Bigg Boss 6 Telugu: సన్ డే ఫన్ డే అంటారు కానీ బిగ్ బాస్ హౌస్ లో అది కచ్చితంగా ఎలిమినేషన్ డే. ప్రోమో మొదలవ్వగానే ఇంటి సభ్యుల చేత ఆటలు ఆడించారు నాగార్జున. ఇంటి సభ్యులు కూడా ఆటలు పాటలతో అదరగొట్టారు. పూలు గార్డెన్లో పెట్టి ఇంటి సభ్యులను తుమ్మెదల్లా రెడీ అయ్యారు. పాట వేసినప్పుడుల్లా చిందులేశారు. పాట ఆగగానే పూల దగ్గర వెళ్లి నిల్చోవాలి. ఎవరికైతే పువ్వు దక్కతో వారు అవుట్ అయినట్టు. అలా ఒక్కొక్కరూ ఎలిమినేట్ అయి చివరకి ఒకరు విన్నర్ అవుతారు. అందరూ ఉత్సాహంగా చిందులేశారు.
కాగా చివరికి ఎలిమినేషన్ చేసే రౌండ్ చూపించారు. అందులో చివరికి శ్రీసత్య - గీతూ కనిపించారు. వీళ్లిద్దరే ఇంట్లో రచ్చరచ్చ చేసే బ్యాచ్. వీరిద్దరూ కలిస్తే ఎదుటివారిని ఇబ్బంది పెట్టడంలో ముందుంటారు. వారిద్దరి ముందు ఫిష్ బౌల్స్ పెట్టారు. ఇద్దరికీ చెరో లిక్విడ్ ఉన్న బాటిల్ వారి ముందు పెట్టారు. ఆ లిక్విడ్‌ను ఆ ఫిష్ బౌల్స్‌లో ఒంపమని చెప్పారు. ఎవరి రంగు అయితే ఆకుపచ్చ రంగులోకి మారుతుందో వారు సేఫ్. రెడ్ రంగులోకి మారిన వారు ఎలిమినేట్ అని చెప్పారు నాగార్జున.
శ్రీసత్య, గీతూ ఇద్దరి ముఖాలు వాడిపోయి కనిపించాయి. ముఖ్యంగా గీతూ ముఖం మాడిపోయింది. ఆమెనే ఎలిమినేట్ అయినట్టు వార్త వచ్చింది. ప్రతి ఒక్కరు టాప్ 5లో ఉండే ప్లేయర్‌గా గీతూని చెప్పారు. ఆమె మైండ్‌తో ఆడుతుందని అన్నారు. కానీ ఆమె మైండ్‌తో ఆడేది తెలివైన గేమ్ కాదు, కన్నింగ్ గేమ్. అందుకే ప్రేక్షకులకు ఆమె ఆట కొంచెం కూడా నచ్చలేదు. పైగా ఆమె మాట్లాడేతీరు, పక్కవారికి గౌరవం ఇవ్వకపోవడం వంటివి కూడా బాగా ప్రభావం చూపాయి. నా భాష ఇంతే, నా యాస ఇంతే అంటుంది గీతూ కానీ ఆమె పెరిగిన ప్రాంతంలో అందరూ ఇలా ఇతరులతో అమర్యాదగా మాట్లాడడం, నడచుకోవడం చేయరు కదా. గీతూ మంచి గేమర్ అని నిరూపించుకుని బయటికి వెళ్లాలనుకుంది, కానీ విన్నర్ అయ్యేది మంచి గేమర్ మాత్రమే కాదు, మంచి లక్షణాలున్న వ్యక్తి కూడా అయి ఉండాలి. ఏ కోశాన చూసినా గీతూలో తక్కువనే చెప్పాలి.
సంచాలక్‌గా వరస్ట్ గా ప్రవర్తించి నాగార్జున చేత తిట్లు తింది గీతూ. పోనీ ఆ తరువాత వీక్ అంటే ఈ వీక్ ఏమైనా బాగా ఆడిందా అంటే తన ఆటతో పాటూ రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్ ఆటలకు కూడా రిమోట్ కంట్రోల్ లా మారింది. బిగ్ బాస్ చెప్పినదానికన్నా ఈమె చెప్పింది విన్నారే రెడ్ టీమ్ సభ్యులు. ఆమె బాలాదిత్య సిగరెట్లు దాచేయడం, అది కూడా మైండ్ గేమ్ అంటూ ఆయనతో బేరమాడడం ప్రేక్షకులకు పరమ చిరాకు తెప్పించింది. అందుకే ఎలిమినేట్ అయిందని చెప్పచ్చు.
Also read: ఇనయా కోసం సీక్రెట్ రూమ్ ఓపెన్ చేయండి బిగ్‌బాస్ - నాగార్జున