బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Season 7)లో ‘స్పై’ బ్యాచ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్. ఇక ఈ బ్యాచ్ కోరుకున్నట్టుగానే వారిలో ఒకడైన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. కానీ ఆ గెలిచిన ఆనందం కొన్నిరోజులు కూడా ఉండకముందే పోలీసులు.. తనను అరెస్ట్ చేశారు. ఫైనల్స్ రోజు స్టూడియోస్ బయట జరిగిన గొడవకు తన ఫ్యాన్సే కారణమని పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదంతా జరిగిన రెండురోజులు అయినా.. ఇంకా శివాజీ, యావర్ స్పందించలేదని బిగ్ బాస్ ప్రేక్షకుల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో శివాజీ, యావర్ వేర్వేరుగా వీడియోలు విడుదల చేసి ప్రశాంత్‌కు మద్దతు పలికారు.


ప్లీజ్ సపోర్ట్ చేయండి


‘‘నేను ప్రశాంత్ అరెస్ట్ వీడియోను చూశాను. చాలా బాధగా అనిపించింది. అది చూసిన తర్వాత నేను చాలా షాక్ అయ్యాను. మీతో ఎలా మాట్లాడాలి అని నాకు అర్థం కాలేదు. అందుకే కొన్నిరోజులు నేను టైమ్ తీసుకున్నాను. ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ ప్రశాంత్‌కు సపోర్ట్ చేయండి. తను చాలా నిజాయితీ ఉన్న మనిషి. హౌజ్‌లో ఉన్నప్పుడు చూశాను. అదే ప్రశాంత్ మనస్థత్వం. అందుకే తనతో నాకొక బాండ్ క్రియేట్ అయ్యింది. ప్లీజ్ ఇప్పుడు మీ సపోర్ట్ ప్రశాంత్‌కు చాలా అవసరం. నా ఫ్యాన్స్ ప్రశాంత్‌కు సపోర్ట్ చేయండి. స్పై ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయండి. అది చాలా అవసరం. ప్రశాంత్ నా తమ్ముడు, మీ తమ్ముడు. అందరం కలిసి ప్రశాంత్‌కు సపోర్ట్ చేద్దాం’’ అంటూ పిలుపునిచ్చాడు యావర్.






ప్రతీ విషయంలో జోక్యం ఉండదు


సంఘటన జరిగిన రెండురోజుల తర్వాత పల్లవి ప్రశాంత్‌తో బిగ్ బాస్ హౌజ్‌లో క్లోజ్‌గా ఉన్న శివాజీ, యావర్ స్పందించకపోవడంపై ప్రేక్షకుల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ విషయంపై మాట్లాడుతున్న సమయంలో శివాజీ కొన్ని సీరియస్ స్టేట్‌మెంట్స్ ఇచ్చాడు. ప్రశాంత్‌ను అరెస్ట్ చేసినప్పటి నుంచి తాను ప్రతీ విషయం ఫాలో అవుతున్నానని, తన ఫ్యామిలీతో టచ్‌లో ఉన్నానని బయటపెట్టాడు. అంతే కాకుండా ప్రతీ విషయంలో తన జోక్యం ఉందని చెప్పుకోవాల్సిన అవసరం లేదని, తామంతా హౌజ్‌లో కలిసిమెలిసి ఉన్నందుకు బయటికి వచ్చిన తర్వాత ప్రతీ విషయంలో జోక్యం చేసుకోవాలని కూడా అనుకోకూడదని ప్రేక్షకులకు సూటిగా చెప్పేశాడు శివాజీ.


స్పందించడానికి సమయం


ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరిలో భోలే షావలి మాత్రమే ముందుకు వచ్చి.. పల్లవి ప్రశాంత్ కేసును దగ్గరుండి ఫాలో అవుతున్నాడు. లాయర్స్‌ను సంప్రదిస్తున్నాడు. వారితో టచ్‌లో ఉంటున్నాడు. ఇక శివాజీ, యావర్ కూడా కేవలం సోషల్ మీడియా వేదికగానే స్పందించారు. అంతే కానీ పల్లవి ప్రశాంత్ కేసులో శివాజీ పర్సనల్‌గా ముందడుగు వేయడం లేదని వారిని ఓట్లు వేసిన ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ప్రశాంత్ గెలవడానికి తానే కారణం అన్నట్టుగా ప్రవర్తించే శివాజీ.. బయటికి వచ్చిన తర్వాత దుర్ఘటనలో తనకు తోడుగా నిలబడకపోగా.. స్పందించడానికి కూడా సమయం తీసుకున్నాడని తనపై ఫైర్ అవుతున్నారు.


Also Read: ప్రతీ విషయంలో జోక్యం చేసుకోవాలని అనుకోవద్దు - పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై శివాజీ స్పందన