BiggBoss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6లో ఇనయాను చూస్తుంటే గత సీజన్లలో సింగిల్‌గా ఆడిన కౌశల్ మండా గుర్తొస్తారు ఎవరికైనా. ఆయనకు గత సీజన్లో కనీసం ఒక్కరు కూడా ఇంట్లో సపోర్ట్ దొరకలేదు. ఒంటరిగానే ఆడి గెలిచాడు. మరి ఇప్పుడు ఇనయా కూడా విన్నర్ అవుతుందా? ఆమె ఆటను ముందుకు సాగనివ్వకుండా శ్రీసత్య, శ్రీహాస్, ఫైమా, ఆదిరెడ్డి తెగ అడ్డుకుంటున్నారు. అప్పుడప్పుడు రేవంత్ కూడా వీరికి సహకరిస్తున్నాడు. మొన్నటి వరకు గీతూ చాలా అడ్డుకుంది. ఆమెను ఇంటికి పంపించేశారు ప్రేక్షకులు. ఇంత మంది తనమీదకి వస్తున్నా ఇనాయ ఆడేతీరు చూస్తుంటే మెచ్చుకోవచ్చు అనిపిస్తుంది. నామినేషన్లలో, ఆటలో, కెప్టెన్సీ పోటీలో మూకుమ్మడిగా ఆమెపై దాడి జరుగుతోంది. అయినా ధైర్యంగా, ఒంటరిగా పోరాడుతోంది. 


కెప్టెన్సీ కంటెండర్లుగా ఆదిరెడ్డి, ఇనాయ, ఫైమా, రోహిత్, శ్రీసత్య పోటీపడ్డారు. ఇందులో రోహిత్, ఇనాయను ముందుగా పంపేశారు. ఇనాయను పంపేటప్పుడు ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్య ఆమెనే టార్గెట్ చేసి ఆడారు. అలాగే రోహిత్ విషయంలో రేవంత్ సంచాలక్ గా సరిగా చేయలేదనిపించింది. ఇనాయ కలిసి ఆడారంటూ ఆదిరెడ్డి - ఫైమాలను కలిపి అంది. దానికి వీరిద్దరూ ఆమె మీదకు వెళ్లిపోయి పర్సనల్ ఎటాక్ చేశారు. ఆదిరెడ్డి ఓవర్ ఎక్స్ ప్రెషన్స్‌తో ‘నీకు కళ్లు నెత్తికెక్కాయి, నువ్వు ఫేక్, గోక్కోవడం అలవాడు, బ్రెయిన్ ఉందా’ అంటూ నోటికొచ్చింది వాగాడు. ఇక ఫైమా దొరికిందే ఛాన్సు అని రెచ్చిపోయింది. ‘అయ్యయ్యో ఇనాయ నీకు ఎవరూ సపోర్ట్ లేరా? ఇంకా ఎన్నో రోజులు హౌస్ లో ఉండవు ఇనాయ, ఉన్నన్ని రోజులైన సరిగా ఉండు’ అంటూ దిగజారి మాట్లాడింది. ఈమెకు రోజులు దగ్గరపడుతున్నట్టు కనిపిస్తున్నాయి. 


శ్రీసత్ - శ్రీహాన్ హగ్గులు
అదేంటో ఫైమా కెప్టెన్ అయితే ఆమెకు హగ్ ఇవ్వాల్సింది పోయి.. శ్రీహాన్, శ్రీసత్య ఆనందంగా కౌగిలించుకున్నారు. ఇనాయ కెప్టెన్ కాకూడదనే వారి కోరిక నెరవేరినందుకు, తమ గ్రూపులోని వ్యక్తి ఫైమా కెప్టెన్ అయినందుకు చాలా ఆనందించారు. 


ఫైమాను ఎత్తుకుని...
ఫైమా కెప్టెన్ అవ్వగానే ఇనాయ గొడవంతా మర్చిపోయి ఆమెను ఎత్తుకుని కెప్టెన్ ఫైమా అంటూ సంబరపడింది. ఆ సమయంలో ఫైమా ఇనాయను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమయంలో శ్రీహాన్ ఇద్దరూ కలిసిపోయిరు అంటూ వెటకారంగా అన్నాడు. 


వరస్ట్ కంటెస్టెంట్
ఇక ఇంట్లో ఈ వారం వరస్ట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పాలని బిగ్ బాస్ అడిగారు. దానికి ఎక్కువ మంది ఇనాయను టార్గెట్ చేశారు.దీంతో ఆమె జైలుకెళ్లాల్సి వచ్చింది. ‘నామినేట్ చేస్తారు లేదా జైలుకు పంపుస్తారు. కానీ ఇంట్లో ఉండాల లేదా అన్నది ప్రేక్షకులకు నిర్ణయిస్తారు’ అనుకుంటూ జైలుకి వెళ్లింది ఇనాయ. ఈవారం ఇనాయను ఆమె వ్యతిరేక వర్గమైన ఫైమా, ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీసత్య ఎక్కువగానే టార్గెట్ చేశారు. ఇంట్లో ఒకరిని తొక్కుతుంటే బయట ప్రేక్షకులు చూస్తూ ఊరుకుంటారా? అధికంగా ఓట్లేసి టాప్ 2లో ఆమెను నిల్చోబెడుతున్నారు. 


Also read: ఏందే? నువ్వు బాత్రూమ్‌లోకి వెళ్లి తలుపులేసుకుంటావ్, నేను డోర్లు తన్నుకునిపోతా - ఇనయాపై ఆదిరెడ్డి ఫైర్