వారియర్స్‌కు పనులు కేటాయించేందుకు బిగ్ బాస్ జాబ్ మేళా పెట్టగా.. ఛాలెంజర్స్ అందరూ డిసైడ్ చేసుకొని.. నటరాజ్ మాస్టర్,  తేజస్వి,అరియనా, అఖిల్ లను చెఫ్ లుగా ఎంపిక చేశారు. హౌస్‌ కీపింగ్ టీమ్ గా.. అషు, మహేష్, హమీద, సరయులను ఎంపిక చేశారు. మేనేజర్ గా ముమైత్ ను ఫైనల్ చేశారు. లంచ్ విషయంలో ఛాలెంజర్స్ అండ్ వారియర్స్ మధ్య డిస్కషన్ జరిగింది. రేషన్ గురించి ఛాలెంజర్స్ పట్టించుకోవడం లేదని ముమైత్.. వారియర్స్ టీమ్ కి చెప్పడంతో అషు నేరుగా వెళ్లి శివను నిలదీసింది. 


దీంతో శివ.. మేనేజర్ ముమైత్ ఖాన్ ను ప్రశ్నించాడు. ఛాలెంజర్స్ అలా చెప్పలేదని.. మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారని అన్నాడు. దీంతో ముమైత్ వెళ్లి  అషురెడ్డిని ప్రశ్నించింది. ఇక్కడ విషయాలు అక్కడ చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చింది. దీంతో అషు హర్ట్ అయింది కానీ అక్కడితో వదిలేసింది. కానీ తేజస్వి ఆ టాపిక్ ను ఎక్స్టెండ్ చేస్తూ.. 'ఇందాక నటరాజ్ మాస్టర్ తో పెరుగు తీసుకెళ్లి వాళ్ల(ఛాలెంజర్స్) మోహన కొడతానని సరదాగా డిస్కస్ చేస్తుంటే.. అషు కల్పించుకొని ఆ వర్డ్ వాడొద్దని చెప్పిందని' తేజస్వి తెలిపింది. 


తను ఎలా ఉండాలో కూడా ఆమె చెప్పేస్తుందని అనగా.. అషురెడ్డి తన వెర్షన్ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ తేజస్వి మాత్రం వినలేదు. కావాలనే నన్ను, నటరాజ్ మాస్టర్ ని తప్పుగా పోట్రే చేస్తుందంటూ మండిపడింది. దీంతో అషు సైలెంట్ అయిపోయింది. రెండో రోజే హౌస్ లో గొడవలు పడడంతో ముందు ముందు ఇంకెన్ని గొడవలు జరుగుతాయో! 






బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే:
వారియర్స్: 
1. అషురెడ్డి (సీజన్ 3)
2. మహేష్ విట్టా (సీజన్ 3)
3. ముమైత్ ఖాన్ (సీజన్ 1)
4. అరియనా (సీజన్ 4)
5. నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)
6. తేజస్వి మదివాడ (సీజన్ 2)
7. సరయు (సీజన్ 5)
8. హమీద (సీజన్ 5) 
9. అఖిల్ సార్థక్ (సీజన్ 4)


ఛాలెంజర్స్:
1. ఆర్జే చైతు (ఆర్జే)
2. అజయ్ కతుర్వర్ (నటుడు)
3. స్రవంతి చొక్కారపు (యాంకర్)
4. శ్రీరాపాక (నటి)
5. అనిల్ రాథోడ్ (మోడల్)
6. మిత్రా శర్మ (నటి, నిర్మాత)
7. యాంకర్ శివ (యూట్యూబ్ యాంకర్)
8. బిందు మాధవి (హీరోయిన్) 


Also Read: 'బిగ్ బాస్ మేళా' ఎవరెవరికి ఏ పనులు కేటాయించారంటే?


Also Read: నన్ను పెళ్లి చేసుకుంటావా? చైతూకు సరయు ఆఫర్, హమీదాకు వాతలు పెడతానన్న నటరాజ్!