Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులంతా వారమంతా ఇనాయను టార్గెట్ చేస్తుంటే, వీకెండ్లో వచ్చిన నాగార్జున కూడా ఆమెనే తప్పుబడుతున్నట్టు కనిపించారు. ఫైమా నోటికొచ్చినది మాట్లాడుతున్నా ఆమెను ఏమీ అనలేదు. మరి ప్రోమోలో అయితే ఫైమా వైపు మాట్లాడుతున్నట్టు కనిపించారు. మరి ఎపిసోడ్లో ఏమైనా ఫైమాకు క్లాసు తీసుకున్నారేమో చూడాలి. 

ప్రోమోలో ఏముందంటే...వీకెండ్ ఎపిసోడ్ కు సంబంధించి నాగార్జున చక్కగా రెడీ అయి వచ్చేశారు. ఈ వారం కొంతమందికి గట్టిగా క్లాసు తీసుకునే అవకాశం ఉందని ముందే ఊహించారు ప్రేక్షకులు. శ్రీహాన్, శ్రీసత్య, ఫైమా, ఇనాయ, రేవంత్‌కు క్లాసు తీసుకుంటారని అనుకున్నారు ఆడియెన్స్. వీరిలో మొదటి ప్రోమోలో రేవంత్, ఇనాయకు క్లాసు తీసుకున్నట్టు కనిపించింది. రేవంత్ మీద ఎవరికైనా కంప్లయింట్ ఉందా? అని అడిగారు నాగార్జున. రోహిత్ మాత్రమే నిల్చున్నాడు. సంచాలక్‌గా రేవంత్ ప్రవర్తన నచ్చలేదని చెప్పాడు రోహిత్. కానీ ఆదిరెడ్డి మాత్రం కరెక్టుగా ఉందని చెప్పాడు. దీంతో నాగార్జున ‘మీకు ఫేవర్‌గా డెసిషన్ ఉంది కాబట్టి మీకు సమస్య లేదా’ అని అడిగారు ఆదిరెడ్డి. రేవంత్ క్లాసు పీకారు నాగార్జున.  

ఇనాయ డైలాగ్ఇనయా నీకు కోపమొస్తే ఎందుకు మాటలు వదిలేస్తావు. ఎఫ్ పదాలు కూడా వాడేస్తావ్... అంటూ అడిగారు నాగార్జున. నామినేషన్లో నువ్వు ఫైమాని ఏమన్నావో తెలుసా? ఫైమా ప్రొఫెషన్‌ను చాలా పర్సనల్‌గా మాట్లాడావని నాకనిపించింది, అడల్ట్ కామెడీ స్టార్ అని అన్నావ్, మరి నిన్నేం పిలవాలి అంటూ నిలదీవారు నాగార్జున. ఇనాయలో ఇన్ని తప్పులు వెతికే నాగార్జునకు శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమా ఇనాయను అనే మాటలు కనిపించినట్టు, వినిపించినట్టు లేవు. 

ఈ వారం నామినేషన్లలో ఉన్న సభ్యులు ఎవరంటే...1. బాలాదిత్య2. మెరీనా3. ఫైమా4. వాసంతి5. కీర్తి6. ఇనాయ7. శ్రీహాన్8.ఆదిరెడ్డి9. రేవంత్

కాగా ఈ వారం మెరీనా, బాలాదిత్య బయటికి వెళ్లినట్టు సమాచారం. ఇంటి సభ్యులు ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. శనివారం ఒకరిని, ఆదివారం ఒకరిని బయటికి పంపినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ప్రవర్తనలో చాలా చక్కగా ఉంటారు. 

Also read: వరస్ట్ పెర్ఫార్మర్ అంటూ ఇనయాను జైలుకి పంపిన ఇంటిసభ్యులు - ఆమెపై నోరుపారేసుకున్న ఫైమా, ఆదిరెడ్డి