Uppal Balu Reaction Over Bigg Boss Agnipariksha Season 2 : బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగుతోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలుకు నెటిజన్స్ సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. జడ్జ్ నవదీప్‌తో పాటు యాంకర్ శ్రీముఖి తీరును తప్పుపడుతున్నారు.
'మీరు ట్రాన్స్ కదా?'
బిగ్ బాస్ అగ్నిపరీక్షలో తనను అవమానించారంటూ ఉప్పల్ బాలు తన ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశాడు. జియో హాట్ స్టార్‌లో శనివారం నుంచి అగ్నిపరీక్ష స్ట్రీమింగ్ అవుతోంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో ఉప్పల్ బాలును అవమానించినట్లుగానే జడ్జెస్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.
'నీలాంటి వారిని బిగ్ బాస్‌కు పంపించి సభ్య సమాజానికి ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలి.' 'నీ వీడియోస్ వల్గర్‌గా ఉంటాయి కదా?', 'మీకున్నది నిజమైన ఫ్యాన్స్ అని అనుకుంటున్నారా?' అంటూ జడ్జ్ నవదీప్ ప్రశ్నించారు. అలాగే, 'బాలు మీరు ట్రాన్స్ కదా?' అంటూ బిందు మాధవి ప్రశ్నించగా... 'కాదు మేడమ్. వీడియోస్ కోసం అలా నటించాను' అంటూ చెప్పారు. చివరకు ముగ్గురు జడ్జెస్ రెడ్ కార్డ్ ఇచ్చి అతన్ని బయటకు పంపించేశారు.
ఉప్పల్ బాలు ఫైర్
నవదీప్ తీరుపై ఉప్పల్ బాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా వీడియోస్ పోస్ట్ చేశారు. తనకు కనీసం ఒక టాస్క్ కూడా ఇవ్వకుండా ఏమీ ప్రశ్నించకుండా అవమానించారంటూ ఆవేదన చెందారు. 'నేను పేద కుటుంబం నుంచి వచ్చా. అగ్నిపరీక్షలో అందరికీ టాస్కులు ఇచ్చారు. నాకు మాత్రం ఇవ్వకుండా పిలిచి అవమానించారు.
అభిజీత్ నాకు గ్రీన్ కార్డు ఇవ్వబోతుంటే నవదీప్ అడ్డుకున్నారు. నీ వల్ల నాకు ఛాన్స్ రాలేదు. నాలా టాలెంట్ ఉన్న వారంతా అక్కడ నన్ను చాలా మెచ్చుకున్నారు. నేను సెలక్ట్ అయితానని అన్నారు. కానీ అలా జరగలేదు. నాకు సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్న వారందరికీ థాంక్స్' అంటూ వీడియోస్ రిలీజ్ చేశాడు.
జడ్జెస్ తీరుపై ఆగ్రహం
ఉప్పల్ బాలుపై నవదీప్ అలాంటి కామెంట్స్ చేయడం, హీరోయిన్ బిందు మాధవి అలా ప్రశ్నించడం కరెక్ట్ కాదని అంటున్నారు నెటిజన్స్. అలాగే, రన్నింగ్ రాజా అనే కంటెస్టెంట్‌పై యాంకర్ శ్రీముఖి ప్రవర్తించిన తీరును కూడా తప్పుబడుతున్నారు. 'టచ్ చేస్తే చెంపపై కొడతా' అంటూ అతనితో అనడంపై విమర్శలు వస్తున్నాయి. కంటెస్టెంట్స్‌ను తమ కామెంట్స్‌తో హర్ట్ చేస్తున్నారని... బిగ్ బాస్‌లో డర్టీ పాలిటిక్స్ ఎక్కువయ్యాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
