Aishwarya Sindogi Files FIR Over Online Harassment: ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ వల్ల సెలబ్రిటీలకు ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో, ఇబ్బందులూ అలాగే న్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్లతో అభిమానులతో పాటు ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నారు. వాళ్ళతో ఛాట్ చేస్తున్నారు. కొన్నిసార్లు నెటిజనులు చేసే కామెంట్స్, తిట్లు, వేధింపులు కూడా భరించాల్సి వస్తోంది. ఆన్ లైన్ వేధింపుల బారిన పడుతున్న అందాల భామలు ఎంతో మంది.

Continues below advertisement

కన్నడ నటి, 'బిగ్ బాస్ కన్నడ' మాజీ కంటెస్టెంట్ ఐశ్వర్య సిందోగి సైతం ఆ వేధింపుల బారిన పడ్డారు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. కొంతకాలంగా తనను టార్గెట్ చేసి అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని, వాటి వల్ల తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నానని కంప్లైంట్ చేశారు ఐశ్వర్య సింధోగి.

తెలిసిన వ్యక్తి నుంచి వేధింపులు...ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి కామెంట్లు!బెంగళూరులోని సంజయ్‌ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఐశ్వర్య సిందోగి కంప్లైంట్ చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

Continues below advertisement

ఐశ్వర్య సిందోగికి తెలిసిన ఒక వ్యక్తి ఆమెపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపుల వెనుక ఉన్నారని ప్రాథమిక సమాచారం అందుతోంది. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, కంటిన్యూగా ఐశ్వర్య సిందోగి మీద ఆసభకరమైన కామెంట్లు, అభ్యంతరకరమైన పోస్టులు చేస్తున్నట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను దిగజార్చే విధంగా సదరు వ్యక్తి వ్యవహరిస్తున్నాడని ఐశ్వర్య సిందోగి ఆరోపించారు.

Also Read: Nagarjuna On Post Production Delays - వాయిదాలు ఎందుకు? టాలీవుడ్‌లో తప్పుల్ని బయటపెట్టిన నాగార్జున

ఐశ్వర్య సిందోగి పోలీస్ స్టేషన్ గడప తొక్కడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో తనపై ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ కంప్లైంట్ చేశారు. ఇప్పుడు అదే వ్యక్తి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం ద్వారా తన పోస్టులపై బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఫేక్ అకౌంట్స్ వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను రిక్వెస్ట్ చేశారు ఐశ్వర్య సిందోగి.

Also ReadAllu Arjun - National Awards 2026: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ... నేషనల్ అవార్డుల్లో బన్నీకి బెస్ట్ యాక్టర్‌ ఎందుకు రాలేదంటే?

ఐశ్వర్య సిందోగి ఫిర్యాదు మేరకు సంజయ్‌ నగర్ పోలీసులు సదరు సోషల్ మీడియా అకౌంట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. నకిలీ ప్రొఫైల్స్, వాటిని నిర్వహిస్తున్న ఐపి అడ్రస్‌లను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ సహాయం తీసుకుంటున్నారు. కన్నడ ఇండస్ట్రీలో అందాల భామలకు, మహిళలపై ఆన్‌ లైన్ వేధింపులు పెరుగుతున్నారని సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హీరోయిన్ రమ్య, దర్శన్ భార్య విజయలక్ష్మి సైతం తమపై జరుగుతున్న వేధింపులు, ఆన్‌ లైన్ ట్రోలింగ్‌పై కంప్లైంట్ చేశారు. ఆ కేసుల్లో నిందితులను వెంటనే పట్టుకున్నారు.

Also ReadRaw NTR Press Meet - ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్