళ్లిపోతే ఇలా మాట్లాడతావా’’ అని రివర్స్ అయ్యింది ప్రియాంక. ‘‘బొమ్మలకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోతుంది’’ అని అనవసరంగా టాపిక్‌ను లాగే ప్రయత్నం చేశాడు అమర్.


స్టేట్‌మెంట్స్ పాస్ చేయకు దరిద్రంగా ఉంటుంది..
గొడవను ముగించాలని అనుకున్న ప్రియాంక.. ‘‘సారీ అమర్ గారు’’ అని చెప్పింది. ‘‘ఈ వెటకారం మాటలే వద్దు. స్ట్రెయిట్‌గా చేయాల్సిన పనులు స్ట్రెయిట్‌గా చేయవు’’ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఫినాలే అస్త్రా పాయింట్స్ గురించి ప్రస్తావించాడు అమర్. అది విని ప్రియాంకకు కోపం వచ్చింది. ‘‘ఎందుకు గతవారం గురించి ఇప్పుడు తీసుకొచ్చి నాతో మాట్లాడుతున్నావు’’ అని అడిగింది. ‘‘అలాగే ఉంటుందిలే లోకువ అయిపోతే ఏం చేస్తాం. అంత అసహ్యించుకొని వెళ్లి కూర్చున్నారుగా’’ అంటూ గొడవను మరింత సీరియస్ చేశాడు అమర్. అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న శోభా కూడా మాట్లాడక తప్పలేదు. అనవసరంగా ఇద్దరితో గొడవపడుతున్నావు అన్నట్టుగా అడిగింది. ‘‘నువ్వు కొత్తవి తీసుకురాకు అనవసరంగా. స్టేట్‌మెంట్స్ పాస్ చేయకు దరిద్రంగా ఉంటుంది’’ అంటూ తన నోరు మూయించాడు అమర్. శోభాకు కోపం వచ్చి అంతా టెడ్డీ వల్లే మొదలయ్యిందని, తీసుకెళ్లి స్టోర్ రూమ్‌లో పడేస్తానని వెళ్లింది.


‘బిగ్ బాస్’ 4వ ప్రోమో: తాను బోటమ్‌లో లేనంటూ ప్రియాంక, అర్జున్‌తో వాదన


ఈ రోజు స్టార్ మా.. 4 బీబీ ప్రోమోలను వదిలింది. తాజాగా ప్రోమోలో శోభా, యావర్‌లలో ఒకరికి ఓటు అప్పీల్ చేసుకొనే ఛాన్స్ ఇస్తున్నట్లు వెల్లడించాడు. ఇందుకు ఇంటి సభ్యులు మద్దతు అవసరమని పేర్కొన్నాడు. దీంతో అమర్.. శోభా తనకు ఫ్రెండ్ కాబట్టి, ఆమెకే తన మద్దతు అని తెలిపాడు. ఆ తర్వాత అర్జున్ కూడా శోభాకు మద్దతు తెలిపాడు. తాను లోగా కనిపిస్తోందని అన్నాడు. అయితే, ఆ మాట తనకు నచ్చలేదని.. తనకు మద్దతు ఇచ్చిన అర్జున్‌తోనే వాదించింది. ఆ తర్వాత ప్రియాంక కూడా ఆమెకు మద్దతు తెలుపుతూ ఓటింగులో వెనుకబడ్డావు అన్నట్లుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే శోభా అందుకు అంగీకరించలేదు. నాగార్జున తనకు శనివారం క్లారిటీ ఇచ్చారని, తాను బోటమ్ 2లో లేనని పేర్కొంది. దీనిపై ప్రియాంకతో వాదించింది.



Also Read: 'బలగం' వేణుతో సినిమా? ఈ వార్తల్లో నిజమెంత?