వారియర్స్‌కు పనులు కేటాయించేందుకు బిగ్ బాస్ జాబ్ మేళా పెట్టగా.. ఛాలెంజర్స్ అందరూ డిసైడ్ చేసుకొని.. నటరాజ్ మాస్టర్,  తేజస్వి,అరియనా, అఖిల్ లను చెఫ్ లుగా ఎంపిక చేశారు. హౌస్‌ కీపింగ్ టీమ్ గా.. అషు, మహేష్, హమీద, సరయులను ఎంపిక చేశారు. మేనేజర్ గా ముమైత్ ను ఫైనల్ చేశారు. లంచ్ విషయంలో ఛాలెంజర్స్ అండ్ వారియర్స్ మధ్య డిస్కషన్ జరిగింది. ఆ తరువాత అషురెడ్డి, తేజస్విల మధ్య గొడవ జరిగింది. 


ఛాలెంజర్స్ టీమ్.. వారియర్స్ కి టాస్క్ లు ఇస్తుండడంతో అఖిల్.. చైతుపై కోప్పడ్డాడు. ఛాలెంజర్స్ టీమ్.. తమను సర్వెంట్స్ గా ట్రీట్ చేసే విధానం బాలేదని అఖిల్ ఫీలయ్యాడు. ఇంట్లో మన సర్వెంట్స్ ని అలా ట్రీట్ చేయం కదా అంటూ తన వారియర్స్ టీమ్ తో చెప్పాడు. మనం ఇన్స్పిరేషన్ తో ఉండాలే తప్ప.. వాళ్లు చెప్పే పనులన్నీ చేయడం కాదని మండిపడ్డాడు. ఫైనల్ గా వారియర్స్ టీమ్ అందరూ ఒకే మాటపై నిలబడాలని ఫిక్స్ అయ్యారు. 


అఖిల్ రెండు, మూడు సార్లు బిగ్ బాస్ పంపించిన టాస్క్ రూల్స్ చదివి వినిపించుకున్నాడు. తరువాత అఖిల్, ముమైత్, స్రవంతి, అజయ్ కూర్చొని మాట్లాడుకున్నారు. యాంకర్ శివ గురించి మాట్లాడుకున్నారు. 'అతడు బయట వేరు ఇక్కడ వేరు' అంటూ స్రవంతి చెప్పింది. శివ టూమచ్ చేస్తున్నాడని ముమైత్ అంది. ఇక అఖిల్ తనకు శ్రీరాపాకపై చాలా కోపమొచ్చిందని వారితో చెప్పాడు. పనిలో ఉన్నప్పుడు పిలిచి.. ఏం లేదు తరువాత మాట్లాడతా అని అనడం తనకు నచ్చలేదని అన్నాడు. మిగిలినవాళ్లంతా బెడ్ రూమ్ లో కూర్చొని మేనేజర్ ముమైత్ ఖాన్ బిహేవియర్ పై ఫన్నీ కామెంట్స్ చేసుకున్నారు. చైతు.. ముమైత్ ని ఇమిటేట్ చేసి అందరినీ నవ్వించాడు. 


నామినేషన్ ప్రక్రియ: ఈరోజే నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్. ఛాలెంజర్స్ టీమ్ నుంచి ప్రతి ఒక్కరూ.. వారియర్స్ టీమ్ నుంచి ఇద్దరు సభ్యులను ఇంటి నుంచి బయటకు పంపడానికి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఛాలెంజర్స్ టీమ్ సభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో.. వాళ్లకి కొన్ని ట్యాగ్స్ ను ఇచ్చి కారణాలు చెప్పి నామినేట్ చేయాలని చెప్పారు బిగ్ బాస్. అంటే ఈ వారం ఛాలెంజర్స్ టీమ్ నుంచి ఎవరూ కూడా నామినేషన్ లో ఉండరన్నమాట.


శివ - సరయుకి అగ్రెసివ్ ట్యాగ్ ఇచ్చిన శివ.. ఆమె సడెన్ గా సీరియస్ అయిపోతుందని కారణం చెప్పాడు. ముమైత్ కి కూడా అదే ట్యాగ్ ఇచ్చి నామినేట్ చేశాడు శివ. ఈ విషయంలో ముమైత్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. 


మిత్ర శర్మ - అరియనాతో బాండింగ్ లేదని రీజన్ చెప్పి ఆమెని నామినేట్ చేసింది. ఈ విషయంలో అరియానా సీరియస్ అయింది. బయటకి పంపించేస్తూ.. బాండింగ్ అవ్వట్లేదని చెత్త కారణమని ఫైర్ అయింది. ఆ తరువాత నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ.. పక్షపాతంగా ఉంటున్నారని చెప్పింది. 


ఆర్జే చైతు - హమీదని నామినేట్ చేస్తూ.. ఆమె నుంచి నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయని చెప్పింది. దీంతో హమీద చాలాసేపు చైతుతో వాదించింది. తరువాత నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ.. బాడీ షేమింగ్ చేశారని రీజన్ చెప్పాడు. దీంతో నటరాజ్ మాస్టర్ సీరియస్ అయ్యారు. ప్లాన్ చేసుకొని తనను నామినేట్ చేస్తున్నారని కామెంట్ చేశారు నటరాజ్ మాస్టర్ 


అజయ్ - నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ.. టాస్క్ లో అతడి బిహేవియర్ నచ్చలేదని రీజన్ చెప్పాడు. తరువాత సరయుని నామినేట్ చేశాడు. 


శ్రీరాపాక - అరియనాను నామినేట్ చేస్తూ.. డ్రామా క్వీన్ అని ట్యాగ్ ఇచ్చింది. దీంతో అరియనా వాదిస్తూ.. తన వెర్షన్ చెప్పింది. తరువాత ముమైత్ ని నామినేట్ చేసింది. 


అనిల్ రాథోడ్ - నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ.. ఆయనతో అసలు బాండింగ్ లేదని కారణం చెప్పాడు. సరయుతో మాట్లాడాలంటే ఆలోచించాల్సి వస్తుందని రీజన్ చెబుతూ.. ఆమెని నామినేట్ చేశాడు. దీంతో సరయు సీరియస్ అయింది. తప్పుగా అర్ధం చేసుకుంటూ.. తనను నామినేట్ చేస్తున్నారని మండిపడింది. 


బిందు మాధవి - అఖిల్ కారణంగానే గేమ్ ఆగిందని, అందరినీ కంట్రోల్ చేస్తున్నాడని రీజన్స్ చెబుతూ అతడిని నామినేట్ చేసింది. దీంతో అఖిల్ తన కారణంగా ఎక్కడా గేమ్ ఆగలేదని.. బిందుతో వాదించాడు. ఇద్దరూ కాసేపు ఆర్గ్యూ చేసుకున్నారు. తరువాత ముమైత్ ఖాన్ ని నామినేట్ చేస్తూ.. మేనేజర్ గా తన వర్క్ సరిగ్గా చేయలేదని కారణం చెప్పింది. 


స్రవంతి చొక్కారపు - హమీద ఎక్కువగా రియాక్ట్ అవుతుందని కారణం చెబుతూ నామినేట్ చేసింది. తరువాత నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేసింది. 


ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే.. నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, హమీద, అరియానా, అఖిల్. 


Also Read: 'బిగ్ బాస్ మేళా' ఎవరెవరికి ఏ పనులు కేటాయించారంటే?