Bigg Boss Telugu 6: ఆదివారం వచ్చిందంటే ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవడం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. అందులోనూ ఈసారి గీతూ ఎలిమినేట్ అయినట్టు లీకైంది. దాంతో అది నిజమో కాదో తెలుసుకోవడం కోసం మరీ ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో నాగార్జున ఫుల్ జోష్‌గా కనిపించారు. ఈరోజు పాటకు చిందులేస్తూ వచ్చారు నాగార్జున.
నాగార్జున ఎంట్రీతోనే గీతూతో మాట్లాడారు. ఆమె అన్న మాటలకు అర్ధాన్ని చెప్పారు. తరువాత పాము నిచ్చెన ఆట ఆడించారు. పాము బొమ్మను పెట్టి ఎవరినైతే మీరు పాము అనుకుంటున్నారో వారిని అక్కడ నిల్చోబెట్టి ఎందుకలా అనుకుంటున్నారో చెప్పమన్నారు. ఫైమా ఇనయాను ఇంట్లో పాము అని చెప్పింది. ఫ్రెండ్షిప్ పేరుతో కాలు వేసిందని, ఆ మచ్చలు ఇంకా పోవడం లేదని చెప్పింది. ఇక రాజ్ ఆదిని పాము అని చెప్పారు. ఆయన మైక్ విసిరేయడం వల్ల అందరం కెప్టెన్సీ కంటెండర్లం అయ్యే ఛాన్సు పోగొట్టుకున్నామని చెప్పారు. రేవంత్ వాసంతిని పాము అన్నాడు. ఆమె కళ్లు పాము కళ్లలా ఉంటాయని అందుకే అలా అన్నానని చెప్పాడు. దానికి నాగార్జున మీ ఆవిడ కళ్లు గుర్తపట్టలేకపోయావు కానీ, వాసంతి కళ్లు గుర్తుపట్టావా అని అడిగారు.
ఇక ఇనయా విషయానికి వచ్చిన నాగార్జున నీ మనసులో ఉన్నదేంటో నాకు అర్థమైంది అన్నారు. వెంటనే బిగ్‌బాస్ సీక్రెట్ రూమ్ ఓపెన్ చేయండి అని అడిగారు. ఇనయా నిజమే అనుకుని సీక్రెట్ రూమ్ వైపు పరుగెత్తింది. ఇనయాను ఎందుకలా పరుగులెత్తించారో మరి. సూర్య ఎప్పుడో బయటికి వచ్చేశారు. సీక్రెట్ రూమ్లో ఎవరూ లేరు. లేక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమైనా ఉందేమో చూడాలి. ఒక వేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే ఈపాటికి లీకువీరులు ఎప్పుడో లీక్ చేసే వారు. ఏమీ లేకుండా ఇనయాను ఎందుకలా పరుగులు పెట్టించారో ఎపిసోడ్లో చూడాలి.
గీతూ అవుట్?
ఈ వారం గీతూ ఎలిమినేట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు టాప్ 5లో ఉండే ప్లేయర్‌గా గీతూని చెప్పారు. ఆమె మైండ్‌తో ఆడుతుందని అన్నారు. కానీ ఆమె మైండ్‌తో ఆడేది తెలివైన గేమ్ కాదు, కన్నింగ్ గేమ్. అందుకే ప్రేక్షకులకు ఆమె ఆట కొంచెం కూడా నచ్చలేదు. పైగా ఆమె మాట్లాడేతీరు, పక్కవారికి గౌరవం ఇవ్వకపోవడం వంటివి కూడా బాగా ప్రభావం చూపాయి. నా భాష ఇంతే, నా యాస ఇంతే అంటుంది గీతూ కానీ ఆమె పెరిగిన ప్రాంతంలో అందరూ ఇలా ఇతరులతో అమర్యాదగా మాట్లాడడం, నడచుకోవడం చేయరు కదా. గీతూ మంచి గేమర్ అని నిరూపించుకుని బయటికి వెళ్లాలనుకుంది, కానీ విన్నర్ అయ్యేది మంచి గేమర్ మాత్రమే కాదు, మంచి లక్షణాలున్న వ్యక్తి కూడా అయి ఉండాలి. ఏ కోశాన చూసినా గీతూలో తక్కువనే చెప్పాలి. నిజంగానే గీతూ ఈ వారం బయటికి వెళ్లిందా లేదా తెలియాలంటే మాత్రం ఎపిసోడ్ అయ్యే వరకు వేచి చూడాలి.
Also read: గీతూ తప్పుకు శ్రీహాన్‌కు శిక్ష, ఫుడ్ విషయంలో ఇనయాను తప్పుబట్టిన నాగార్జున