Telugu Bigg Boss 7: ఇప్పటికే బిగ్ బాస్ ఇచ్చిన ఓటు అప్పీల్ టాస్కులలో గెలిచి శోభా, అర్జున్.. తమకు ఓట్లు వేయాలంటూ ప్రేక్షకులకు ఓటు అప్పీల్ చేసుకున్నారు. తరువాత ఓటు అప్పీల్ కోసం బిగ్ బాస్.. హౌజ్‌మేట్స్‌కు మరో ఛాలెంజ్ ఇచ్చారు. అందులో హౌజ్‌మేట్స్ అంతా స్టిక్కర్ ఉన్న జాకెట్స్ వేసుకొని, ఒకరినొకరు బాల్స్‌తో దాడి చేసుకోవాలి. బజర్ మోగే సమయానికి ఎవరి జాకెట్‌కు ఎక్కువ బాల్స్ ఉంటాయో.. వారే ఔట్. అయితే ఈ టాస్కులో మరో చిక్కు కూడా ఉంది. హౌజ్‌మేట్స్ అంతా గార్డెన్ ఏరియాలో లైన్ గీసి ఉన్న స్థలంలో మాత్రమే ఆడాలి. దానిని దాడి బయటికి రాకూడదు. ఇక ఈ టాస్కులో చాలా తెలివిగా యావర్‌ను గేమ్ నుంచి తప్పించింది లేడీ విలన్ శోభా.
శోభా ప్లాన్‌కు యావర్ బలి..
టాస్క్ మొదలయ్యింది. ఒకరిపై ఒకరు బాల్స్‌తో దాడి చేసుకోవడం మొదలుపెట్టారు. యావర్ తననే టార్గెట్ చేస్తున్నాడు అని శోభా ఫీల్ అవుతూ యావర్ దగ్గరికి వెళ్లి బాల్స్ వేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత యావర్ కూడా శోభాను పట్టుకొని తన జాకెట్‌కు బాల్స్ అతికించడం మొదలుపెట్టాడు. ఇదంతా చూస్తున్న అర్జున్.. ఫిజికల్ అవ్వకండి అని చెప్తున్నా.. వారు వినకుండా గేమ్‌లో లీనమయిపోయారు. ఆ తర్వాత తన జాకెట్స్‌కే ఎక్కువ బాల్స్ ఉన్నాయని గమనించిన శోభా.. బజర్ మోగక ముందే లైన్ నుంచి బయటికి వచ్చేసింది. తనపై ఇంకా బాల్స్‌తో దాడి చేద్దామని ఉద్దేశ్యంతో యావర్ కూడా లైన్ దాటి బయటికి వెళ్లాడు. ముందు శోభా బయటికి వెళ్లింది కాబట్టి తను మాత్రమే గేమ్ నుంచి ఔట్ అవుతుంది అనుకున్నాడు. కానీ అక్కడే యావర్‌కు బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు.
ఛీ.. తూ..
శోభాతో పాటు తాను కూడా లైన్ దాటి వెళ్లినందుకు యావర్ కూడా ఔట్ అని బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో యావర్‌కు కోపం వచ్చి ఇది కరెక్ట్ కాదు అంటూ అరవడం మొదలుపెట్టాడు. ఇదంతా శోభా వల్లే అనుకొని తనపై సీరియస్ అయ్యాడు. ‘ఛీ’ అని కూడా అనడం.. శోభాకు నచ్చలేదు. అలా అనకు అంటూ రివర్స్ అయ్యింది. అయినా యావర్ వినలేదు.. పదేపదే ఛీ, తూ అనుకుంటూ కోపడ్డాడు. సహనం కోల్పోయాడు. అర్జున్.. ఫిజికల్ అన్న మాటను గుర్తుచేసుకొని ‘‘నేను ఫిజికల్ అయ్యానా, ఇది కరెక్ట్ కాదు బిగ్ బాస్’’ అనుకుంటూ తన జాకెట్‌ను విసిరి పారేశాడు. అక్కడ ఉన్న బాల్స్‌ను కూడా విసరడం మొదలుపెట్టాడు. దీంతో తనను కంట్రోల్ చేయడానికి శివాజీ ముందుకు వచ్చాడు.
ఈవారం వెళ్లిపోయేది నేనే..
అలా కంట్రోల్ కోల్పోయి కోప్పడడం మంచిది కాదు అని యావర్‌ను పక్కకు తీసుకెళ్లిన శివాజీ సలహా ఇచ్చాడు. కోప్పడితే ఏం వస్తుంది అంటూ తనను కూల్ చేయబోయాడు. అయితే చాలారోజులు తాను కంట్రోల్‌లోనే ఉన్నానని, కావాలనే చేస్తున్నారని యావర్ సీరియస్‌గా చెప్పాడు. మొత్తానికి శివాజీ ఏదో ఒక విధంగా యావర్‌ను కంట్రోల్ చేశాడు. అయితే ముందుగానే ఓటు అప్పీల్ చేసుకున్నందుకు యావర్.. తనను కావాలనే టార్గెట్ చేశాడని ప్రియాంకతో చెప్తూ బాధపడింది శోభా. ఈవారం తాను ఎలాగైనా వెళ్లిపోతాను అని తెలిసినట్టుగా మాట్లాడింది. కానీ ఆడియన్స్‌పై తనకు నమ్మకం ఉందని కూడా చెప్పుకొచ్చింది. దాదాపు ఈ వారం ఎలిమినేషన్ తనదే అని శోభా ఫిక్స్ అయిపోయింది.
Also Read: బాలకృష్ణ కొత్త సినిమాలో తెలుగమ్మాయికి ఛాన్స్