Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ తెలుగు అయిదు సీజన్లు, ఓటీటీ పూర్తయ్యాయి. ఇప్పుడు ఆరో సీజన్ నడుస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఇది పూర్తవుతుంది. విన్నర్ ఎవరో తేలాలంటే ఆదివారం రాత్రి వరకు ఆగాలి. అయితే ఈలోపే గూగుల్ ముందే కూసింది. ‘Who is the winner of Biggboss Season 6 Telugu’ అని టైప్ చేస్తే చాలు విన్నర్ పేరు చూపిస్తోంది. ‘రోహిత్ సాహ్ని’ పేరును చూపిస్తోంది. గతంలో కూడా గూగుల్ ఇలా చేసింది. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ పేరును కూడా ముందే అభిజిత్ పేరు చూపించింది. మళ్లీ ఇప్పుడు సీజన్ 6లో అలానే చూపిస్తోంది.


ప్రస్తుత పరిస్థితి, ఓటింగ్ చూస్తుంటే రేవంత్‌కు అధికంగా ఓట్లు పడుతున్నాయి. ఇక తరువాతి స్థానంలో రోహిత్, శ్రీహాన్ పేర్లు ఉన్నాయి. ఒక్కోసారి శ్రీహాన్ పేరు కూడా రెండో స్థానానికి వస్తోంది. ఇక కీర్తి, ఆదిరెడ్డి మాత్రం చివరి 4, 5 స్థానాల్లో ఉంటున్నారు. ప్రస్తుతం విన్నర్ అయ్యే అవకాశాలు రేవంత్, రోహిత్, శ్రీహాన్ లలో ఎవరో ఒకరికి ఉంది. ఇక బిగ్‌బాస్ ఓటింగ్ ప్రకారం వెళ్లకపోతే మాత్రం తనకు నచ్చిన వారికి  ఇచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆదిరెడ్డి కూడా లైన్లో ఉన్నట్టే. 


గెలుస్తాడా?
విన్నర్ మెటీరియల్ అంటే ఇలా ఉండాలి అనేట్టుగా ఉంది రోహిత్ బిగ్ బాస్ జర్నీ. చొక్కాలు చించుకుని ఆడితేనే విజేత కాదు, ఎలాంటి పరిస్థితులు వచ్చిన తట్టుకుని నిలబడాలి, సహనాన్ని కోల్పోకూడదు, మాటలు విసరకూడదు... ఇవన్నీ రోహిత్ లోనే పుష్కలంగా ఉన్న గుణాలు. రేవంత్ ఆట బాగా ఆడిన అతని ప్రవర్తన చాలా చికాకు కలిగించేలా ఉంటుంది. ప్రతి దానికి వాదన, విపరీతమైన కోపం చూడటానికి అంత ప్రశాంతంగా ఉండవు.  


సీరియల్ హీరో రోహిత్ సాహ్ని. సీరియల్స్‌లో చేసినప్పుడు వచ్చిన గుర్తింపు కంటే బిగ్‌బాస్ లో అడుగుపెట్టాకే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని ప్రవర్తన ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉండే రోహిత్ విన్నర్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అమ్మాయిల్లో కీర్తి, మెరీనా, అబ్బాయిల్లో రోహిత్ ఈ సీజన్లో చాలా కామ్ అండ్ కంపోజ్డ్. కాగా ఫైనల్లోకి వెళ్లేందుకు ఒక అడుగు దూరంలో ఉన్నాడు రోహిత్. మిడ్ వీక్ ఎలిమినేషన్లో కూడా సేవ్ అయితే అతడు ఫైనలిస్టు అయిపోతాడు. కాగా అతని జర్నీ వీడియోని వేశారు బిగ్ బాస్. 






Also read: మిడ్‌వీక్ ఎలిమినేట్ అయిన శ్రీసత్య? - ఇన్నాళ్లు ఉండడమే ఎక్కువ అంటూ నెటిజన్ల కామెంట్లు