వారియర్స్‌కు పనులు కేటాయించేందుకు బిగ్ బాస్ జాబ్ మేళా పెట్టాడు. ఈ సందర్భంగా వారియర్స్‌ను చాంఫియన్స్ ఇంటర్వ్యూ చేసి పనులు కేటాయిస్తారు. ఆ పనులకు సంబంధించిన ట్యాగ్‌ను వారికి ఇస్తారు. వారియర్స్ సక్రమంగా పనిచేసేందుకు వారిలో ఒకరిని మేనేజర్‌గా ఎంపిక చేస్తారు. 


ముందుగా అషురెడ్డి బాత్రూమ్స్ క్లీన్ చేస్తానని చెప్పింది. ఇదివరకు సీజన్ లో ఎక్కువగా బాత్రూమ్స్ క్లీనింగ్ ఎక్కువగా చేశానని.. సో తనకు ఆ పని అయితే సులువుగా ఉంటుందని చెప్పింది. ఆ తరువాత అఖిల్ తనకు మేనేజర్ గా చేయాలని ఉందని చెప్పగా.. ఛాలెంజర్స్ అతడిని ప్రశ్నించారు. కుకింగ్, హౌస్ కీపింగ్ లో ఏమైనా చేయగలవా..? అని అడిగారు. తనకు వంట రాదని, తను 100% ఇవ్వలేనని.. ఆ టీమ్ లో ఉండడం వృధా కదా అని చెప్పాడు. బెస్ట్ ఫుడ్ సర్వ్ చేయాలంటే వంట వచ్చినవాళ్లే ఉండాలని చెప్పాడు. మేనేజర్ అవ్వడానికి కావాల్సిన క్వాలిటీస్ తనకు ఉన్నాయని అఖిల్ చెప్పాడు. 


అరియనా తను ఏ పనైనా చేయగలనని ఛాలెంజర్స్ కి చెప్పింది. ఈ క్రమంలో వారు అడిగే ప్రశ్నలకు ఫన్నీగా సమాధానాలు చెప్పింది. తనకు మేనేజర్ పొజిషన్ వద్దని.. పనులు బాగా చేయగలనని.. బ్రేక్ ఫాస్ట్ త్వరగా సర్వ్ చేయగలనని చెప్పారు. మేనేజర్ జాబ్ చేయగలరా..? అని ప్రశ్నించగా.. ప్రయత్నిస్తానని కొంచెం యాటిట్యూడ్ తో చెప్పడంతో ఛాలెంజర్స్ అప్సెట్ అయ్యారు. పొగరుగా సమాధానం చెప్పడం కరెక్ట్ కాదని.. కాస్త రెస్పెక్ట్ ఇవ్వాలంటూ ఛాలెంజర్స్ చెప్పారు. ఇక సరయు తను ఏ పనైనా చేస్తానని చెప్పగా.. ఛాలెంజర్స్ తమ ప్రశ్నలతో ఆమెని ఇబ్బందిపెట్టారు . పని చేయగలనని.. పెర్ఫెక్ట్ గా అంటే ఏదీ చెప్పలేనని.. క్లీనింగ్ మాత్రం బాగా చేయగలనని చెప్పింది. హమీద తనకు వంట చేయడం ఇష్టమని.. కుకింగ్ సెక్షన్ లో అయితే బెస్ట్ ఇవ్వగలనని చెప్పింది. 


ఫైనల్ గా ఛాలెంజర్స్ అందరూ డిసైడ్ చేసుకొని.. నటరాజ్ మాస్టర్,  తేజస్వి,అరియనా, అఖిల్ లను చెఫ్ లుగా ఎంపిక చేశారు. హౌస్‌ కీపింగ్ టీమ్ గా.. అషు, మహేష్, హమీద, సరయులను ఎంపిక చేశారు. మేనేజర్ గా ముమైత్ ను ఫైనల్ చేశారు.


బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే:
వారియర్స్ టీమ్: 
1. అషురెడ్డి (సీజన్ 3)
2. మహేష్ విట్టా (సీజన్ 3)
3. ముమైత్ ఖాన్ (సీజన్ 1)
4. అరియనా (సీజన్ 4)
5. నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)
6. తేజస్వి మదివాడ (సీజన్ 2)
7. సరయు (సీజన్ 5)
8. హమీద (సీజన్ 5) 
9. అఖిల్ సార్థక్ (సీజన్ 4)


ఛాలెంజర్స్:
1. ఆర్జే చైతు (ఆర్జే)
2. అజయ్ కతుర్వర్ (నటుడు)
3. స్రవంతి చొక్కారపు (యాంకర్)
4. శ్రీరాపాక (నటి)
5. అనిల్ రాథోడ్ (మోడల్)
6. మిత్రా శర్మ (నటి, నిర్మాత)
7. యాంకర్ శివ (యూట్యూబ్ యాంకర్)
8. బిందు మాధవి (హీరోయిన్) 


Also Read: నన్ను పెళ్లి చేసుకుంటావా? చైతూకు సరయు ఆఫర్, హమీదాకు వాతలు పెడతానన్న నటరాజ్!


Bigg Boss Non Stop (Bigg Boss Telugu OTT) అప్ డేట్స్, ఆసక్తికర సంగతులు, టాస్క్‌ల వివరాల కోసం మా Bigg Boss Non Stop Live Update పేజ్‌ను క్లీక్ చేసి చూడండి. ఈ పేజ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం ద్వారా ప్రతి అప్‌డేట్‌ను తెలుసుకోవచ్చు.