బిగ్‌బాస్ ఇంటి నుంచి ఎవ్వరు వచ్చినా కూడా ఇంత రెస్పాన్స్ రాలేదు, కానీ ఇనాయ ఎలిమినేట్ అవ్వగానే మాత్రం ట్విట్టర్ షేక్ అది. ‘ఇనాయ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండయ్యింది. ఆమె ఎలిమినేషన్ ప్రేక్షకులెవ్వరూ ఊహించలేదు. అంతెందుకు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లు కూడా ఆమె గెలుస్తుందేమో అనుకున్నారు. నిజంగా ఓట్లు తక్కువ పడే ఇనాయ బయటికి వచ్చిందంటే నమ్మడం కష్టంగానే ఉంది. వేదికపై నుంచి ఆమె నేరుగా BB Cafe‌లో యాంకర్ శివకు ఇంటర్య్వూ ఇచ్చింది ఇనాయ. ఈ ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోలో యాంకర్ శివ వంకర ప్రశ్నలకు వాయిస్ పెంచకుండానే ఇచ్చిపడేసింది ఇనాయ. అర్జున్ కళ్యాణ్, రాజశేఖర్ వంటి వారిని తన ప్రశ్నల ఉక్కిరి బిక్కిరి చేసిన యాంకర్ శివకు, ఇనాయతో మాట్లాడడం కొంచెం కష్టంగానే మారింది. శివ ఎన్నిరకాలుగా తిప్పి తిప్పి ప్రశ్నలు సంధించినా ఇనాయ తొణకకుండా సమాధానం ఇచ్చింది. 


ఇనాయ రాగానే శివ ‘ఎలా ఉన్నావ్’ అని అడిగితే, ఇనాయ ‘బాధగా ఉంది, మరొక్క వారం ఉండుంటే చాలా హ్యాపీగా ఉండేదాన్ని. అయినా 14 వారాలున్నాను’ అంది. శివ ‘ప్రతిసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నేనే అరిచేదానివి కదా’ అంటూ దెప్పిపొడిచినట్టు అడిగాడు శివ. వెంటనే ఇనాయ ‘ఎవరికి వారు అలా అనుకుని ఆడితేనే కుదురుతుంది’ అనగానే, ‘అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదా’ అన్నాడు శివ. దానికి ‘అది నామీద నాకున్న నమ్మకం’ కౌంటరిచ్చింది ఇనాయ. 


లవ్ అని చెప్పానా?
శివ ‘ఇనాయ మొదటి వారంలోనే బయటికి వచ్చేస్తుంది అనుకున్నారు. ఆ తరువాత గ్రాఫ్ అమాంతం పెరిగింది. తరువాత డౌన్ అవ్వడం మొదలైంది. సూర్యతో లవ్ ట్రాక్ విషయంలో డౌన్ అయింది’ అన్నాడు. దానికి ఇనాయ ‘నేనెప్పుడైనా లవ్ అని చెప్పానా?’ అని ప్రశ్నించింది. దానికి శివ దగ్గర మాటల్లేవ్. రేవంత్ దగ్గర సూర్య గురించి ఎందుకు మాట్లాడావ్ అని అడిగాడు శివ. దానికి ఇనాయ ‘నాకు కోపం వచ్చింది కాబట్టి మాట్లాడా’ అంది. ‘నీకు నచ్చక పోతే ఎన్ని స్టేట్ మెంట్లు అయినా వదులుతావ్’ అన్నాడు శివ, దానికి ఆమె ఊరుకోలేదు... ‘ఎన్ని స్టేట్ మెంట్లు కాదు, నాకనిపించింది చెప్తా’ అని సమాధానం ఇచ్చింది. రేవంత్ ఫోటో చూపించి ఆయన గురించి చెప్పమని అడిగాడు. దానికి ‘ఆయన ఇప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాడు, కాసేపటి తరువాత ఇంకోలా బిహేవ్ చేస్తాడు’ అని చెబుతుంటే మధ్యలో శివ ‘నీలాగా’ అన్నాడు. దానికి ఇనాయ ‘తన గురించి అడిగావు, నా గురించి ఎందుకు తీసుకువస్తున్నావ్, తను నేను ఒకలాగే బిహేవ్ చేస్తామా’ అని పశ్నించింది. దానికి శివ ‘నాకు తెలీదమ్మా’ అన్నాడు. ‘తెలియనప్పుడు ఎందుకు చెప్పావ్’ అని ప్రశ్నించింది ఇనాయ. శివ సమాధానం చెప్పకుండా అలా ఉండిపోయాడు. 



ఈ ఇంటర్య్వూ ప్రోమో వదిలితేనే కామెంట్లు వెల్లువలా వచ్చాయి. ఇందులో శివను తిడుతూ, ఇనాయను పొగుడుతూ ఎన్నో కామెంట్లు వచ్చాయి. అలాగే ఆమె ఎలిమినేషన్ పై కూడా అన్ ఫెయిర్ అంటూ కామెంట్లు పెట్టారు. ‘శివకి ఇనాయ మాత్రమే కౌంటర్ ఇవ్వగలదు’ అని ఒకరు కామెంట్ పెడితే, ‘ఇనాయ రాక్స్, శివ షాక్స్, ఆడియెన్స్ క్లాప్స్’ అంటూ మరొకరు రాసుకొచ్చారు. ఏదేమైనా ఇనాయ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. 


Also read: అన్యాయంగా అలా ఎలా తీసేస్తారండి ఇనయాను? - లక్షకు పైగా ట్వీట్లు