‘బిగ్ బాస్’లో నామినేషన్ల పర్వం సుదీర్ఘంగా సాగింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ నామినేషన్స్.. ‘బిగ్ బాస్’ హిస్టరీలోనే అత్యంత సుదీర్ఘంగా సాగింది. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్.. గౌతమ్, అమర్‌దీప్‌లతో నువ్వా.. నేనా అన్నట్లుగా పోట్లాడాడు. గౌతమ్, అమర్‌లు కూడా ఏ మాత్రం తగ్గలేదు. ప్రశాంత్ ఆటిడ్యూడ్‌ను కడిగిపడేశాడు. శివాజీకి చెంచాగిరి చేస్తున్నావ్ అన్నట్లుగా అమర్‌దీప్ కామెంట్లు చేయడం.. ‘‘నువ్వు రైతుబిడ్డవైతే నేను పులిబిడ్డ’’ అన్నట్లుగా గౌతమ్‌.. ప్రశాంత్‌తో గొడవపడ్డాడు. 


శివాజీ, భోలే కోసం నామినేషన్లు చేస్తున్న పల్లవి ప్రశాంత్


పల్లవి ప్రశాంత్ గౌతమ్‌ను నామినేట్.. ఏవేవో కారణాలు చెప్పకుంటూ వచ్చాడు. అసలు అతడు దేని కోసం నామినేట్ చేస్తున్నాడనే సందేహం కలగకమానదు. ఈ నామినేషన్స్‌లో కూడా శివాజీకి సపోర్ట్ చేస్తూనే గౌతమ్‌ను నామినేట్ చేశాడు పల్లవి ప్రశాంత్. ఇందుకు.. ఎప్పుడో జరిగిన ‘స్మైల్ ప్లీజ్’ టాస్క్‌ను ఉదాహరణగా చెప్పాడు. గౌతమ్ మెడకు తేజా బెల్ట్ వేసి లాగుతున్నప్పుడు శివాజీ అడ్డుకోకపోవడాన్ని సమర్ధించాడు. మెడకు బెల్ట్ వేస్తే ప్రమాదమని అన్నకు ఎలా తెలుస్తుంది.. నువ్వు ఆపు తేజా అనాలంటూ గౌతమ్‌ను ఇరిటేట్ చేశాడు. ఇందుకు గౌతమ్ గట్టిగానే సమాధానం ఇచ్చాడు. తేజా ఏ ఇంటెన్షన్‌తో అలా చేస్తున్నాడో నాకు ఎలా తెలుస్తుంది? అని గౌతమ్ అన్నాడు. ‘‘ఆ విషయంపై నాగ్ సార్ కూడా తేజా, సందీప్, శివాజీ‌లకు ఇచ్చిపడేశాడు. అది సిల్లీ ఎలా అవుతుంది. ఒక మనిషి ప్రాణం మీదకు వస్తే అది సిల్లీ పాయింట్ ఎలా అవుతుంది?’’ అని గౌతమ్ వాదించాడు. ‘‘నేను తేజాకు బెల్ట్ వేయక ముందే శివాజీ అడ్డుకున్నాడని, తనకు వేసినప్పుడు స్పందించకపోవడం ద్వంద వైఖరిగా అనిపించిందిన్నాడు. ‘‘పులి బిడ్డను ఇంకోసారి నామినేషన్స్ వేస్తే నరికి పారేస్తా.. అనే డైలాగ్ వేసి తొడలు కొట్టడం నాకు కూడా వచ్చు. మూసుకొని నామినేషన్ వేసుకో మచ్చా’’ అని గౌతమ్ వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ కూడా పైకి ఎగిరి రెండు తొడలు కొట్టాడు.  


కోపంతో కుర్చీని తన్నేసిన అమర్‌దీప్


పల్లవి ప్రశాంత్.. అమర్‌దీప్‌ను నామినేట్ చేశాడు. సుదీర్ఘ వాదనకు తెరలేపాడు. భోలే మా గ్రూపులో ఆడాడని, ఆయన్ని ఆడించకూడదనేది గ్రూప్ నిర్ణయమని తెలిపాడు. శివాజీ అన్న కోసం భోలే తన కంటెండర్‌షిప్‌ను త్యాగం చేశాడని పేర్కొన్నాడు. అలాంటివారిని ఎందుకు నామినేట్ చేశావని ప్రశాంత్ అడిగాడు. అలాగే భోలే త్యాగంతో కంటెండర్‌‌షిప్ సాధించిన శివాజీకి సపోర్ట్ చేయకుండా ఆయన ఫొటోను స్విమ్మింగ్ పూల్‌లో ఎందుకు పడేశావని అమర్‌ను ప్రశ్నించాడు. భోలే, శివాజీలకు సపోర్టుగా మాట్లాడుతూ అమర్‌దీప్‌ను నామినేట్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో అమర్‌దీప్.. కరెక్ట్ పాయింట్ చెప్పాలని, వారి గురించి నన్ను నామినేట్ చేయడం ఏమిటంటూ వాదన అమర్ వాదించాడు.  ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. మధ్యలో గౌతమ్, ప్రియాంకలు అమర్‌దీప్‌కు కొన్ని పాయింట్లు చెబుతూ సపోర్టుగా మాట్లాడారు. మరోవైపు భోలే, శివాజీలు పల్లవి ప్రశాంత్‌లకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. పల్లవి ప్రశాంత్‌తో వాదిస్తున్నప్పుడు భోలే మధ్యలో మాట్లాడటంతో ఆగ్రహానికి గురైన అమర్‌దీప్ కూర్చిని బలంగా తన్నేశాడు. ఆ తర్వాత శోభశెట్టి కూడా భోలేపై మండిపడింది. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని చిర్రుబుర్రులాడింది. తాజా ప్రోమోలో కూడా ఇదే చూపించారు. 



అమర్‌దీప్‌కు షాకిచ్చిన రతిక


శుభశ్రీ, శోభా, రతికాల్లో ఒకరికి ‘బిగ్ బాస్’ హౌస్‌లో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు బిగ్ బాస్ పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని బిగ్ బాస్ చెప్పడు. దీంతో హౌస్‌మేట్స్ ఎవరూ ఈ విషయాన్ని బయట మాట్లాడలేదు. అతి తక్కువ ఓట్లతో రతిక ఆదివారం హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూనే శివాజీ గ్రూపులో చేరిపోయింది. తన స్ట్రాటజీని అమలు చేసే విషయంలో మరింత గందరగోళంగా ఉన్నట్లుగా కనిపించింది. అయితే, కొన్ని విషయాల్లో ఇంకా పాత రతికనే కనిపించింది. ముఖ్యంగా అమర్‌దీప్ విషయం. అమర్‌దీప్.. రతికాకు ఓటేసినట్లు నేరుగా చెప్పకుండా.. ఆమె చేతిని పట్టుకుని నేనే నీకు ఓటు వేశాను అన్నట్లుగా సైగలు చేశాడు. అయితే, ఆ విషయం రతికాకు అర్థం కాలేదేమో అనిపించింది. ఎందుకంటే.. రతిక నామినేషన్స్‌లో అమర్‌దీప్‌ ఫొటోను కాల్చి నామినేట్ చేసింది. దీంతో అమర్‌దీప్‌ షాకయ్యాడు. రతికాకు హగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అసలు విషయం చెప్పి వాపోయాడు. రతిక శోభాశెట్టిని కూడా నామినేట్ చేసింది. 


Also Read: తేజా, అశ్వినీ ఫైట్ - పాపం, మధ్యలో భోలే షావలి పరువు తీసేశారు, చివరికి...