Priyanka Jain about Her Father: బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్, సీరియల్ ఆర్టిస్ట్ ప్రియాంక జైన్.. తన పర్సనల్ లైఫ్‌లో జరిగే దాదాపు ప్రతీ విషయాన్ని యూట్యూబ్‌లో వీడియోల లాగా అప్లోడ్ చేసి తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎక్కువశాతం తన యూట్యూబ్ వీడియోలతోనే బిజీ అయిపోయింది ప్రియాంక. తన బాయ్‌ఫ్రెండ్ శివ్‌తో కలిసి తను వెళ్తున్న ట్రిప్స్ గురించి, వాళ్లు కలిసి చేసే అల్లరి గురించి ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంది. తాజాగా తన తండ్రి గురించి ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది.


నటిగా సీరియల్స్‌లో ప్రియాంక బిజీ అయినా.. తన తండ్రి మాత్రం ఇప్పటికీ చిన్న బిజినెస్‌తో ఫ్యామిలీని నడిపిస్తున్నారు. ప్రస్తుతం తన తల్లిదండ్రులు బెంగుళూరులో ఉంటున్నారని, తన యూట్యూబ్ ఛానెల్‌లో వారి ఇంటిని, షాప్‌ను చూపించింది. చాలా ఏళ్లుగా షూటింగ్స్‌లో బిజీ అవ్వడం వల్ల తన తండ్రి షాపే చూడలేదని వీడియోలో తెలిపింది. ఇక షాప్‌కు వెళ్తున్న దారిలో తను చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు కూడా చూపించింది. చివరిగా షాప్‌కు వెళ్లిన తర్వాత దాని గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యింది ప్రియాంక. తన తండ్రి ఏ స్థాయి నుంచి వచ్చారో తనకు తెలుసంటూ గుర్తుచేసుకుంది. ఆయన కష్టాలను అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.


అలా మోసపోయారు..


‘‘వీళ్లు ఏంటి? వీళ్లు బాగానే ఉంటారు అనుకుంటారు అందరు. కానీ మేము లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం. మా నాన్న చాలా కష్టపడ్డారు. ముందుగా ఆయన ముంబాయ్‌లో ఉండేవారు. అక్కడ ఒక ఫేమస్ కాంప్లెక్స్‌లో నాన్నకు రెండు షాప్స్ ఉండేవి. అంతా బాగానే ఉన్నప్పుడు ఒక వ్యక్తి మోసం చేసినందుకు ఇలా అయిపోయాం’’ అంటూ తన తండ్రి బిజినెస్ ఎందుకు ఇలా అయిపోయిందో చెప్పుకొచ్చింది ప్రియాంక. అసలు ఆయన ఎలా మోసపోయారో బయటపెట్టింది. ‘‘ముందుగా షాప్‌కు ఒక వ్యక్తి వచ్చి ఐటెమ్స్ కొనుగోలు చేసి తరువాత వచ్చినప్పుడు డబ్బులు ఇస్తానని చెప్పి వెళ్లిపోయేవాడు. తరువాత సారి వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేసి ఇంకొన్ని వస్తువులు తీసుకెళ్లేవాడు. అలా నాన్నతో ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్లు వచ్చిన ప్రతీసారి ముందు పేమెంట్ చేసేస్తున్నారని నాన్న వాళ్లపై నమ్మకం పెట్టుకున్నారు’’ అని గుర్తుచేసుకుంది ప్రియాంక.


మళ్లీ నడవలేవు అన్నారు..


‘‘నాన్న వల్లే చుట్టు పక్కన ఉన్న షాప్స్ వాళ్లు కూడా వాళ్లని నమ్మి అప్పులు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా ఆ మనిషి చాలా కోట్ల వరకు మోసపోయారు మా నాన్న. అదే సమయంలో అమ్మ ప్రెగ్నెంట్ అవ్వడం, అపెండిక్స్ ఆపరేషన్ అవ్వడం.. ఇలా అన్నీ ఒకేసారి జరిగాయి. అందుకే అప్పట్లో ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నారు. అన్ని చూసిన మనిషి.. ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు. ఒకరోజు మా నాన్నకు ట్రెయిన్ యాక్సిడెంట్ అయ్యింది. ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. తాగి పడిపోయాడని అనుకున్నారు. ఆయన కాలిపై నుంచి ట్రెయిన్ వెళ్లిపోయింది. డాక్టర్లు అయితే నడవలేవు అన్నారు. కానీ 6 నెలల్లో ఆయన మళ్లీ నడిచి చూపించారు. నాలో ఉన్న ధైర్యమంతా మా అమ్మ, నాన్న నుండే వచ్చిందని’’ చెప్పింది ప్రియాంక.


Also Read: మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన