Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నామినేషన్ అంటే ఒక రకంగా హౌస్ మేట్స్ అందరికీ గుండె దడ పుడుతుంది. ఆ టెన్షన్ లోనే ఎవరైనా తమను నామినేట్ చేస్తే అక్కడే ఇచ్చిపడేస్తారు. అవసరం అయితే కొట్టుకోవడానికి కూడా సిద్ధం అవుతారు. దాని కోసమే చాలామంది బిగ్ బాస్ అనే ఈ రియాలిటీ షోను చూస్తారు కూడా. ఈ రెండ్రోజులు అదే రచ్చతో బిగ్ బాస్ హౌజ్ టాప్ లేపేశారు కంటెస్టెంట్స్. కలలో కూడా కంటెస్టెంట్స్ నామినేషన్లలో ఉండాలని కోరుకోరు కదా మరి. నామినేషన్లలో ఉన్నా సేవ్ అవుతారా? అనేది అనుమానమే. గత సీజన్లలో ఎంత ఫాలోయింగ్ ఉన్నా కొంతమందిని బిగ్ బాస్ త్వరగానే హౌజ్ లో నుంచి బయటకు పంపారు. కాబట్టి ఎవరు ఉంటారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనేది ఊహించడం కాస్త కష్టమే. కాకపోతే ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం కొంతవరకు వీకెండ్ ఏం జరగబోతోంది అనే విషయాలను ఊహించవచ్చు. ఇక కంటెస్టెంట్స్ ను బూచిలా భయపెట్టే ఈ నామినేషన్ తాజా సీజన్లో మాత్రం ఫస్ట్ వీక్ లోనే కంటెస్టెంట్ పృథ్వీకి ప్లస్ పాయింట్ అయ్యింది. పైగా ఆయనకి హౌస్ లో ఉన్న వారిలో ముగ్గురు కారణం అయ్యారు. 


Read Also : BiggBoss Naga Manikanta Trolls : బిగ్​బాస్​ మణికంఠది ఒరిజినల్ జుట్టు కాదా? విగ్​నా?


ఓటింగ్ రిజల్ట్స్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. హౌజ్ లో అసలు ఉన్నారా లేరా అనిపించే కంటెస్టెంట్స్ లిస్టులో పృథ్వీ కూడా ఉంటాడు. అనవసరంగా గొడవల జోలికి వెళ్లడు. అలాగే ఎక్కడైనా వాయిస్ రైజ్ చేయాల్సి వస్తే ఏ మాత్రం వెనకడుగు వేయడు. సాధారణంగా గట్టిగా మాట్లాడని పృథ్వీ నామినేషన్లలో మాత్రం నోటిని అదుపులో పెట్టుకోలేకపోయాడు. బేబక్కపై ఫైర్ అయ్యి, అంతలోనే ఆమె కాళ్ళు మొక్కి మరీ సారీ చెప్పాడు. ఇంకేముంది పృథ్వీ మంచితననికి ఫిదా అయ్యారు ఆడియన్స్. నిజానికి తప్పును ఒప్పుకుని అలా సారీ అడగడం అన్నది మెచ్చుకోవాల్సిన విషయమే. అలాగే అతను మాట్లాడే పాయింట్ కూడా వాల్యుబుల్ అనిపిస్తుంది. కూల్ గా ఉంటూనే తన గేమ్ తాను ఆడుతున్నాడు. అయితే ఈ కన్నడ బ్యాచ్ అంతా కలిసే గేమ్ ఆడుతున్నారు అనే వాదన బయట ఉండనే ఉంది. అది వేరే స్టోరీ అనుకోండి. ఇక ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే హౌస్ లోకి వచ్చాక పర్వాలేదు అనిపిస్తున్న పృథ్వీకి బయట చెప్పుకోదగ్గ విధంగా ఫాలోయింగ్ అయితే లేదు. అయినప్పటికీ ఈ కంటెస్టెంట్ ఈ వారం నామినేషన్ సంబంధించిన ఓటింగ్ లో మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 


Read Also : BiggBossTelugu 8 Day 4: నోటి దూల మంచిదేనా? తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ విష్ణు ప్రియ


హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో నలుగురు కన్నడ బ్యాచ్ అన్న విషయం తెలిసిందే. ఇదే ఇప్పుడు నామినేషన్లలో ఉన్న పృథ్వికి హెల్ప్ అయ్యింది. మామూలుగానే ఈ నలుగురు కలిసికట్టుగా ఆట ఆడుతున్నారు. ఈ లిస్ట్ లో యష్మీ, నిఖిల్, నైనిక, పృథ్వీ ఉన్నారు. అయితే ఇప్పుడు  ఈ నలుగురిలో ముగ్గురు చీఫ్ స్థానంలో ఉండడంతో ఆ ముగ్గురు సేవ్ అయినట్టే. ఈ కన్నడ బ్యాచ్ కు సంబంధించిన ఒకే ఒక్కడు పృథ్వీ మాత్రం నామినేషన్లలో ఉన్నాడు. కాబట్టి అతనికి తన సీరియల్ ఫాలోవర్స్ నుంచి మాత్రమే కాకుండా ఈ నలుగురి అభిమానులు కూడా ఓట్లు గుద్దే ఛాన్స్ మెండుగా ఉంది. దానివల్లే పెద్దగా గేమ్ ఆడకపోయినా పృథ్వీ ఇప్పుడు ఓటింగ్ పరంగా టాప్ 3లో ఉన్నాడు. అయితే రానున్న రోజుల్లో ఇది కంటిన్యూ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్లలో మరో ఇద్దరు నామినేషన్లలో ఉన్నారంటే ఈ ఓటింగ్ చీలే అవకాశం ఉంది.