Futa Japan: జపాన్‌కు చెందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్, మ్యూజిషియన్ ఫుతా బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలు పాల్గొన్నారు. ఆయన రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం.
రియల్ లైఫ్
ఫుతా జపాన్ దేశానికి చెందిన వ్యక్తి. అమెరికాలో దాదాపు 7 సంవత్సరాలు ప్రొఫెషనల్ డ్రమ్మర్ గా పనిచేశాడు. మ్యూజిక్ అంటే అతడికి ప్రాణం. యూఎస్‌లో ఉన్న సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన స్నేహితులు అతడికి పరిచయమయ్యారు. ఆ సమయంలో తెలుగు వారు చూపించిన ఆప్యాయత, వండిపెట్టిన వంటకాలు, కుటుంబ సభ్యుడిలా చూసుకున్న తీరు అతనికి బాగా నచ్చి తెలుగు భాష, సంస్కృతిపై ఆసక్తి పెంచుకున్నాడు.
సోషల్ మీడియా & పాపులారిటీ
జపాన్‌లో ఉంటూనే తెలుగు పాటలకు డాన్స్ చేయడం, తెలుగు పాపులర్ సినిమా డైలాగ్స్ చెప్పడం, రీల్స్, వీడియోస్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు ఫుతా. జపనీస్ కల్చర్, తెలుగు సంస్కృతిని మిక్స్ చేస్తూ సరదాగా వీడియోలు చేస్తూ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. Also Read: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
ఆసక్తికర విషయాలు
విదేశీయుడైనప్పటికీ స్పష్టంగా తెలుగు నేర్చుకోవడానికి ఫుతా నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. "తెలుగు ప్రజలు నాకు ఇచ్చిన ప్రేమకు ప్రతిఫలంగా ఏదైనా రిటర్న్ ఇవ్వడమే నా లక్ష్యం" అని తరచూ చెబుతుంటాడు ఫుతా. Also Read: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 (తెలుగు) అగ్నిపరీక్ష ఆడిషన్
ఫుతా బిగ్ బాస్ తెలుగు హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లాలని ఆడిషన్ వీడియో పంపగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ల ఎంపిక కోసం జరుగుతున్న 'అగ్నిపరీక్ష' ఆడిషన్ ఎపిసోడ్‌లో ఫుతా.. తన మ్యూజిక్, డాన్స్ టాలెంట్‌ను ప్రదర్శించాడు. తెలుగు సరిగ్గా రాకపోవడం వల్ల హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండటం కష్టమని మిగతా జడ్జీలు భావించినప్పటికీ, అతనిలోని ఉత్సాహాన్ని మెచ్చి జడ్జ్ అభిజిత్ అతనికి గ్రీన్ కార్డ్ ఇచ్చి ఫైనల్ రౌండ్‌కు పంపించాడు.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష తాజా ఎపిసోడ్‌లో జ్యోత్స్నా రెడ్డి, ఫుతా, అభిజ్ఞ, హేమంత్, ప్రియాంక ఐదుగురు తమ టాలెంట్‌ను చూపించే ప్రయత్నం చేశారు. ఈ ఆడిషన్‌లో స్పెషల్‌గా అనిపించింది జపాన్ నుంచి వచ్చిన ఫుతా. తన టాలెంట్‌తో జడ్జెస్‌ను ఆకట్టుకుని ఫైనల్ రౌండ్ చేశాడు.
Also Read: 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
